బ్రేకింగ్ న్యూస్: 21 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ఫిక్స్ చేసిన జగన్

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానాల కసరత్తు జోరందుకుంది. ఇప్పటికే అధికార టీడీపీ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి పలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసారు.

కాగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా అభ్యర్థుల ప్రకటన షురూ చేయనుంది. ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు పార్టీ ముఖ్యనేతల నుండి అందిన విశ్వసనీయ సమాచారం. 21 పార్లమెంటు సెగ్మెంట్లలో పోటీ చేయనున్న అభ్యర్థుల లిస్ట్ కింద ఉంది చూడవచ్చు.

  1. శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్,
  2. విజయనగరం – బొత్స ఝాన్సీ,
  3. విశాఖ – ఎంవివి చౌదరి,
  4. అనకాపల్లి – వరద కల్యాణి,
  5. అరకు – గొట్టేటి మాధవి,
  6. కాకినాడ – బలిజి అశోక్,
  7. రాజమండ్రి – మార్గాని భరత్,
  8. అమలాపురం- చింతా అనురాధ,
  9. నరసాపురం – రఘురామ కృష్ణంరాజు,
  10. ఏలూరు – కోటగిరి శ్రీధర్,
  11. విజయవాడ – దాసరి జై రమేష్,
  12. మచిలిపట్నం – బాల‌సౌరీ,
  13. గుంటూరు -మోదుగుల వేణుగోపాలరెడ్డి,
  14. నరసరావు పేట- శ్రీ కృష్ణ దేవరాయలు,
  15. ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి,
  16. నెల్లూరు – మేకపాటి రాజమోహన్ రెడ్డి,
  17. రాజంపేట – మిథున్ రెడ్డి,
  18. కడప – అవినాష్ రెడ్డి,
  19. హిందూపూర్ – గోరంట్ల మాధవ్,
  20. అనంతపురం – పిడి రంగయ్య,
  21. నంద్యాల – శిల్పా రవిచంద్ర.

బాపట్ల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు సీట్లపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీలోకి జయసుధ: జ‌గ‌న్‌తో భేటీ తర్వాత ఆమె రియాక్షన్ ఇదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *