ఒక నాటి కమ్యూనిస్టు యోధుడు చలిచీమల ముత్యాలప్ప జ్ఞాపకాలు (1)

అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతానికి  కమ్యూనిస్టు యోధుడు ముత్యాలప్ప. గ్యాదికుంట్ల ఆయన సొంతవూరు. 1944లోనే తన స్వగ్రామం గ్యాదికుంటలో మేడే  సభ జరిపారు. ఆ రోజుల్లోనే ఈ ప్రాంత భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు. ఆయన జీవిత విశేషాలు…

 

(విద్వాన్ దస్తగిరి)

మా యింట్లో యెవరికి చదువు రాదు. చుట్టుపక్క గ్రామాలకంతా చదువుకున్నవాళ్ళు ఒకరిద్దరు కూడా లేరు. పిల్లవాన్ని చదివించల్ల అని ఆనుకోవడమే గొప్ప విషయం. గ్రామాలలో రెడ్లు పెత్తందార్లు. ‘గ్రామరెడ్డి’(VM) వారే.  వారు చదు వును, చదువుకున్నవారిని ఎగతాళి చేసేవారు.వ్యతిరేకించేవారు. జాబు చదివించు కావాలన్నా నసనకోటకు పోయి చదివించు కోవల్ల.
నసనకోట,ఎగువపల్లెలో ప్రాథమిక స్కూళ్ళు. ప్రతి రోజు ఇంటినుండే స్కూలుకు పోయివచ్చేవాన్ని. ఆరవ తరగతి చదవడానికి పెనుగొండ హైస్కూలులో చేరినాను. అక్కడ చేరిన తరువాత మలేరియా వచ్చింది. వెంటనే చదువు మానిపించి ఇంటికి తెచ్చినారు చదువు మా కుటుంబానికి అచ్చిరాదని. “చూడమ్మా! ఈ మంగమ్మ చెప్పితే వినదు. చదువు అచ్చిరాదంటే వినదు. పిల్లోడు చచ్చే చావు దశకు వచ్చినాడు.”  అని ఊర్లో ఆడవాళ్ళు చాలా మదనపడినారు.
సంవత్సరం తరువాత  ధర్మవరంలో చేరినాను.  జవహర్ లాల్ నెహ్రూను  అరెస్టు చేసినపుడు. AISF పిలుపు మేరకు మేము ధర్మవరంలో సమ్మె చేసినాము.  ఆ  సమయంలో స్వాంతంత్య్రో ద్యమ  రాజకీయ కార్యకలాపాలు  దేశ మంతటా ముమ్మరంగా జరుగుతూ వుండేవి. ఆ సమయంలోనే  నెహ్రూ అరెస్టు జరిగింది. దాన్ని నిరసిస్తూ AISF సమ్మెకు పిలుపిచ్చింది. హైస్కూల్ బంద్ పాటించాము. పోలీసులు వచ్చి బెదిరించినారు. డీబార్ చేస్తామని హెడ్ మాస్టర్ తో బెదిరించినారు . మేము భయపడలేదు. టీచర్లు అంతా మా కనుకూలం.

ధర్మవరంలో కాంగ్రెసువారు పెట్టే ప్రతి సమావేశానికీ పోయే వాణ్ని. నేనూ,పూలకుంట నరసింహారెడ్డి, పల్లెన్నగారి పల్లి వెంకట రమణారెడ్డి(మాజీ సమితి ప్రసిడెంట్) ఒకే రూము లో వుండేవాళ్ళం.పూలకుంట నరసింహా రెడ్డి ఖద్దరుధారి. ఉపన్యాసాలు యిచ్చేవాడు. రాజకీయ చర్చలు చేసే వాళ్ళం. అనంతపురంలో స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి.  వి.కె,. కొట్రేగౌడ్, మల్లయ్య (కర్నూల్),వన్నూర్ రెడ్డి (కల్యాణదుర్గం)ముఖ్య కార్యకర్తలు. మేము సమ్మె చేసిన విషయం తెలుసుకొని మాతో  సంబంధాలు పెట్టుకోమని చండ్రపుల్లారెడ్డిని  మా వద్దకు పంపినారు. అయన గిండీ ఇంజనీరింగ్ కాలేజిలో చదివే చదువును వదలిపెట్టి  మద్రాస్ స్టూడెంట్ ఆర్గనై జరుగా ఉండేవాడు. ఆయన మమ్ములను  కలుసుకున్నాడు. AISF లో చేరమని చెప్పినాడు. మాకు అప్పటికే రాజకీయాలు వంటబట్టినాయి కనుక మేము సరే అన్నాము. అనంతపురంలోని  పీస్ మెమోరియల్ హాలులో AISF నిర్వహిస్తున్న ఉపన్యాసం, వ్యాస రచన, ఇతర పోటీలకు హాజరుకావాలని ఆహ్వానించినాడు. మేమూ హాజరైనాము. కళ్యాణదుర్గంనుంచి గంగప్ప, గోపాలకృష్ణ వచ్చి నారు. గోపాలకృష్ణ అప్పటికే గొప్ప వక్త. ఆయనకే చాలా బహుమ తులు వచ్చినాయి. ఉత్సవాలు బాగా జరిగినాయి. వి.కె. మొదలగువారితో పరిచయాలు ఏర్పడినాయి ‘ఆకాశవాణి” పత్రిక వస్తోంది. దాన్లో అంతా బాగా ఎత్తేసినారంట’(= అధికారుల తప్పులను నిర్భయంగా ఎత్తి చూపడం”)అని చెప్పేవారు. ఆకాశవాణి పత్రికకు సదాశివన్ గారు బాధ్యులని తెలిసింది..‘స్టూడెంట్ ఆర్గనైజరు’ పత్రికను మాకు పంపేవారు. దాన్ని విద్యార్థులకు అమ్మేవాళ్ళం. పుల్లారెడ్డి ‘నాడు-నేడు’ ‘అమ్మ’(కోవ్విడి లింగరాజు అనువాదం  నిషే ధింపబడినది) మరికొంత విప్లవ సాహిత్యం మాకు అంద జేసినాడు. సదాశివన్  కోర్టు రోడ్డులో కదిరి వేమారెడ్డిఇంటి పక్క సందులో ఒక చిన్న రూములో వుండేవాడు. కేశవవిద్యానికేతన్ హాస్టల్ వార్డెన్ గా వుండేవాడు.‘న్యూ ఏజ్’ ‘పీపు  ల్స్ వార్’ పత్రికలు చదివే వాళ్ళం. పళ్ళెం శ్రీనివాసులు గారు వ్యష్టిసత్యాగ్రహం గొట్లూరులో చేసినాడు. “యుద్ధా నికి సహాయం చేయకూడదు. చేయకూడదు” అని చెప్తా వుండగానే పోలీసులు అరెస్టు చేసి తీసుకొని పోయినారు. కొత్తచె ర్వు ఎద్దులపరసలో వైశాఖ మాసంలో గణేనాయక్ సత్యాగ్రహం చేసినాడు. సెలవులలో ఊరికి వచ్చినపుడు “అమ్మ” నవల చదివినాను. “అమ్మ” నవల చదివిన తరువాత నాలో  చాలా పెద్దమార్పు వచ్చింది. ధృఢదీక్ష పెరిగింది. నేనె ప్పుడు  ఊరికి వచ్చినా రైతులను  కుప్పేసుకొని దేశంలో జరిగే విషయాలు చెప్పేవాడిని. వారికి కూడా ‘అమ్మ’ నవల చదివి వినిపించేవాన్ని.

మొదటి భాగం-1


ఉద్యమంలో బాగా పని చేయాలని ధర్మవరం హైస్కూలులో TC తీసుకొని అనంతపురంలో మున్సిపల్ హైస్కూల్ లో SSLC చేరినాను. అనంతపురంలో  సమావేశాలన్నీ పప్పూరు రామాచార్యుల ఇంటి పక్కన ఇపుడు సెంట్రల్ బ్యాంక్ వున్న స్థలంలో మైదానంలో జరిగేవి. జయప్రకాశ్ నారాయణ, రాజగోపాలాచారి, బెజవాడ గోపాలరెడ్డి మొ దలగువారి తో సభలు జరిగేవి. మేము తప్పక హాజరయ్యేవాళ్ళం.  ఆదిశేషయ్య, జీవరత్నమ్మ మాకు సీనియర్లు. చా లా చురుకుగా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. వీరు కాంగ్రెసు వాదులు. అయినా కలిసి పనిచేసే వారము. సదాశివన్  గారు స్టడీసర్కిల్స్ నడిపేవారు. వి.కె.గారి ఇంటి ఎదురుగా, ఇంటి పక్కలో, శివరాం బంగ్లాలో ఈ తరగతులు నడి చేవి. రాజకీయాలు బోధించేవారు. పుస్తకాలు అధ్యయనానికి అందజేసేవారు.దీనంతటికీ ప్రధాన బాద్యుడు సదాశి వన్ గారు. పేపరు ఎట్లాచదవాలి?  అంతర్జాతీయపరిస్థితులు, సోవియట్ యునియన్ గురించి,అది నిర్వహి స్తున్న ముఖ్యపాత్రగురించి, విప్లవోద్యమాలకు ఇస్తున్న ప్రేరణ గురించి,స్వాతంత్రోద్యమం గురించి, సామ్రాజ్యవాద దోపిడి నుంచే కాక, దేశీయ భూస్వాముల, పెత్తందార్ల,పెట్టుబడిదార్ల దోపిడీ,అణచివేతల నుండి విముక్తి సాధించడమే నిజమైన స్వాతంత్ర్యమని, అటువంటి స్వాతంత్ర్యం సాధించడానికే మనం దృఢ దీక్షతో పనిచేయాలని చెప్పేవారు. మేము చదువుకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. స్టూడెంట్ పత్రిక అమ్మడం, ఇతర పుస్తకాలు సర్కులేట్ చేయడం, చర్చిం చడం, –  ప్రాధాన్యం వీటికే. పూలకుంట నరసింహారెడ్డి, వెంకట రమణారెడ్డి  ధర్మవరంలోనే వున్నారు. వెంకటర మణా రెడ్డ్డి చదువు తరువాత వకీలుగా వున్నాడు. పార్టీసానుభూతిపరుడుగా  వున్నాడు. పూలకుంట నరసింహారెడ్డి చదువు తరువాత పూలకుంట సంజీవులతో కలసి పార్టీశాఖ ఏర్పరచారు. తరువాత పార్టీకి దూరం అయినాడు.
Vidwan Dastagiri

(విద్వాన్ దస్తగరి, రిటైర్డు టీచర్, చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *