తిరుపతి పక్కనే…వర్ణించ అలవి కాని సుందర ప్రదేశం ‘అంజనేయ గుండం’

(భూమన్)
తిరుపతి నుంచి అంజనేయ తీర్థం(గుండం) 24 కి. మీ దూరాన  ఉంటుంది.  తిరుపతి నుంచి  కాళహస్తి వెళ్లే  దారి లో ఏర్పేడు దాటాక శ్రీ ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది. దానికి ఎడమ వైపున వెళ్లే కృష్ణాపురం గ్రామం వస్తుంది. ఇక్కడి నుంచి 2 కి. మీ చక్కగా దూరం ప్రయాణిస్తే దట్టమయిన అటవీ  ప్రాతం చేరుకుంటాం. అక్కడికి చేరీ చేరుకోగానే  అక్కడి కొండల వరస  దిగ్భ్రమ కలిగిస్తుంది.
 తిరుపతి దగ్గిరలో ఇంత అద్భుతమయిన ప్రాంతం ఉందా అని అనే ఆశ్చర్య పోయారు.
కొండలను సమీపించగానే ఏడిదల కాలువ వస్తుంది. మరొక వైపు మాల గుబ్బ అనే  ప్రాంతం ఉందని మాక సహాయకుడిగా వచ్చిన రాధాకృష్ణ చెప్పాడు.  మాలగుబ్బ కూడా అద్భతమయిన ప్రాంతమే  అయినా  ఇపుడు మన ట్రెకింగ్ గమ్యం ఆంజనేయ తీర్థం కాబట్టి  అటు వైపు మరొకసారి వెళ్లొచ్చుకున్నాము.
ఈ కాలువ నిండా రాళ్లు, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి.  వీటి వల్ల ప్రయాణం కష్టమనిపిస్తుంది.అయినా సరే నీళ్లు లేవు కాబట్టి, కాలువ లోనుంచే ప్రయాణించవచ్చు. ఇలా మూడు నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆంజనేయ గుండం చేరుకుంటాం. మొత్తం ఎనిమిది కిలో మీటర్ల ట్రెకింగ్.
మేం పోయిన సమయంలో గుండంలో పెద్దగా నీళ్లు లేవు. అయితే, అవి చాలా స్వచ్ఛంగా, చాలా చాలా బాగున్నాయి. ఆ నీళ్లు, ఆ కొండలు,ఆ పచ్చని అడవి…తిరుపతి దగ్గిరలో ఇంత అద్భుతమయిన ప్రదేశముందా అడుగడుగునా ఆశ్చర్యపోయాం. ఇంత అద్భతమయిన ప్రదేశం ఉందని కూడా మాకు తెలియదు.  రాధకృష్ణ దేవతలు శిల్పాలు చెక్కే మిత్రుడు.  ఈ శిల్పి మిత్రుడు చెప్పడం వల్లే ఇక్కడికి వచ్చాం. లేకుంటే తెలిసేదే కాదు. రాధాకృష్ణ కు ఈ ప్రాంతమంతా గాలించిన వ్యక్తి. ఈ ప్రాంతంలో ప్రయాణించాలంటే ఇలాంటి వ్యక్తి సాయం అవసరం. ఈ  ప్రాంతానికి రావాలనుకునే ట్రెకర్లు కృష్ణాపురం రాధాకృష్ణ సాయం తీసుకోవడం చాలా అవసరం. ఆయనకు ఈ ప్రాంతం లోని గుండాల గురించి ,  తీర్థాల గురించి, వాటి పేర్ల వెనక ఉన్న చరిత్రగురించి అపారమయిన విజ్ఞానం ఉంది. ఆయన తో మాట్లాడుతూ ఉంటే నాకు ప్రొఫెసర్ కేతు విశ్వనాథరెడ్డి గుర్తొచ్చారు. ఆయన పూర్వ శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. రాయలసీమ గ్రామనామాల మీద లోతయిన పరిశోధన చేసి వ్యక్తి ప్రొఫెసర్ కేతు. రాధాకృష్ణ  ఈ స్థలనామ విజ్ఞానం అపారం.

(ఈ పోస్టు మీకు నచ్చిందా? మీ స్నేహితులకూ షేర్ చేయండి)

ఇక్కడికొచ్చాక తెలిసింది, ఇంత సుందరమయిన ప్రకతిని చూడకుండా ఎలా ఉండగలం. ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడాల్సిన ప్రాంతమిది.  ఇక్కడికి రావడం వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరతాయి. ఒకటి ట్రెకింగ్ అనుభవం, రెండు అసమాన ప్రకృతి సౌందర్యం. నిజానికి మేం ఎంచుకున్నది సరైన సమయం కాదు. వర్షాకాలంలో ఈ ప్రాంత సందర్శనకు అనువయిన కాలం. ఎందుకంటే, అపుడు ఈ ప్రాంతంలోని జలాపాతాలన్ని దూకుతుంటాయి. సెలయేర్లే జరజరపారుతుంటాయి. అందుకే వర్షాకాంలో ఒకసారి వచ్చితీరాలనుకున్నాను.
రాధాకృష్ణ
అయితే, ఇక్కడొక హెచ్చరిక చేయాలి. ఆంజనేయ గుండంలో తేనె పట్లు చాలా ఎక్కువ. వన్యమృగాలకంటే తేనెటీగలు ప్రమాదకరమయిన ఇక్కడి ప్రజలు చెబుతారు. తేనెటీగలు ఒక్కసారి విజృంభించి వెంటబడితే, తప్పించుకోవడం చాలా కష్టం. అందువల్ల ఈ ప్రదేశానికి వచ్చే ముందు ఇక్కడికి సమీపంలోనే ఉన్న ఒకరిద్దరు యానాది వాళ్లను తోడు తీసుకెళితే ఆ ప్రమాదం జరగకుండా సురక్షితంగా తప్పించుకోవచ్చు. ఇక్కడ వన్యమృగాలు కూడా ఉన్నాయి. అయితే, మాయాత్రలో మాకు దుప్పులు తప్పమరొక జంతువు కనిపించలేదు. అడవి పందులు, ఎలుగు బంట్ల తిరుగిన ఆనవాళ్లను చూడగలిగాం. ఈ యాత్ర ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ దారిపొడీతా పచ్చపచ్చని చెట్లు కనువిందు చేస్తాయి. వీటి మీద  ఉండే రకరకాల పక్షలు అరుపుతు నేపథ్యం సంగీతం వినిపిస్తూ ఉంటాయి. ఇది మాటల్లో వర్ణించలేనంత గొప్ప అనుభూతి. దీని వల్ల ఆంజనేయ గుండం తప్పక చూడాల్సిన శేషాచలం అడవుల్లోని ఒక వింత. తిరుపతి వచ్చిన వాళ్ళకు  24 కి.మీ పెద్ద దూరం కాదు.కాళహస్తి సందర్శకులకు ఇంకా దగ్గిరవుతుంది. దారి మధ్యలో ఉన్నకృష్ణా పురం వాసులను గైడ్ గా తీసుకెళ్లే మన యాత్ర ఇంకా సులభంగా, సౌకర్యంగా,అలసట లేకుండా సాగుతుంది.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/trekking-to-kongumadugu-in-seshachalam-forests-near-tirupati/?fbclid=IwAR3Jgmfzi3uNHemJ5hS7ZuoW_1B_SWlDjpxtbWuZlATNwVQViOC_jsFv9u0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *