నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు అప్రజాస్వామికం: నొక్కి చెప్పిన వైసిపి ఎమ్మెల్యే

 (అంబటి రాంబాబు,వైసిపి ఎమ్మెల్యే)
కొద్ది రోజులక్రితం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమీషనర్ పై కొన్ని నిర్ణయాలను తీసుకుని ఆర్డినెన్స్ జారి చేయడం జరిగింది.దానికి అనుగుణంగా 617,618,619 జిఓలను ప్రభుత్వం అమలు లోకి తీసుకువరావడం జరిగింది.
అప్పుడు ఎలక్షన్ కమీషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన పదవినుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ఆయన స్ధానంలో రిటైర్డ్ జడ్జి,న్యాయకోవిదుడు దళితవర్గానికి చెందిన న్యాయమేధావి కనగరాజ్ ను నియమించారు.
ఈ పరిణామాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితోపాటుగా భారతీయజనతాపార్టీ,టిడిపికి చెందినవారు హైకోర్టును ఆశ్రయించడం ఈ ఆర్డినెన్స్,తదుపరి వచ్చిన జిఓలు చెల్లవని,కనగరాజ్ గారి నియామకం కూడా చెల్లదని వాదనలు వినిపించారు.
దానిపై హైకోర్టు ఈరోజు తీర్పును వెలవరించింది.ఆ తీర్పులో ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుధ్దమని,దానికి అనుగుణంగా ఇచ్చిన జిఓలన్నింటిని కూడా క్యాన్సిల్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇది ఒక పరిణామక్రమం.న్యాయవ్యవస్ధపై మా పార్టీకి,ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉంది.అందులో ఎవ్వరూ ఎటువంటి సందేహం పడవలసిన అవసరంలేదు.
న్యాయస్ధానాలు ఇచ్చేతీర్పులలో కొన్ని సందర్భాలలో న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉండటం కూడా చాలా సహజం.న్యాయం జరగలేదనే అభిప్రాయంతో ఉన్నప్పుడు వాటిని పైకోర్టులకు అప్పీల్ చేసుకునే రాజ్యాంగ హక్కు ఎవరికైనా ఉంటుంది.
ఆ క్రమంలోనే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, దానిలో ఉన్నపూర్వాపరాలను న్యాయనిపుణులచే పరిశీలింపచేస్తున్నాం.స్దూలంగా రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమంటే తప్పనిసరిగా దీనిని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవాలి. ఆ నేపధ్యంలోసుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ లు కాని, జిఓలు కాని ప్రజాస్వామ్యబధ్దంగా తీసుకువచ్చామని తెలియచేస్తున్నాను.
రాజ్యాంగబధ్దంగానే ఆర్డినెన్స్ తీసుకురావడం, గవర్నర్ ఆమోదించడం దానికి అనుగుణంగా జిఓలు రావడం, ఆ జిఓలకు అనుగుణంగా రమేష్ కుమార్ గారు పదవివిరమణ చేయాల్సిన అనివార్యపరిస్ధితులు రావడం ,దానికి తగ్గట్లుగానే న్యాయకోవిదుడైన జస్టిస్ కనగరాజ్ గారు ఛార్జ్ తీసుకోవడం జరిగిందనేది మా అభిప్రాయం.
దీనికి భిన్నాభిప్రాయం న్యాయస్ధానాలు ఇచ్చాయి.వాటిపై మాకు గౌరవం ఉంది.ఈ తీర్పుపై మేం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
రమేష్ కుమార్ గారి ఇంటిగ్రిటీపై మేం చాలా సందర్భాలలో వివరించడం జరిగింది.ఆయన నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్ధానంలో ఉండి అలా వ్యవహరించడం లో విఫలమవుతున్నారు.పక్షపాతధోరణితోనే వ్యవహరిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
దానికి చిన్నఉదాహరణ ఏమంటే ఆయన కేంద్రప్రభుత్వానికి,హోంమంత్రిత్వశాఖకు రాసిన లెటర్ లో ఉన్న అంశాన్ని మీకు తెలియచేస్తున్నాను.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు చేయాలని భావిస్తోంది.దానికి అనుగుణంగానే ఒక చట్టాన్ని పంచాయితీరాజ్ వ్యవస్ధలో తీసుకురావడం జరిగింది.ఆ చట్టం ఇంకా ఫోర్స్ లోఉంది. ఎన్నికలలో డబ్బు,మద్యం పంపిణిని అరికట్టాలనే దృక్పధంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు స్దానికసంస్ధల ఎన్నికలలో ఈ సంస్కరణలు తెచ్చారు.
అయితే స్దానికసంస్ధలలో సంస్కరణలకు సంబంధించిన చట్టంపై రమేష్ కుమార్ గారు చాలా చిత్రమైన వ్యాఖ్యచేశారు.ఆయన రాజ్యాంగబధ్ద పదవిలో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం.
ఎవరైతే లిక్కర్ గాని,డబ్బుగాని విచ్చలవిడిగా ఎన్నికలలో పంచారో వారిపై నేరం రుజువైతే వారు గెలిచాక వారిని అనర్హులుగా ప్రకటించబడుతుందని చట్టాన్ని తీసుకువస్తే దానిపై కూడా నిమ్మగడ్డ రమేష్ అనుచితవ్యాఖ్యలు చేస్తూ లెటర్ రాయడమేంటి.
ఇది ఆయన రాసిన లెటర్ కాదు.వేరేచోట చంద్రబాబు నాయకత్వంలో లెటర్ ప్రిపేర్ అయిందని మేం ఆరోపణ చేశాం.అది చదివితే ఎవరికైనా ఇదే అర్దమవుతుంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం.
(అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు)