Home Breaking నర్సాపురం ఎంపి కనుమూరుని వైసిపి వదిలించుకుంటుందా?

నర్సాపురం ఎంపి కనుమూరుని వైసిపి వదిలించుకుంటుందా?

359
0
Kanumuru Raghu Rama krishnamraju ycp mp (Facebook picture)
 వైసిపి  ఎమ్మెల్యేల‌కు వైసిపికే చందిన నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు మధ్య గొడవ రోజుకు రోజుకు ముదురుతూ ఉంది.
ఆయన పార్టీలో రెబెల్ గా తయారయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఆయన బిజెపిలోకి వెళతారని అనుకూడా వార్తలొచ్చాయి. అదే విధంగా పార్టీ ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారని రెండు మూడురోజులుగా వినబడుతూ ఉంది. వైసిపి నేతలు కులరాజకీయాలు చేస్తున్నారని, తమది చాలా చిన్నకులమని, ఈ కులంలో చిచ్చు పెట్టవద్దని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో ఆయన తన లోక్ సభ నియోజకవర్గంలోని   ఐదుగురు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. ధమ్ముంటే తన శాసనసభ్యత్వాలకు  రాజీనామా చేసి జగన్‌  బొమ్మ మళ్లీ గెల‌వాలని చాలెంజ్ చేశారు. వాళ్లేంచేస్తున్నారో పేరున పేరున చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యే మంత్రులు దొంగలని అన్నారు, ఇళ్ల స్థలాల పేరుతో దొచుకుంటున్నారని, ఇసుకను కాజేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది మంచి వాళ్లయిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ అప్పాయంట్ మెంటే దొరకడం లేదని రఘరామకృష్ణం రాజు అన్నారు. ఇలా అప్పాయంట్ మెంటుదొరకని శాసనసభ్యులలోొ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒకరని అన్నారు. శ్రీనివాస్ ని ఆయన నిజాయితీ పరుడు, సౌమ్యుడు అని వర్ణించారు. ఎమ్మెల్యే లుకారుమూరు  నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణలు దొంగలని, ఇసుకను దోచుకుుంటున్నారని,డబ్బు వసూలు చేసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజువ్యాఖ్యానించారు.
ఈ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికల్లలో గెలవగలరా, జగన్ బొమ్మనే పెట్టుకుని గెలవచ్చని ఆయన సవాల్ విసిరారు. వాళ్లు రాజీనామాచేస్తే నేను రాజీనామా చేస్తానని కూడా ఆయన చెప్పారు,
తానెపుడూ జగన్ ని కలవలేదని, ఒకే సరి కలిశానని అదికూడా ఎయిర్ పోర్టులలో నని ఆయన చెప్పారు. అదే విధంగా తాను వైసిపిలో చేరేందుకు ఎపుడూవెంపర్లాడలేదని చెబుతు జగన్ కు ఎన్నికల ప్రచారాన్నిమేనేజ్ చేసినప్రశాంత్ కిశోర్ రుషి వ్యక్తిని తన దగ్గిరకు పంపించి పార్టీలో చేరేందుు రాయబారం నడిపించారని ఆయన చెప్పారు. పార్టీలో చేరేందుకు   విజయసాయిరెడ్డి, రాజిరెడ్డిలు ఎన్ని ఆశలుపెట్టారో వాళ్లనే అడిగి తెలుసుకోవచ్చని రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఈ రోజు పార్టీ నేతలు కూడా  పెద్ద ఎత్తున స్పదించారు. మంత్రి రంగనాథ రాజుతో కలసి వైసిపి నేతలు ఆయనకు ప్రతిసవాల్ విసిరారు. ఇష్టంలేకపోతే, పార్టీ నుంచి వెళ్లి పోవచ్చని, విమర్శలు చేయడమెందుకుని వారు ప్రశ్నించారు. రఘురామ కృష్ణం రాజు ధోరణి ఏరుదాటాక తెప్పతగేలేేసే లాగా ఉందని వారు విమర్శించారు.
రఘురామకృష్ణం రాజు తొలినుంచి పార్టీ విధానాలను, జగన్ ధోరణిని విమర్శిస్తూనే వున్నారు. తాజాగా ఆయన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ఏకంగా ఆయన పార్లమెంటులోనే ఈ అంశం లేవనెత్తుతూ కేంద్రం జోక్యం చేసుకుని పాఠశాలలో మాతృభాషలో బోధన ఉండేాలా చూాాడాలని కోరారు.  అపుడు జగన్  తీవ్రంగా మందలించారు. ఆయితే, జగన్ ఆయన పెరెత్త లేదు. కాకపోతే,పార్టీ విధాానాలకు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిగే ఎవరిమీదనైనా క్రమశిక్షణా చర్యలుంటాయని హెచ్చరించారు.
 ఈరోజు రఘురామ కృష్ణంరాజు చేసిన విమర్శులు చూస్తే ఆయన కు పార్టీ ఉద్వాసన చెప్పకతప్పదేమో అనిపిస్తుంది. అయితే, ఆయన పార్టీనుంచి బహిష్కరిస్తే  లోకసభ సభత్వం పోయే అవకాశం బాగా తక్కువ.  పార్టీ నుంచి పంపిస్తే ఆయన బాహాటాంగా బిజెపి పక్షాన చేరవచ్చు.దానితో బిజెపికి  రాష్ట్రంలో ఊతం ఇచ్చినట్లువుతుంది.