కొంప ముంచే కొత్త వాట్సాప్ వస్తున్నది, జాగ్రత్త

ఇంతవరకు మీరు పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చిన అనేక వ్యక్తిగత రహస్యాలను మీకు మీరుగా వాట్సాప్ కు, ఫేస్ బుక్  కు సమర్పించుకుని సరెండర్ అయ్యే రోజువస్తున్నది…వచ్చే నెలలోనే ఈ ముప్పు ఎదురవుతున్నది.

వాట్సాప్ కొత్త ప్రైవసీ వచ్చే నెల నుంచి అమలులోకి వస్తున్నది. ఈ కొత్త ప్రైవసీ  వాట్సాప్ వాడకందారులంతా అంగీకరించి బటన్ నొక్కేస్తేనే వాట్పాప్ పనిచేస్తుంది. లేకపోతే, వాట్సాప్అందుబాటులో ఉండదు.

బటన్ నొక్కడం ఏమంతా కష్టంకాదుగాని, బటన్ నొక్కిన మరుక్షణం, మీ గురించి ప్రతివిషయం వాట్సాప్ కలెక్ట్ చేస్తుంది. ఒక్కమాటలో చెబితే, మీరు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీకి ఒప్పకుంటే, మీ గురించి వాట్సాప్ కు తెలియని విషయం మంటూ ఉండదు.

మీ రహస్యాలని, రహస్య చిత్రాలను కూడా వాట్పాస్ కలెక్ట్ చేసుకుంటుంది. మీ సమాచారాన్నంతా తన దగ్గిర పెట్టుకుని వాట్సాప్ మిమ్మల్ని ఒక ఆట ఆడిపిస్తుంది. వాట్సాప్అ నేది  ఫేస్ బుక్ గ్రూప్ కు  సంబంధించింది కాబట్టి వాట్సాప్ సమాచారం మొత్తం ఫేస్ బుక్ కు అందుబాటులోకి వస్తుంది.  వాట్సా ప్  మన దగ్గిర నుంచి కలెక్ట్ చేసే సమాచారం ఏమిటో తెలుసా?

డివైస్ ఐడి, యూజర్ఐడి, అడ్వర్టయిజింగ్  డేటా, పర్చేజ్ హిస్టరీ, లొకేషన్, ఫోన్ నెంబర్, ఇమెయిల్ అడ్రస్, మీ కాంటాక్టులు,  ప్రాడక్ట్ ఇంటరాక్షన్, క్రాష్ డేటా, పర్ ఫామెన్స్ డేటా, డియాగ్నోస్టిక్ డేటా, పేమెంట్ ఇన్ ఫర్మేషన్, కస్టమర్ సపోర్టు ఇన్ ఫర్మేషన్, ఫోటోలు, వీడియోలు. ఇక ముందు వాట్సాప్ తెలియకుండా మీ ఫోన్ లో ఏమి దాచుకోలేరు.

వాట్సాప్ కొల్లగొట్టే రహస్యాలివే.

 

Device ID
User ID
Advertising Data
Purchase History
Location
Phone Number
Email Address
Contacts
Product Interaction
Crash Data
Performance Data
Other Diagnostic Data
Payment Info
Customer Support
Product Interaction
Other User Content

Photos and Videos

Audio Data

Search History

ఈ ఇన్ ఫర్మషన్ ను ఉపయోగించి వాట్సాప్, ఫేస్ బుక్ లు మీ సైకాలజీ,  మీ నడవడికను, మీ అలవాట్లను అదుపులోకి తెచ్చుకుంటాయి. కమాండ్ చేస్తాయి.  మీ అవసరాలకు తగ్గట్టు మీ మీద  ఇన్ ఫర్మేషన్ ఎటాక్ చేస్తాయి.   మీ రహస్యాలను బిజినెస్ కోసం వినియోగించుకుంటాయి. ఈ డేటాను ఇతర బిజినెస్ కంపెనీలకు, రాజకీయ పార్టీలకు విక్రయించకూడదనే మీ లేదు. ఒక్క మాట లో చెబితే, ఇంతవరకు చాలా జాగ్రత్తగా గోప్యంగా కాపాడుకుంటూ వచ్చిన అనేక పర్సనల్,కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ వాట్సాప్ కు మీకు మీరుగా సమర్పించుకుంటున్నారు.

అందుకే ఇది డేంజర్, ఇదేమిటి, దీన్నెలా అనుమతిస్తారు,  దీనిని రద్దు చేయండి, ఏదైనా చర్యలు తీసుకోండని కాన్పెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CATT) కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరింది.

ఫేస్ బుక్ కు ఇండియాలో  20 కోట్ల  మంది యూజర్లున్నారు. ఇంత  మంది ఇన్ఫర్మేషన్ గుప్పిట్టో పెట్టుకుంటే ఫేస్ బుక్ ఎంతగా భారతదేశాన్ని ప్రభావింతం చేస్తుందో చూడండని వారు మంత్రిని కోరారు. అందుకే వాట్పాప్ ను, ఫేస్ బుక్ ను బ్యాన్ చేయాలని వారు కేంద్ర మంత్రిని కోరారు.

“ఇది బ్రిటిష్ కంపెనీ ఈస్టిండియా కంపెనీని గుర్తుకు తెస్తున్నది. ఈస్టిండియా కంపెనీ ఉప్పు వ్యాపారం పేరుతో భారత్ లో కాలుమోపి భారతదేశాన్ని మొత్తం గుప్పిట్లోకి తెచ్చుకుని పరిపాలించింది. ఇపుడు ఉప్పు స్థానంలోకి డేటా వచ్చింది. మొదట ఫేస్ బుక్, వాట్సాప్ లను ఉచితంగా వాడుకునేందుకు భారతీయులకు అవకాశం కల్పించి, ఈ రెండింటికి అలవాటు పడేలా చేసి, ఇపుడు  వ్యక్తిగత సమాచారం కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు, ’అని సిఎఐటి పేర్కొంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *