డామిట్, కథ అడ్డం తిరిగిందే? నెల రోజుల తర్వాత ప్రధాని-సిఎం ల భేటీ

చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రధాని నరేంద్రమోది ముఖ్యమంత్రులతో మళ్లీ మాట్లాడాలనుకుంటున్నారు. ఈ నెల 16,17 తేదీలలో ఆయన ముఖ్యమంత్రులతో రెండుదఫాలుగా మాట్లాడబోతున్నారు. ఆయన ముఖ్యమంత్రులతో గత నెల 12 వ తేదీన మాట్లాడారు. అంటే సరిగ్గా నెల రోజుల తర్వాత ఆయన ఇపుడు మరొక సారి ముఖ్యమంత్రులతో మాట్లాడాలనుకుంటున్నారు. మార్చి 25న లాక్ డౌన్ మొదలయినప్పటి నుంచి   ఇప్పటిదాకా ప్రధాని ముఖ్యమంత్రులతో అయిదుసార్లు వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి చాలా మారిపోయింది.
ఇపుడు భారత దేశంలో కరోనా పరిస్థితి అంతర్జాతీయ వార్త అయింది. India Fourth Worst-hit nation with over 297,000 coronavirus cases (Aljazeera), India Now Fourth Worst-hit Nation (DW), India Fourth Worst-Hit Nation After Virus Cases Exceed U.K (Bloomberg),India now fourth worst COVID-19 hit nation… వంటి హెడ్ లైన్లు ప్రపంచమంతా మారుమ్రోగుతున్నాయ్.
దానికితోడు మరొక సారి లాక్ డౌన్ విధిస్తారేమోనని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్. లాక్ డౌన్ ను దాదాపు ఎత్తేవేసినా ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు.
ఉదాహరణకు హైదరాబాద్ లో లాక్ డౌన్ తొలగించి (Unlock-1) అమలులోకి వచ్చి వారంరోజులయింది. బయట దాదాపు అన్ని వ్యాపారాలు తెరుచుకున్నాయి. మాల్స్ వచ్చాయి. మార్కెట్లు వచ్చాయి. రెస్టరాంట్లు తెరచుకున్నాయి. జనం రోడ్లమీదకు రావడంలేదు. కారణం హైదరాబాద్ నగరంతో పాటు దేశమంతా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు పానిక్ అయిపోవడం సర్వత్రా కనిపిస్తుంది. దాదాపు రెండున్నర నెలలు లాక్ డౌన్ ప్రభావం ఏమీ లేదని స్పష్టమయింది. భారతదేశంలో మరణాలు పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయో. తీవ్రంగా కరోనాపీడిత దేశాలలో భారత్ నాలుగోస్థానానికి వచ్చింది. భారత్ కు పైన ఉండేవి యుఎస్, రష్యా, బ్రెజిల్ దేశాలే.
కరోనా భయంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరగలేదు.షాపుల్లో జనాలు కనిపించడం లేదు. మాల్స్ లో జనాల్లేరు, ఆలయాల్లో జనాల్లేరు. రెస్టరాంట్లు తెరిచినా ప్రజలు రావడం లేదు. వచ్చిన వాళ్లు పార్సిళ్లు పట్టుకెళ్తున్నారు. న్యూస్ పేపర్లు, సోషల్ మీడియా, టివి చానెళ్లు బాగా భయాన్ని మోసుకొస్తున్నాయి. ముప్పేదో ముంచుకొస్తున్నదనేటట్లు టివిలో డిబెట్లు నడుస్తున్నాయ్. తమిళనాడు ఒక ఎమ్మేళ్లే చనిపోవడం, హైదరాబాద్ 80 మంది డాక్టర్లకు కరోనా సోకడం, ఒక జర్నలిస్టు మరణించడం చాలా భయపట్టే వాస్తవాలు.
మరొక విషయం లాక్ డౌన్ తర్వాత తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా 33 జిల్లాలకు వ్యాపించింది. గతంలో కనీసం మూడునాలుగు జిల్లాలు కరోనాకు దూరంగా ఉండేవి. ఇపుడలాంటి తేడా లేకుండా అన్నిజిల్లాలో కరోనా తిరుగాడుతూ ఉంది. ఇలా భయానికి అన్ని మూలల నుంచిఆజ్యం తోడువుతున్నది.
ఎవరినైనా అడగండి, మరొకసారి లాక్ వస్తున్నదనో, రావాలనోచెబుతారు. ముసళ్ల పండగ ముందుంది, అగస్టు సెప్టెంబర్ లో ఇండియాలో కరోనా ప్రళయ తాండవం చేస్తుందనే వార్తలొస్తున్నాయి. ప్రజల్లో ఎంతభయముందో చెప్పేందుకు తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దయ్యేదాకా ప్రభుత్వం మీద తల్లితండ్రులవత్తిడి పెరిగింది. ఒకవైపు భయంతో మెజారిటీ ప్రజలు ఇల్లొదలి వచ్చేందుకు జంకుతూ ఉంటే, రోడ్ల మీదకు వచ్చేవాళ్లలో చాలా మంది విచ్చలవిడిగా తిరుగుతున్నారని, వాళ్ల వల్ల వైరస్ వ్యాప్తిచెందుతుందనిచాలా మంది భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకుచేసిన లాక్ డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం కల్గించడం లేదు. ఇలాగే రెవిన్యూ పెరిగేదెలా? ఇక నుంచి కరోనాతో కలసి జీవించాలని రోజూ చెబుతున్నా, ప్రజల్లో ధైర్యం రావడంలేదు.ఈ పరిస్థితులు ఏంచేద్దామో ఆలోచించండని అడిగేందుకు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించ బోతున్నారు. ఎందుకంటే, ఇపుడు అమలులో ఉన్న 4.0 లాక్ డౌన్ జూన్ 30 దాకా అమలులో ఉంటుంది. తర్వాతేమిటి అనేది ఇపుడు దేశం ముందున్న ప్రశ్న.
ఈ నెల 16, 17 తేదీల్లో జరిగూ సమావేశంలో ముఖ్యమంత్రులను 2 గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూప్‌తో ఒక్కో రోజు చర్చలు జరుపుతారని చెబుతున్నారు. 16వ తేదీన న 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతారు.  17వ తేదీన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తారు.
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.
శుక్రవారం నాడు ఏకంగా 11,442 కేసులు నమోదయ్యాయి. 393 మంది మృతులు. మొత్తంగా భారతదేశ మృతులు సంఖ్య 8,884 మంది. ఇండియా బ్రిటన్ ను మించిపోయింది. నూరు కేసుల నుంచి మొదటి లక్ష కేసులు చేరుకునేందుకు భారత్ కు 64 రోజులు పట్టింది. తర్వాత రెండో లక్ష చేరుకునేందుకు 15 రోజులే పట్టింది. ఇది సంగతి. కథ అడ్డం తిరిగిందా లేదా?