మొత్తానికి జీరో ఎఫ్ ఐ ఆర్ మీద ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రా డిజిపి

జీరో ఎఫ్ ఐ ఆర్ గురించి జనానికి తెలియడంతో పోలీసు శాఖలో కదలిక మొదలయింది.

 

ఒక నేరం మీద ఫిర్యాదు వచ్చినపుడు  జీరో (0) ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం మీద ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) మొత్తానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేసేందుకు దిశ దారుణ హత్య జరగాల్సి వచ్చింది. రోజులు తెలుగు రాష్ట్రాలలో లెక్కలేనన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే జీరో ఎఫ్ ఐ ఆర్ ఉత్తర్వులను జారీ చేయకపోవడమే ఆశ్చర్యం. ఇపుడు ఆంధ్ర డిజిపి  డిసెంబర్ 2 వ తేదీన ఒక మెమొ జారీ చేస్తూ రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లకు, ఎస్ పిలకు, పోలీసురేంజ్ ఐడిలకు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకపోతే చర్యలుంటాయని చెప్పారు. ఈ ఉత్తర్వుల గురించి వెంటనే  కింది స్థాయి పోలీసులందరికి తెలియచేయాలని డిజిపి ఆదేశించారు.
ఇందులో రెండు అంశాలున్నాయి.
  1. ఒక పోలీసు స్టేషన్ పరిధికి బయట నేరం జరిగినా ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదుచేయాలి.  తర్వాత ఈ ఎఫ్ ఐ ఆర్ ను సంబంధిత  పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయాలి(Even if the alleged offence has been committed outside the territorial jurisdiction of the police station, FIR shall still be registered and the same shall be transferred to appropriate Police station.)
  2. నేరం జరిగినట్లు సమాచారం అందాకా ఇలా ఎఫ్ ఐ ఆర్ లను నమోదు చేయకుండా నిరాకరిస్తే , నిరాకరించిన పోలీసు అధికారిని ఐపిసి 166-A కింద ప్రాసెక్యూట్ చేయవచ్చు. అదే విధంగా డిపార్లమెంటల్ క్రమశిక్షణా చర్య కూడా ఉంటుంది. లేదా రెండు చర్యలు ఉండవచ్చు. (The Police Officers should be clearly informed that failure to comply with the direction of registration of FIR and a receipt of information about cognizable offence may invite prosecution of the police officer under section 166-A of IPC and it may also invite departmental action against them)
డాక్టర్ ప్రియాంక రెడ్డి(దిశ) దారుణ హత్య కేసుతో బాగా ప్రచారంలోకి వచ్చిన మాట జీరో ఎఫ్  ఐ ఆర్. నిజానికి దీని గురించెవరికీ తెలియదు. పోలీసులకూ తెలియదనే అనుకోవాలి. లేదా తెలియనట్లు నటిస్తూ తప్పించుకుంటూ వుండాలి. నిర్భయకేసు, డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య వంటి దారుణ నేరాలు జరిగినపుడు, ఎమర్జన్సీ సమయాలలో  ఈ  నేరం ఎక్కడి జరిగింది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని అని ఎంక్వయిరీ చేసి ఫిర్యాదు ఇచ్చేంత సమయం ఉండదు. అందువల్ల నేరం ఎక్కడ జరిగినా ఫిర్యాదు దారు తనకు దగ్గిరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. అపుడు పోలీస్ స్టేషన్ వాళ్లు మా జ్యురిష్ డిక్షన్ కాదు, ఫలాన చోటికి వెళ్లండని సలహా పడేసి కేసు రిజిస్టర్ చేసుకోకుండా పంపించేస్తారు. ఇలా చేయడం వల్ల ఎంత విపరీత పరిణామాలొచ్చాయో ఢిల్లీ నిర్భయ కేసులో చూశాం. ఇపుడు డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసులో చూశాం. పోలీసుల తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ను జ్యరిష్ డిక్షన్ పేరుతో ఎఫ్ ఐ ఆర్ కట్టేందుకు నిరాకరించారు. దీని వల్ల చాలా నష్టాలున్నందున, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ ఐ ఆర్ నమోదు విషయంలో కోర్టు సూచనల మేరకుమార్పులు చేసింది. నేరం ఎక్కడ జరిగినా, ఫిరాదు ను స్వీకరించి ఎఫ్ ఐ ఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలి.తర్వాత ఈ ఎఫ్ఐ ఆర్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ బదిలీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను అదేశించింది. ఇలా జ్యరిష్ డిక్షన్ బయట జరిగిన నేరం మీద ఏదయిన పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసినపుడు నికి  నెంబర్ జీరో (0) ఇస్తారు. అందువల్ల దీనిని ఈ ఎఫ్ ఐ ఆర్ ను జీరో ఎఫ్ ఐ ఆర్ అని పిలిచారు.
2
మొన్న ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల ధగ్గరికి వెళితే అది మాపరిధి కాదు అని శంషాబాద్ పరిధి అనీ.. కాదు కాదు శంషాబాద్ రూరల్ పరిధి అనీ తిప్పారని తెలుసు. దీని మీద ముగ్గురుపోలీసులను కూడా సస్పెండ్ చేశారు.  అంటే జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదుచేయనందుకు వారి మీద చర్య తీసుకున్నారు. కేంద్రం అమధ్య రాష్ట్రాలకు పంపిన అడ్వయిజరీ ప్రకారం, జీర్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయని పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఇలాంటి ఎఫ్ ఐఆర్ నమోదు చేసి తీరాలి. ఇది మాండేటరీ.

