Home Breaking నేడు ప్రపంచ ఆరోగ్య దినం… గుర్తుంచు కోవలసిన మాట OOP, దీని అర్థం ఏమిటి?

నేడు ప్రపంచ ఆరోగ్య దినం… గుర్తుంచు కోవలసిన మాట OOP, దీని అర్థం ఏమిటి?

129
0

ప్రతిసంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచమంతా ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ (Wolrd Health Day) జరుపుకుంటారు.

ఇలాజరుపుకోవాలని 1948లో నిర్ణయించారు. ఆయేడాది మొట్టమొదటి ప్రపంచ ఆరోగ్య సభ (World Health Assembly) జెనీవా లో జూన్ 24 నుంచి జూలై 24 దాకా జరిగింది. నిజానికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జూలై 22 నిర్వహించాలనేది ఈ సభలో జరిగిన తీర్మానం. 1946 జూలై 22న ప్రపంచ ఆరోగ్య సంస్థచార్టర్ ని ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించిన రోజు. దానికి గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినం పాటించాలని నిర్ణయించారు. తర్వాత దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటయిన ఏప్రిల్ 7న పాటించాలని నిర్ణయించారు.

ఇలా ఈ దినం పాటించడం 1950 నుంచి మొదలయింది. ఆరోగ్యసమస్యల గురించి ప్రజలలో అవగాహన పెంచేందుకు ఈ రోజు ప్రపంచ ప్రభుత్వాలు కృషిచేస్తాయి. ప్రతి యేడాది ప్రపంచ ఆరోగ్య దినానికి ఒక థీమ్ ఉంటుంది. 2021 ధీమ్ న్యాయమయిన ఆరోగ్యవంతమయిన ప్రపంచాన్ని నిర్మించడం(Building a fairer, healthier world).

ఇలాంటి సమాజం నిర్మించాలంటే ఆరోగ్యం, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు ఎదుర్కొంటున్న చాలాజబ్బు నివారించగలిగేవేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతుంది. నివారించలేకపోతున్నాం. దీనితో జబ్బుల బారిన పడినకుటుంబాలు వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో ఈ ఖర్చలు భరించలేక చాలా కుటుంబాలు దారిద్ర్యంలో పడిపోతున్నాయి.

ఇక్కడే (ఊప్) OOP (Out-Of-Pocket-Expenditure/Payment) అనే మాట వినబడుతుంది.
ఒక కుటుంబం వైద్యం కోసం జేబు నుంచి ఖర్చు చేసే మొత్తమే OOP. ఇన్స్యూ రెన్స్ చెల్లించే మొత్తం, రిఎంబర్స్ చేసే మొత్తం కాకుండా ఒక కుటుంబం మీద పడే వైద్యం ఖర్చు భారమే OOP. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్వచనం : …direct payments made by individuals to health care providers at the time of service use. This excludes any prepayment for health services, for example in the form of taxes or specific insurance premiums or contributions and, where possible, net of any reimbursements to the individual who made the payments.

ఊప్ అనే మాట ఒక దేశం ఆరోగ్యవ్యవస్థకు అద్దం పడుతుంది. కుటుంబం మీద ఊప్ భారం ఎక్కువయితే పేదరికంలో పడిపోతాయి. అందుకే OOP భారం తగ్గించాలనేది ప్రపంచ ఆరోగ్యం సంస్థ ధ్యేయం. అయితే, ఈ ప్రయత్నం నెరవేరాలంటే ప్రభుత్వం ప్రజారోగ్యం మీద ఎక్కువ ఖర్చుచేయాలి. ఎంత ఖర్చుచేయాలి?

