Home Features అమ్మో ఇంత కథ నడిచిందా? ఆంధ్రా సీనియర్ ఐపిఎస్ అధికారి చేసిందేమిటి?

అమ్మో ఇంత కథ నడిచిందా? ఆంధ్రా సీనియర్ ఐపిఎస్ అధికారి చేసిందేమిటి?

139
0
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అలూరు బాల వెంకటేశ్వరరావు ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఇజ్రేల్ సంస్థకు చేరవేశాడానే అరోపణపాటు, ఇజ్రేల్ నుంచి కొన్ని నిఘా పరికరాలు కొనడంలో నియమాలు ఉల్లఘించాడనే ఆరోపణతో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో అసలు కధేంటోతెలుసా? కొడుకు కోణం. వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణ కంపెనీ వల్లే ఆయనకీ కష్టాలొచ్చాయనిచెబుతున్నారు. ఇజ్రేల్ నుంచి  సెక్యూరిటీ పరికరాలు కొనుగోలుచేసేందుకే సాయికృష్ణ చేత కంపెనీ ఏర్పాటు చేయించారని ఈ సంస్థ  వివరాలు చూస్తే అర్థమవుతుంది. అసలు కథ చదవండి
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల, ఎర్రచందనం స్మగ్గర్ల కదలికల మీద నిఘావేయాలనుకుంది. దానికి అవసరమయిన ఎయిర్ సర్వేలెన్స్ పరికరాలు ఇజ్రేల్ తయారుచేస్తుంది. అనేక తర్జన భర్జనల తర్వాత , ఎరో స్టాట్ (SkyStar 180) అనే పరికరం కొనుగోలుచేయాలనుకున్నారు.
ఇది ఆకాశం నుంచి భూమ్మీద మనుషుల  కదలికలను పసిగట్టే అన్ మాన్డ్ ఎరియల్ వెహికిల్ (unmanned aerial vehicle UAV).దీనిని ఇజ్రేల్ కు చెందిన ఒక కంపెనీ నుంచి దీనిని ఆంధ్రాకు విక్రయించేందుకు ఒక కొత్త కంపెనీ రంగ ప్రవేశం చేసింది. అంటే సేల్స్ ప్రమోషన్ కోసమన్నమాట.ఇక్కడే తిరకాసు ఉంది.  ఈ పరికరం అమ్మేందుకు రాత్రికి రాత్రికి పుట్టుకొచ్చిన ఈ సంస్థ ఎవరిదో తెలియగానే, కొనుగోలు ఆగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక నష్టం జరగలేదు.
కొనుగోలుకు సిద్ధమవుతున్నపుడు ఒక ఆకాశ రామన్న ఉత్తరం, ఈ వ్యాపార వ్యవహారాన్ని నడిపిస్తున్న ‘ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ ప్రయివేటు లిమిటెడ్’ అనే సంస్థ గురించి ఒక రహస్యం బయటపెట్టింది.
ఇది   ఈ పరికరం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఎబి వెంకటేశ్వరరావు కుమారుడి సొంత కంపెనీ.
ఈ  విషయాన్ని ఆకాశరామన్న అప్పటి డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. అంతే, ఇక ముందుకు పోవడం మంచిదికాదని,  అప్పటి డిజిపి ఆర్ పిఠాకూర్ ఈ కాంట్రాక్టును రద్దు చేశారు. కొనుగోలు ఆగిపోయింది అని టైమ్స్ ఆప్ ఇండియా పేర్కొంది.
రాష్ట్రానికి నష్టం లేకపోయినా, కొనుగోలు జరగకపోయినా, ఇందులో ఎబివెంకటేశ్వరరావు పాత్ర మీద, ఆయన దేశ భద్రతకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ప్రొటొకోల్స్ ను  ఉల్లంఘించారనే అంశాన్ని  జగన్ ప్రభుత్వం కనిపెట్టింది.  ఆ కోణం నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. సిఐడి విచారణకు ఆదేశించబోతున్నది.

Think your friends would be interested, share this story!

ఇలాంటి ఎరియల్ సర్వేలాన్స్ పరికరాలను యుఎస్ ప్రభుత్వం కస్టమ్స్ , బార్డర్ సెక్యూరిటీ విభాగాలు వినియోగిస్తుంటాయి. దీనిని ఆంధ్రలోనక్సలైట్ల మీద, ఎర్రచందనం స్మగ్లర్ల మీద ప్రయోగించాలనుకున్నారు.
ఏప్రిల్ 2017లో ఎబి వెంకటేశ్వరరావు ఇజ్రేల్ సందర్శించేందుకు అనుమతిస్తూ ఒక జివొ(జివొ నెం. 741) విడుదలయింది. ఆయన తో పాటు డిజిపి సాంబశివరావు,ఎర్రచందనం పరిరక్షణ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ పారెస్టు బిఎన్ ఎన్ మూర్తి కూడా ఇజ్రేల్ వెళ్లి స్కైస్టార్ట్ 180 ఏరో స్టాట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తుందో చూసి వచ్చేందుకు ఈ అనుమతినిచ్చారు. ఇజ్రేల్ కు చెందిన ఆర్ టి ఎల్ టిఎ సిస్టమ్స్ అనే సంస్థఈ పరికరాలను తయారు చేస్తుంది. ఇది ఏరోనాటిక్స్ అనే సంస్థకు అనుబంధ సంస్థ. వీటి ధర రు. 45కోట్లు.
ఈ పరికరాలు కొనుగోలు కోసం ఒక పర్చేసెస్ కమిటీ నియమించారు. ఇందులో మరొక ఐపిఎస్ అధికారి నిమ్మగడ్డ సురేంద్ర బాబు సభ్యుడు. ఆయన ఈ పరికరం కొనుగోలు మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికి , వెంకటేశ్వరరావు ఆసక్తి వున్నందున ఈ పరికరాలను కొనాలనే పోలీసు శాఖ నిర్ణయించింది.
2017 నవంబర్ లో వెంకటేశ్వరరావు ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెమినార్ కోసమనిఇజ్రేల్ వెళ్లారు. ఆయన తిరిగొచ్చాక 2017 డిసెంబర్ 7. ఆంధ్ర ప్రదేశ్ హోం శాఖ స్కై స్టార్ 180, ఆర్బిటర్ 3 స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనేందుకు అనుమతినిచ్చింది.
ఈ వ్యవహారం నడుస్తున్నపుడు ఇద్దరు డిజిపిలు మారడం కూడా విశేషం. అయినా సరే వెంకటేశ్వరరావు మాత్రం ఈ పరికరాలను కొనుగోలు చేసేందుకు వత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు.
భారతదేశంలో ఈ పరికరాలు ఎలా పనిచేస్తాయో పరీక్షించకుండా ఎలా కొనుగోలు చేస్తామని మరొక ఐపిఎస్ అధికారి నళిన్ ప్రభాత్ కూడా హెచ్చరించారు. అసలు భారతదేశంలో ఈ పరికరాలను ఎందుకు పరీక్షించలేదని కూడా ఆయన ప్రశ్నించారని టైమ్స్ రాసింది.
ఇలాంటి అభ్యంతరాలమీద, ఈ పరికరాల సామర్థ్యం మీద పోలీసు శాఖ లో ఇంకా చర్చ సాగుతున్నపుడు నాటి డిజిపి ఆర్ పి ఠాకూర్ కు ఒక ఆకాశరామన్న ఫిర్యాదు అందింది.
ఇజ్రేలి కంపెనీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరికరాలను కొనుగోలు చేసేందుకు సేల్స్ ప్రమోషన్ చేస్తున్న ఆకాశం అడ్వాన్సుడు సిస్టమ్స్ అనే సంస్థ ఎవరిదోకాదు, స్వయాన ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు కుమారుడిదేనని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనితో ఆర్ ఫి ఠాకూర్ ఈ కొనుగోలును మొత్తంగా రద్దు చేశారని టైమ్స్ కథనం.
అయితే, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరగలేదు. అయితే, విధానపరంగా అనేక నియమాలను ఉల్లంఘించారని, ఇందులో దేశ భద్రత కు సంబంధించినకోణం కూడా ఉందని జగన్ ప్రభుత్వం కేసుపెట్టాలనుకుంటున్నది.
వెంకటేశ్వరరావు కుమారు చేతన్ సాయికృష్ణ కంపెనీ వివరాలు చూస్తే చాలా ఆసక్తికరకంగా ఉంటాయి. ఈ కాంట్రాక్టు కోసమే ఈ కంపెనీ ఏర్పాటుచేశారనిపిస్తుంది. ఎందుకంటే కంపెనీ రిజిస్టరయింది కేవలం 2017లోనే. రిజిస్టర్ అయింది హైదరాబాద్లో, పనిచేసింది అమరావతిలో. ఆథరైజ్డ్  క్యాపిటల్ రు. అయిదు లక్షలే. ఫెయిడప్ క్యాపిటల్ రు. 1 లక్ష.