3

జీరో ఎఫ్ ఐ ఆర్  ఎప్పటి ఆలోచన
నిర్భయ కేసు భారత న్యాయవ్యవస్థలోచాలా మార్పులు తీసుకువచ్చింది. ప్రజల్లో  కూడా ఇలాంటి నేరాలు జరిగినపుడు పోలీసులు తీసుకోవలసి చర్యలు, తీసుకొనని చర్యల మీద అవగాహన పెరిగింది. నిర్భయ తీసుకువచ్చిన సంస్కరణలో జీరో (0) ఎఫ్ ఐ ఆర్ ఒకటి.  ఇలాాంటి ఎఫ్ ఐ ఆర్ ను కట్టడం మీద సిఫార్సు చేసిన కమిటీ జస్టిస్ వర్మ కమిటి. ఇందులోజస్టిస్ లీలాషేత్, మాజీ సాలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియన్ సభ్యులుగా ఉన్నారు. నిర్భయ దారుణం జరిగాక, మహిళల మీద జరిగే అత్యాచారాల కేసులను శీఘ్రంగా విచారించి, సరైన శిక్ష పడేలాచేసేందుకు చట్టంలో తీసుకురావలసిన చర్యల మీద  సూచనలు చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ జె ఎస్  వర్మ కమిటి ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2013, జనవరి 13న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది.
 పోలీసు స్టేషన్ జ్యరిష్ డిక్షన్ వ్యవహారం వల్ల  ఎఫ్ ఐ ఆర్ నమోదుచేయడంలో జాప్యం జరుగుతున్నదనే  ఆందోళన సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. దీనికి సంబంధించి రెండు ప్రధాన మయిన ఉత్తర్వులున్నాయి. ఇందులో ఒకటి  సత్విందర్ కౌర్ వర్సెస్ ఎన్ సిటి ఆఫ్ ఢిల్లీ (ఎఐఆర్ 1031, 1999), రెండవది  రమేష్ కుమారి వర్సెస్ ఎన్ సిటి ఆఫ్ ఢిలీ (21.02.2006) ఇందులో మొదటి కేసులో  ఇలా జ్యురిష్ డిక్సన్ లేని పోలీసు స్టేషన్ అధికారి సేకరించిన సమాచారాన్ని కోర్టు విచారణకు పరిగణించకూడదు.
2013 నుంచి కేంద్ర ప్రభుత్వం జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం మీద  రాష్ట్రాలకు పదే పదే గుర్తు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నది.  2018 మే 10 వ తేదీన  కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రెటరీ (సెంటర్ స్టేట్ డివిజన్ ) రాష్ట్రాలకు ఒక మెమో పంపిస్తూ (No. 15011/35/2013-sc/st-w) జీ రో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన అధికారిని ఐపిసి 166-A కింద ప్రాసెక్యూట్ చేయవచ్చు. అదే విధంగా డిపార్లమెంటల్ క్రమశిక్షణా చర్య కూడా ఉంటుంది, లేదా రెండు చర్యలు తీసుకోవచ్చు. తర్వాత  2014 ఫిబ్రవరి 6న మరోక లేఖ వచ్చింది. నేరం కాగ్నజయిజబుల్ అఫెన్స్ అని తెలిస్తే సిఆర్ పిసి సెక్షన్ 154 కింద ఎఫ్ ఐ ఆర్ నమోదచేయడం తప్పనిసరి  కేంద్రం స్పష్టం చేసింది. ఆపైన  2015 అక్టోబర్ 12న కూడా మరొక లేఖ వచ్చింది.
కేంద్రం రాసిన లేఖ గురించి, జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం గురించి, నమోదు చేయకపోతేఎదురయ్యే పరిణామాల గురించి రాష్ట్రాలలోని పోలీసులందరిలో అవగాహనకల్పించాలనేదే ఈ మూడు ఉత్తర్వులు సారాంశం. అయితే, అలా జరిగినట్లు లేదని, ఈ నిన్న ఆంధ్ర డిజిపి ఇచ్చిన ఉత్తర్వు (కింద)లను బట్టి అర్థమవుతుంది.