చైనా ఆమెరికాలోకి మొత్తం ఎలెక్ట్రానిక్ వ్యవస్థను స్థంభింపచేయాలనుకుంటున్నాదా? సైనికుల ప్రమేయం లేకుండ మొత్తం అమెరికా లో ఎలెక్ట్రిక్ గ్రిడ్ ని, ఎలెక్ట్రానిక్స్ లో వాడే సెమికండక్టర్ల ను తీవ్రంగా వేడెక్కించి, కరిగించి పడేసి, మొత్తం వ్యవస్థలను స్థంభింప చేసేందుకు చైనా పూనుకుంటున్నదా?
అవునంటున్నారు కొంతమంది అమెరికా నిపుణులు.
చైనా అమెరికా మీదకు ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ పల్స్ (EMP)ని పంపి అమెరికాలో ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను స్థంభింప చేయాలనకుంటున్నదని, అమెరికా వాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఒక ఎన్జీవో హెచ్చరించింది.
1941లో జపాన్ అమెరికా హవాయ్ లోని పర్ల్ హార్బర్ మీద హఠాత్తుగా దాడి జరిపినట్లు చైనా ఇపుడు అమెరికా మీద ఇఎం పి దాడి జరుపుతుందని ఈ ఎన్జీవో విశ్లేషించింది. అంతే, గత రెండు రోజులుగా అమెరికా ఈ చర్చతో కుతకుతలాడుతూ ఉంది.
ఈ ఎన్జీవో పేరు హోమ్ ల్యాండ్ అండ్ నేషనల్ సెక్యూరిటి (Homeland and Nationa Security). ఈ సంస్థకు ఒక EMP Task Force ఉంది. చైనా చేసే ఇఎంపి దాడి నుంచి అమెరికా పవర్ గ్రిడ్ ను పటిష్టం చేసుకునేందుకు ‘ప్రజలను, ఇంజీనర్లను, ఫీల్డ్ ఎక్స్ పర్ట్స్ తదితరులను’ ఏకం చేసేందుకు ఈ టాక్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ విన్సెంట్ ప్రై (Peter Vincent Pry) చైనా EMP దాడి చేయాలనుకుంటున్నదని ఒక నివేదిక జూన్ 10న విడుదల సంచలనం సృష్టించారు.
ఇఎంపి ఆయుధాన్ని ప్రయోగిస్తే, అమెరికా పవర్ గ్రిడ్ మలమలమాడిపోతుందని,అపుడు అమెరికా అంధకారంలో కొట్టు మిట్టాడుతుందని, అది అమెరికా మీద అన్నివైపులనుంచి దాడి చేసేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన ఈ నివేదిక విపులంగా రాశారు. ఒక EMP దాడిజరిగితే, సెల్ ఫోన్లు,ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్, సెమికండక్టర్లు అన్ని మాడిపోతాయి.ఎటిఎంలు పనిచేయవు, రైళ్లు ఎక్కడిక్కడ అగిపోతాయి. ఎలెక్ట్రిక్ వైర్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతాయి… ఇలా ఎలెక్రిక్, ఎలెక్ట్రానిక్ వ్యవస్థలు ధ్వంసమవుతాయి. (ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ కథ లాగుంది కదూ).
ఈ సూపర్ ఇఎంపి ఆయుధాన్ని చైనా అమెరికాలోని అణ్వాయుధాల ల్యాబొరేటరీ నుంచే తస్కరించిందని కూడా ఆయన రాశారు.
లోఈల్డ్ (low-yield) న్యూక్లియార్ వార్ హెడ్స్ నుంచి ఈ ఇఎంపి విడుదలవుతుందని, అది ఆటంబాంబులాగా దేశాన్ని భౌతికంగా ద్వంసం చేయకుండా, ఎలెక్ట్రో మాగ్నటివ్ తరంగాలను గుప్పు గుప్పున విడుదల చేసి అమెరికాను అంధకారంలోకి నెడుతుందని పీటర్ ఫ్రై చెప్పారు. ఈ ఆయుధాన్ని చైనా సైబర్ ఆయుధంగా పిలుస్తూ ఉంది.
