చైనా కరోనా వ్యాక్సిన్ ప్రయోగం కోతుల్లో సక్సెస్

కరోనా తో తీవ్రంగా దెబ్బతిని కోలుకున్న చైనా తన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ పరీక్షలు విజయవంతమయ్యాయని ప్రకటించింది. పికోవాక్ (PiCoVacc) పేరుతో తయారుచేసిన COVID-19 వ్యాక్సిన్ కోతుల మీద జరిపిన పరీక్షలలలో విజయవంతమయిందని చైనా ట్వీట్ చేసింది.
ఈ  వ్యాక్సిన్ ఎక్కించిన కోతులను మూడు వారాల పాటు కరోనావైరస్ కు  ఎక్స్ పోజ్ చేసిన వైరస్ కోతుల ఉపరితిత్తులలోకి వెళ్లలేకపోయిందని  చైనా  సైన్స్ పేర్కొంది. ఏప్రిల్ మధ్య నుంచి ఈ వ్యాక్సిన్ ను చైనా మనుషుల మీద కూడా ప్రయోగిస్తున్నట్లు చైనా పేర్కొంది.
PiCoVacc వ్యాక్సిన్ ను బీజింగ్ లోని సినోవాక్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ.  నిర్వీర్యమ్ చేసిన వైరస్ ని కోతులకు ఎక్కించి కోతి శరీరంలో వైరస్ ను చంపి కణాలు (యాంటి బాడీస్ ) తయారయ్యే సాధారణ విధానంతోనే చైనా వ్యాక్సిన్ ను రూపొందించింది. చైనా ఉపయోగించిన కోతులు భారతదేశంలో పెరిగే macaque కోతులు. మొదట ఈ కోతులకు  వ్యాక్సిన్ ఎక్కించారు. తర్వాత ఈ కోతులకు నావెల కరోనా వ్యాక్సిన్ సోకించే ప్రయత్నం చేశారు. ఇది మూడు వారాల పాటు సాగింది. మరొక తర్వాత ఈ కోతులను పరీక్షించారు. ఇందులో పెద్ద మోతాదులో వ్యాక్సిన్ తీసుకున్న కోతుల ఊపిరితిత్తుల లో వైరస్ కనిపించలేదు. అంటే వ్యాక్సిన్ పనిచేసి వైరస్ దాడిని అడ్డుకుందని అర్థం. ఇదే సమయంలో వ్యాక్సిన్ ఎక్కించని కోతులలో మాత్రం తీవ్రమయన న్యమోనియా వ్యాధి కనిపించింది. తర్వాత ఈ వ్యాక్సిన్ ను చైనా మనుషుల మీద కూడా ప్రయోగించడం మొదలుపెట్టింది..
కోవిడ్-19 కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచమంతా ప్రయత్నాలు సాగుతున్నాయి.  మూడు రోజుల కిందట ఇజ్రేల్ ఒక ఔషధాన్ని తయారుచేస్తే, ఒక ఇటలీకంపెనీకూడా ఒక వ్యాక్సిన్ ను రూపొందించింది.
చైనాకే చెందిన మరొక మిలిటరీ సంస్థ Sinopharma కూడా PiCoVacc  పద్ధతిలోనే ఇంకొక వ్యాక్సిన్ క్యాండిడేట్ ను తయారు చేసింది. ఇది రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది.

A #COVID19 vaccine, PiCoVacc, developed in China has been proven effective in monkeys. Monkeys injected the vaccine did not have the virus in their lungs after being exposed to the virus for three weeks. The vaccine has been undergoing human tests in China since mid-April.