1946 భోర్ కమిటీ

1946లో నాటి భారత ప్రభుత్వం నియమించిన భోర్ కమిటి జిడిపిలో 12 శాతం వైద్యానికి ఖర్చు చేయాలని చెప్పింది. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1943లో సర్ జెసెఫ్ విలియమ్ భోర్ నాయకత్వంలో వైద్యం ఆరోగ్యం ఎలా ఉండాలనే దానిమీద ఒక కమిటీ వేసింది. దీని పేరు Health Planning and Development Committee). ఇప్పటికీ ఈ కమిటీ నివేదిక దేశానికి చాలా ముఖ్యమని చెబుతారు. ఈ కమిటీ దేశంలో ఆరోగ్య పరిస్థితి, వైద్య ఆరోగ్య సంస్థలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. ఇపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించింది ఈ కమిటీ సూచన మేరకే. చాలా అద్భతమయిన సిఫార్సలు భోర్ రిపోర్టులో ఉన్నాయి పిహెచ్ సి ప్రతి 40 వేల జనాభాకొకటి ఉండాలని, ప్రతి పిహెచ్సి లో 75 పడకల ఆసుపత్రి, ఆరుగురు వైద్యాధికారుల, సర్జికల్, ప్రసూతి డాక్టర్, వారికి మద్దతుగా ఆరుగురు నర్సులు, ఆరుగురు మంత్రసానులు, ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లు, 2 శానిటరీ ఇన్స్ పెక్టర్లు ఉండాలనేది ఇందులో మరొక ముఖ్యప్రతిపాదన. ఇపుడు 2021లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇదెంతవరకు నెరవేరిందో ఇపుడు మనచుట్టూర ఉన్న PHC లను చూస్తే తెలుస్తుంది.

దేశంలో వైద్య వ్యవస్థను నిర్మించేందు జిడిపిలో 12 శాతం నిధులు కేటాయించాలని కూడా ఆయన చెప్పారు. ఇపుడు ఎంతకేటాయిస్తున్నారు?

మొన్న జనవరి 29న పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-2022 ఆర్థిక సర్వే  వైద్యం కోసం జిడిపిలో 2.5 శాతం నుంచి 3 శాతం దాకా కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇపుడు పరిస్థితి ఎలా ఉంది? 2018-19లో జిడిపిలో 1.4 శాతం నిధులు కేటాయించారు. 2019-20లో 1.5శాతం, 2020-2021లో 1.8 శాతం కేటాయించారు. ఇది అంతా కొనియాడిన భోర్ కమిటి నివేదిక వచ్చిన 70సంవత్సరాల తర్వాతి పరిస్థితి. భోర్ కమిటి సిఫార్సు నెరవేరాంటే ఏన్ని దశాబ్దాలు పడుతుంది?

ఇక మళ్లీ మరొక ఊప్ (OOP) దాకా వద్దాం.

భారత ప్రభుత్వం వైద్యం మీద ఏడాదికి తలసరి ఖర్చు చేస్తున్నమొత్తం (2015-16):రు. 1,112 మాత్రమే. నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్ 2014-2015 ప్రకారం తలసరి భారతప్రభుత్వం వైద్య రంగం మీద చేస్తున్న ఖర్చు రు. 1,108 మాత్రమే. అంటే రోజుకి రు. 3 మాత్రమే. కాని భారతదేశంలో ఊప్ భారం (Out-Of-Pocket Expenditure) రు. 2,394. కుటుంబాల మీద పడుతున్న వైద్యం ఖర్చులో ప్రభుత్వం అందిస్తున్నది కేవలం మూడు రుపాయాలు మాత్రమే.

ఇదే స్విజర్లాండులో ప్రభుత్వం వైద్య రంగం మీద ఏడాదికి తలసరి చేస్తున్న వ్యయం $6,944, అమెరికాలో $4,802 ,ఇంగ్లండు లో #3,500.

2017 నాటికి భారత దేశంలో మొత్తం వైద్యం మీద చేసిన ఖర్చులో 67.07 శాతం ఊప్ నుంచి వచ్చిందే.

ప్రభుత్వానికిపన్నులు కడుతున్నా ప్రజలు వైద్య సేవలం భారత ఎంతగా భరిస్తున్నారో ఇది అంకె చెబుతుంది. ఊప్ ప్రపంచ సగటు 18.2 శాతమే…

వైద్యసేవలు భారతదేశంలో ఎలా ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు గుర్తుంచుకోవలసిన అసవరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here