ఒక అణ్వాయుధాన్ని పేల్చినపుడు గుప్పుగుప్పున వెలువడే విద్యుదయస్కాంత శక్తియే ఇఎంపి. పోర్టబుల్ హైవపర్ మైక్రోవేవ్ ఆయుధాలనుంచి కూడా ఈ శక్తిని పుట్టించవచ్చు.ఈ శక్తివంతమయిన పల్స్ లు భూఆయస్కాంత పరిధితో రియాక్టయినపుడు వాటికి భూమ్మీద ఉన్న అన్ని రకాల ఎలెక్రికల్, ఎలెక్ట్రానిక్ కంప్యూటర్లను ధ్వంసం చేసేంత శక్తి వంతంగా తయారవుతాయి.
అంటే కంప్యూటర్లు,సెల్ ఫోన్లు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, ట్రాన్సిమిషన్ లైన్స్ లత పాటు అన్ని రకాల క్రిటికల్ కమ్యూనికేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నాశనం చేస్తాయి. అమెరికా మీద ఇలాంటి జరిగినపుడు అక్కడి కీలకమయిన సబ్ స్టేషన్లు నాశమయి వాటి మీద ఆధారపడిన అన్నింటిని నాశనం చేస్తాయి. ఇది అమెరికా సమాచార, విద్యుత్ సైనిక వ్యవస్థలను పనిచేయకుండా చేసే మహాయుధం.
ఇఎంపి అనేది ఎలెక్ట్రానిక్స్ ని ధ్వంసం చేసే ఆయుధం లాంటిది. ఇదెలా పనిచేస్తుందో డేవిడ్ యే (David Yeh) అనే ఇంజనీర్ ల్యాబొరేటరీ లో పరీక్షించి చూపించారు. ఈ ప్రయోగాన్ని ఆస్టిన్ లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎలెక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంటులోని కపిల్ గులాటి, డాక్టర్ ఫ్రాన్సిస్ బోస్టిక్ లకు 2006ల ప్రాజక్టు కోసం చేసి చూపించారాయన. ఇఎమ్ పికి ఎంత శక్తి ఉందో సూక్ష్మ స్థాయిలో ల్యాబోరేటరీ లో ప్రయోగాత్మకంగా ఆాయన ప్రదర్శించారు. ఇఎమ్ పి ఆయుధాల గురించి, వాటినుంచి రక్షణ పొందడం గురించి డేవిడ్ యే Electromagnetic Pulse Generator అనే ఈ నివేదికలో చాలా చక్కగా విరించారు.
This EMP generator will be designed to release an electromagnetic pulse. The purpose of the said pulse is to induce a potential, or voltage, that heats up semiconductor material so quickly that it changes the crystal lattice structure of the material and thereby electrically destroying it.
పీటర్ ప్రై రిపోర్టు ప్రకరాం అమెరికా మీద HEMP (High-alititudeEMP) ఆయుధాలను ప్రయోగించేందుకు చైనా మూడు రకాల పద్ధతులను రూపొందించింది. అవి: 1.సాంప్రదాయిక పద్ధతిలో బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించి వార్ హెడ్స్ ను పేల్చి ఇఎంపి తరంగాల సునామీని అమెరికా మీదకు ప్రయోగించడం. 2. హైపర్ సోనికో మిసైల్స్ ను ప్రయోగించడం, ఈ రకం అత్యాధునిక మిసై ల్స్ ని చైనా విజయవంతంగా తయారుచేసింది. 3.మూడో ఫ్యూచరిస్టిక్ , స్పేస్ అధార అటంబాంబుల ద్వారా ఇఎంపిలను విడుదల చేయడం. ఇది శటిలైట్స్ సాయంతో జరిపే దాడి.
ఇవన్నీ వినడానికి అసంభవం అనిపిస్తాయని అయితే,తొందర్లో అవే నిజం కాబోతాయని ప్రై అమెకిన్లను భయపెట్టారు.
