బిజెపిని ఇరుకున పెట్టే సవాల్ విసిరిన జీవన్ రెడ్డి

తెలంగాణలో దూసుకుపోతున్న భారతీయ జనతా  పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కొత్త సవాల్ విసిరారు. నిజంగానే,  రాష్ట్ర బిజెపికి, కేంద్రం బిజెపికి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశం ఉంటే,  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజక్టులను ఆపేయాలని సవాల్ విసిరారు.

ప్రాజక్టులను ఆపే శక్తి కేంద్రంలో ఉన్న బిజెపికి ఉంది.అలాంటపుడు వూరికే ప్రాజక్టుల గురించి విమర్శలు గుప్పించే బదులు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఎపి కడుతున్న అక్రమ ప్రాజక్టులను ఎందుకు ఆపేయడం లేదు. తెలంగాణ బిజెపి ఈ దిశలో ఎందుకు పనిచేయడం లేద అని ఆయన ప్రశ్నించారు.

టిఆర్ ఎస్ ప్రభుత్వంతో పాటు, బిజెపి కూడా ఈ విషయంలో విఫలమయ్యాయని ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు.

‘రాష్ట్ర విభజన బిల్లుకు భిన్నంగా ఎవరు ఏ ప్రాజెక్టు కట్టినా..అవి అక్రమ ప్రాజెక్టులు గా గుర్తిస్తాం అని కేంద్ర మంత్రి చెప్పారు.  కేంద్రం ఆదేశాలు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టడం వల్ల తెలంగాణ నష్టపోతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కాని, ఆంధ్ర ప్రాజెక్టుల ను ఎందుకు ఆపడం లేదు. లేఖలు రాసి కేంద్రం  చేతులు దులుపుకోవాలనుకుంటున్నది,’ అని జీవన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని బీజేపీ అనుకుంటే అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

‘తెలంగాణ ఏర్పాటే నీళ్లు , నిధులు , నియామకాలు కోసం.ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆ మూడు అంశాలలో పూర్తి వైఫల్యం చెందింది.  మిగులు బడ్జెట్ నుంచి 3 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి పోయింది. నియామకాల విషయంలో లక్ష్యం నెరవేరడం లేదు. నీళ్ల విషయానికొస్తే  కృష్ణా, గోదావరి జలాలలో వాటా దక్కించుకోవడం లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలు తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కృష్ణా జలాల విషయంలో ఏపీ  తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుంటే కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా వున్నారు. . తెలంగాణ ప్రయోజనాలు జగన్ కి తాకట్టుపెట్టారు కేసీఆర్,’ అని జీవన్ రెడ్డి విమర్శించారు.

. కేసీఆర్ అసమర్థత, అవినీతి కాంక్ష తోనే జగన్ తో కుమ్మక్కు అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

జీవన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…

*కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి ఫేస్ ద్వారా 450 టి.యం.సి. నీటి లభ్యతకు వెసులుబాటు ఉంది. కానీ 300 టి.యమ్.సి. మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. ఇంకా 150 టి.యం.సి. మిగులు జలాలు ఉండగా సెకండ్ ఫేస్ ద్వారా మరో టీంయంసి లిఫ్ట్ కి తెరలేపడం హాస్యాస్పదంగా ఉంది. మొదటి ఫేస్ లోనే బి.హెచ్ ఇ. ఎల్. ద్వారా ఏర్పాటు చేయబడ్డ నీటి పంపుల ఏర్పాటు విషయంలో 5650 కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో రెండో ఫేస్ ద్వారా అదనపు ఒక టీ.యమ్. సి. నీటి కోసం పనులను చేపట్టడం మరింతగా అవినీతి కార్యకలాపాలకు బరితెగించడమే.

* కాళేశ్వరం తో 18 లక్షల ఎకరాలకు నీటిని అందించడం కోసమే కట్టారు. 450 టీఎంసీ వినియోగించుకునే సామర్థ్యం ఉన్నా వాడుకోవడం లేదు

*అవసరం లేకున్నా అదనపు టీఎంసీ నీటిని నువ్వే తొడుతున్నావ్.దీన్ని సాకుగా చూపి కృష్ణా నదికి ఆంధ్రకు మళ్లించుకునే పనిలో పడ్డారు జగన్

*అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో భాగంగానే ఫేజ్ 2

*కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు ప్రశ్నార్ధకం కాబోతున్నాయి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *