కెసిఆర్ కిట్ లో చేనేత చీరలు చేర్చండి: ఈటెలకు వినతి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడే వస్త్ర ఉత్పత్తులను చేనేత సహకార సంఘాల నుండి నేరుగా కొనుగోలు చేయాలి
కరోనా వైరస్ ప్రభావంతో చేనేత రంగంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయినందున , చేనేత కార్మికులను అదుకునేందుకు  ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా కెసిఆర్ కిట్స్ పథకంలో చేనేత వస్తాలను చేర్చాలని అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగ జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ విజ్ఞప్తి చేశారు.

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల నేతవారికి ఉపాధిలభిస్తుందని చెబుతూ ప్రభుత్వం మీద పెద్దగా ఆర్థిక భారం లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించవచ్చని చెబుతూ ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ కు విజ్థప్తి చేశారు.
లాక్ డౌన కారణంగా ఉపాధి కోల్పోయి ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, ఎందరో అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారని గుండేటి శ్రీధర్, అవ్వారి భాస్కర్ అన్నారు.
కరోనా కారణంగా మూలన పడిన మగ్గం/ The Lede picture
మంగళవారం రోజున సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ను వారు కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులలో వాడుతున్న వివిధ వస్త్ర ఉత్పత్తులను (బెడ్ షీట్, పిల్లో కవర్, ఎప్రాన్, మాస్క్, కర్టెన్ వగైరాలు) నేరుగా చేనేత సహకార సంఘాల నుండి లేదా చేనేత కార్మికుల నుండి కొనుగోలు చేయడం వల్ల వేలాది చేనేత కుటుంబాలకు మళ్లీ ఉపాధి దొరుకుతుందని, దీనికి చర్యలు చేపట్టాలని ఈ విజ్ఞాపణలో కోరారు.
 ప్రసవానంతరం తల్లులకు ఇపుడు  ప్రభుత్వం తరఫున అందించే కెసిఆర్ కిట్ లో ఇవ్వబడుతున్న పాలిస్టర్ చీరలకు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే కాటన్ నేత చీరలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ కిట్స్ పథకం మాతాశిశువుల ఆరోగ్యం కోసం 2017 జూన్ లో ప్రారంభమయింది. ఇందులో చేనేత చోటులేకుండా పోయింది.
weavers at work
ఈ చర్యల వల్ల చేనేత కార్మికులకు సంవత్సరం పొడవునా పని దొరికే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఇందుకు స్పందించిన మంత్రి ఈటెల, సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వ విధానాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య కార్యదర్శి కి లేఖ ను పంపినారు. చేనేత కార్మికులకు తన వంతు సహకారం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.