4 రోజుల్లో 50 వేల డౌన్ లోడ్స్… పాపులర్ అవుతున్న ఎపి దిశ యాప్

ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది.
నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం. అదేవిధంగా యాప్‌ ద్వారా పోలీసులు స్పందిస్తున్న తిరుకు మెచ్చి గూగుల్‌ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు.
ఈ యాప్‌ పనిచేస్తుందో.. లేదో తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున పరిక్షిస్తున్నారు . 9వ తేదీ నుంచి సగటున రోజుకు రెండు వేల మందికిపైగా దిశ యాప్‌ ద్వారా పోలీస్‌ కమాండ్‌ రూమ్‌కు టెస్ట్‌ కాల్స్‌ చేస్తున్నారు.
దిశ చట్టాన్ని తెచ్చిన 24గం లోనే మొదటి కేసు లో పోలీసులు వాయువేగంతో స్పందించిన విధానం ,బాధితురలి కి పూర్తి స్థాయి లో భరోసా కల్పించిన తీరుతో ప్రతిఒక్కరు నుండి దిశ అప్లికేషన్ కు మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు దేశ వ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి.
ఫిర్యాదు చేయడం చాలా ఈజీ
చేతిలోని మొబైల్ ఫోన్ ను మూడు సార్లు ఊపడం(shake) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దిశ sos సెంటర్ కు నిన్న వచ్చిన రెండు ఫిర్యాదులు అందాయి. రెండు ఫిర్యాదులలో భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదం కారణంగా గొడవ చోటుచేసుకోగా తన భర్త విచక్షణ కోల్పోయి కొడుతుండడంతో అలాంటి సమయమలో ఆ బాధిత మహిళా తన చేతిలోని మొబైల్ ఫోన్ ను షేక్ చేయడం ద్వారా దిశ కంట్రోల్ సెంటర్ కు ఫిర్యాదు అందించింది.
ఫిర్యాదును అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి నిమిషాల వ్యవధిలోనే బాదితురాలి వద్దకు చేరుకొని భర్త వేదింపుల నుండి భాదితురాలిని రక్షించారు.ఒక ఫిర్యాదు కృష్ణ జిల్లాకు చెందినది కాగా మరొకటి వైజాగ్ పట్టణానికి చెందిన ఫిర్యాదు.ఈ రెండు కేసులకు చెందిన భాదితులను ఈ రోజు ఒన్ స్టాప్ సెంటర్ కు పంపడం జరిగింది.
వెస్ట్ గోదావరి జిల్లాలో మరో కేసులో ఓ మహిళా వరుసకు సోదరుడైన వ్యక్తి తనను వేదిస్తున్నాడు అంటూ sos ద్వారా ఫిర్యాదు అందడంతో అక్కడకు చేరుకున్న స్థానిక పోలీసులు వేదింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు .
ఈస్ట్ గోదావరి జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదు లో ఓ బాలిక తనను ఒక వ్యక్తి తరచుగా వేదిస్తున్నాడు అంటూ దిశ sos కు ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకొని దైర్యం కల్పించడం జరిగింది.అంతే కాకుండా వేదింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది.
దిశ అప్లికేషన్ ద్వారా వస్తున్న ఫిర్యాదులలో ఎక్కువ శాతం కుటుంబ సమస్యల కారణంతో దిశ ను ఆశ్రయిస్తున్నారు.అలాంటి వారిపట్ల పోలీసులు నిపుణులైన ,అనుభవము ఉన్నావారిచేత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారు కలిసి ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని దిశ స్పెషల్ ఆఫీసర్ తెలిపారు.