ఇపుడు తెలంగాణలో ఎన్నికలొస్తే ఏమవుతుంది, ఒక సర్వే

తెలంగాణలో ఇపుడున్నట్లుండి ఎన్నికలు జరిపితే ఏమవుతుంది? ఇది పూర్తిగా అనూహ్యమయిన పరిస్థితి. ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. అయితే,  ఒక వూహాజనిత పరిస్థితి. సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్  అండ్ సెఫొలాజికల్ స్టడీస్ ( CPR&PS) అనే సంస్థ దీనికి సమాధానం చెప్పింది. ఈ సంస్థ చిన్న అధ్యయనం చేసి, ఇపుడు ఎన్నికలు జరిపితే, బిజెపి నెంబర్ పార్టీగా వస్తుందని, కాంగ్రెస్ రెండో స్థానంలో వుంటుందని చెప్పింది. టిఆర్ ఎస్ బాగా పతనమవుతుందని చెప్పింది.

ఈ సంస్థ  2020 డిసెంబర్ 28, 2021 జనవరి 19 మంది రాష్ట్రంలో ఈ సర్వే జరిపింది. ఈ సర్వేకోసం  16,500 పోలింగ్ స్టేషన్ల కింద వచ్చే  1,80,000 మంది ఓటర్లతో ‘ఇపుడు ఎన్నికలొస్తే ఏమవుతుంది?, ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరు ఎలా ఉంది అనే ప్రశ్నలు వేసి సర్వే చేసింది.  ఈ పోలింగ్ స్టేషన్లు 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో  ఉన్నాయి. అంటే రాష్ట్రవ్యాపితంగా సర్వే జరిగింది.  సర్వేకు ఉపయోగించిన మెథాడాలజీ రైట్ హ్యాండ్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్.  రైట్ హ్యాండ్ మెథడ్ అంటే ఎక్కడో ఒక చోట సర్వేకోసం  ఇక ఇంటిని  ఎంపిక చేసుకుని ఇక్కడి నుంచి రైట్ సైడ్  న ఉండే ఇళ్లను మాత్రమే సందర్శించి సర్వేకోసం వోటర్లను ఎంపిక చేసుకోవడం. దీని వల్ల సర్వే చేస్తున్నవాడి దోషం తక్కువగా ఉంటుందని చెబుతారు. తనకు ఇష్టమున్న లేకున్నా రైట్ సైడ్ ఇంటికి మాత్రమే సర్వే కోసం వెళ్లాలి. ఇది పాపులర్ శాంపిల్ సెలక్షన్ టెక్నికే. అనుమానం లేదు. 96 శాతం పోలింగ్ స్టేషన్లను కవర్ చేసినట్లు ఈ సంస్థ చెప్పుకుంది.

ఈ సర్వేలో ముఖ్యమంత్రి కెసిఆర్ పని తీరు మీద ఎక్కువ  మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరు  బాగుందని 21.4 శాతం మంది అభిప్రాయపడితే, పర్వాలేదు (average) అని చెప్పింది 33.3 శాతం మంది. ఇక  బాగ లేదు (Bad) అన్నవాళ్లు బాగా ఎక్కువ ఉన్నారు. వారు 43.4 శాతం మంది. ఇక 2 శాతం సర్వేలో పాల్గొన్నవారు ఎటూ చెప్పలేక పోయారు. పరిస్థితి ఇలా ఉన్నపుడు దీనికి తగ్గట్టుగానే ఓటింగ్ జరుగుతందని ఈ సర్వేలో వెల్లడయింది. బిజెపి టాప్ లో వస్తున్నదని ఈ సర్వేలో తేలింది.

 

బిజెపి వోట్ షేర్  అమాంతం పెరిగింది. బిజెపి వాళ్లు పండగ చేసుకోవచ్చు. సర్వేలో పాల్గొన్నవారిలో  37.4 శాత మంది బిజెపికి అనుకూలంగా కనిపించారు. తర్వాతి స్థానం  31.8 శాతంతో కాంగ్రెస్ (ఐ) పార్టీది. ఇది గొప్ప మార్పు. కాంగ్రెస్ కాలరేగరేసుకుని కార్యక్రమాలు చేపట్టవచ్చు. టిఆర్ ఎస్ పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఇది కేవలం  13.5 శాతమే. సర్వేల్లో  పాల్గొన్నవారిలో కేవలం 13.5 శాతం మంది మాత్రమే టిఆర్ ఎస్ కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టిఆర్ ఎస్ విపరీతంగా ఖర్చుపెట్టి నగదు బదిలీ చేసి నిర్మిస్తున్న బంగారు తెలంగాణ ఏమయింది? ఇది రూలింగ్ పార్టీ కి షాకే. టిఆర్ ఎస్ గ్రాఫ్ ఇంతగా పడిపోయిందంటే నమ్మలేం.  మరి భారీ శాంపిల్ తో చేసిన సర్వే. పూర్తిగా తీసేయడానికి వీల్లేదు.  ఇపుడు ఎన్నికలు జరిగితే మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి?

 

ఇపుడు తక్షణం ఎన్నికలు జరిగితే తెలంగాణలో మెజారిటీ బిజెపికి వస్తుంది. బిజెపికి  49 నుంచి 54 సీట్లు రావచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి  43 నుంచి 47 సీట్లు రానున్నాయి. టిఆర్ఎస్ పరిస్థితి బాగా దిగజారింది. ఈ పార్టీకి ఈసర్వేలో   14 నుంచి 16 సీట్లు మించిరావని తేలింది. ఇక ఎంఐఎం కోట చెక్కుచెదరడం లేదు. ఏడునుంచి పది సీట్లు వస్తున్నాయి. మరొక రెండు సీట్లు ఇతరలకు వెళతాయని ఈ సర్వే చెప్పింది. ఈ సర్వే పేరుతో నివేదిక ను షేర్ చేస్తున్నారు. దాని అధారంగా రాసిన వార్త ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *