ఫ్లాట్లు, ప్లాట్లు కొనాలనుకుంటున్నాారా, ఇది గుర్తుంచుకోండి…

రెరా ముద్ర ఉన్నదే ‘రియల్‌’ ఎస్టేట్‌ సంస్థ,మిగతా వన్నీ బోగస్ సంస్థలే నని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అందువల్ల ప్లాట్లు కొనాలనుకున్నా, అప్టార్ట్ మెంట్స్ లో ఫ్లాట్స్ కొనాలనుకున్న విక్రయిస్తున్న పెద్ద మనిషి లేదా సంస్థ రెరా RERA అంటే The Real Estate (Regulation and Development) Act, 2016 కింద నమోదు తమ పేరు నమోదుచేయించుకున్నారా లేదా అనేది చూడండి అని కేంద్రం పేర్కొంది.
రాజ్యసభలో వైసిపి సభ్యుడు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు  సమాధానం చెబుతూ ఈ వివరాలందించారు.
ఏ బిల్డరైనా, ప్రమోటరైనా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్టర్‌ కాకుండా ఫ్లాట్‌లు, ప్లాట్లు, భవనాలు లేదా ఏ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ను విక్రయించడానికి వీల్లేదని గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి  స్పష్టం చేశారు.
రియల్‌ ఎస్టేట్‌ (రెగ్యులేషన్‌, డెవలప్‌మెంట్‌) చట్టం 2016 ప్రకారం రెరా వద్ద రిజిస్టర్‌ చేసుకోకుండా ఏ బిల్డరు లేదా ప్రమోటరు తమ వెంచర్లను ప్రారంభించరాదు.
వెంచర్ల గురించి  ప్రచారం చేసుకోవడం, బుక్‌ చేయడం, విక్రయించడం వంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోను అనుమతించరని మంత్రి తెలిపారు.
రెరా చట్టం అమలులోకి వచ్చిన నాటికే నిర్మాణంలో ఉండి ప్రాజెక్ట్‌ పూర్తయినట్లుగా జారీ చేసే ధృవీకరణ పత్రం పొందని బిల్డర్లు మూడు మాసాల వ్యవధిలో తమ ప్రాజెక్ట్‌ను రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
రెరా వద్ద రిజిస్టర్‌ చేసుకోని బిల్డర్లు, ప్రమోటర్లు రెరా ఆదేశాలు, మార్గదర్శకాలను అతిక్రమిస్తే అలాంటి వారికి రెరా చట్టంలోని సెక్షన్‌ 59 కింద 3 ఏళ్ళ జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంలో పది శాతం జరిమానా విధించే నిబంధన ఉన్నట్లు ఆయన చెప్పారు.
రెరా వద్ద రిజిస్టర్‌ కాని బిల్డర్ల వద్ద ఫ్లాట్లు కొన్న వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తగిన ఫోరం వద్ద ఫిర్యాదు చేసి చట్టపరంగా తమ హక్కులను పరిరక్షించుకోవచ్చని మంత్రి చెప్పారు.
దేశంలో ఎన్ని గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు రెరా వద్ద రిజిస్టరయ్యాయో వాటి వివరాలు తమ మంత్రిత్వ శాఖ సేకరించిందని మంత్రి చెప్పారు.
రెరా వ్యవస్థను ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆ వివరాలన్నీ ఆయా రాష్ట్ర రెరా వద్దే లభ్యమవుతాయని తెలిపారు.