Home Breaking ఎస్ పి రూపంలో మానవత్వం ఆర్థరాత్రి ఇలా పరిమళించింది…

ఎస్ పి రూపంలో మానవత్వం ఆర్థరాత్రి ఇలా పరిమళించింది…

458
0
చిత్రాన్నం అందిస్తున్న ఎస్ పి రాజకుమారి
పోలీసుల చేష్టల మీద ఒక వైపు వెన్నులో వణుకు పుట్టే కథలు వింటుంటాం. మరొక వైపు కొందరు పోలీసుల్లో మానవత్వం పెల్లుబికుతూ ఉంటుంది.
ఈ సారి ఇది విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి రాజకుమారి రూపంలో ప్రత్యక్షమయింది.
ఆమె నిన్న ఆర్థ రాత్రి స్వయంగా హడావిడిగా అన్నం చేసి, చిత్రాన్నం కలిపి 11 మంది కూలీలకు అందించారు. ఆమె నిద్రకుపక్రమమిచే సమయంలో ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడుతున్నది ఒక మహిళ. తనకు, తనతోపాటు ఉన్న మరొక 10 అన్నం కావాలి, తాము బాగా ఆకలితో ఉన్నామని, తమకు ఏమీ అందుబాటులో లేదని దీనంగా అర్థించింది.

‘ఒక కూలి మహిళ ఇలానేరుగా తనకే ఫోన్ చేసి ఆకలిగా ఉందని అగడం ఆశ్చర్యం వేసింది, కలచివేసింది. వెంటనే నేను మాఆఫీసర్లకు ఫోన్ చేశాను. వాళ్ల బ్రెడ్ తీసుకు వెళ్తామన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో అందునా వేళ కాని వేళ బ్రెడ్ దొరకడా కష్టమే. దానికి తోడు మూడు రోజులుగా పస్తులుంటున్నవారి ఆకలిని బ్రెడ్ తీర్చలేదు. వాళ్లిక అన్నమే కావాలి,’ రాజకుమారి ముంబైయి మిర్రర్ కు తెలిపారు.
అందుకే ఒక పనిమనిషి సాయం తీసుకుని వెంటనే తానే చకచకా అన్నం వండారు. లెమన్ రైస్ కలిపారు. ఆ సమయంలో, ఒకవైపు వాళ్ల ఆకలితో ఉన్నపుడు అంతకు మంచి చేయడం సాధ్యం కాదు. అందుకని చిత్రాన్నం ప్యాక్ చేశారు. అంతేకాదు, తానే స్వయంగా లెండి కాలేజీలో ఉన్న క్వారంటైన్ సెంటర్ కు వెళ్లి అందించారు.
ఎస్ పి స్వయంగా వచ్చి భోజనం ఇవ్వడం వాళ్లందరిని ఆశ్చర్యపరిచింది. ఆనందభాష్ఫాలు తెప్పించింది. మూడు రోజులుగా తిండిలేక వందల మైళ్లు నడచుకుంటూ వచ్చిన తమకేమిటి,ఏకంగా ఒక పెద్దపోలీసాఫీసర్ ఇంటినుంచి భోజనం రావడం, అందునా ఎస్ పి స్వయంగా అందించమేమిటి. ఆశ్చర్యం నుంచి వాళ్లంతా సులభంగా తేరుకోలేకపోయారు. అప్పటికి అర్థరాత్రి ఒంటిగంటయింది.
వాళ్లంతా సూళ్లూరుపేట నుంచి నడుచుకుంటూ విజయనగరం వచ్చారు. దారి పొడుగునాఎక్కడా వాళ్లకి ఆహారం దొరలేదు. పోనీ కొందామంటే ఎవరీ దగ్గిర చిల్లి గవ్వ లేదు. వాళ్లంతా విజయనగరం జిల్లాకు చెందిన వారు. కూలి పనికోసం నెల్లూరు జిల్లాకు వలస వెళ్లారు. గత 50 రోజులుగా వాళ్లకి ఉపాధి లేదు. అంతో ఆంతో కూడబెట్టుకున్న పైసలయిపోయాయి. చేతులు ఖాళీ అయ్యాయి.
విజయనగరం చెక్ పోస్టు దగ్గిర ఎవరైనా నాలుగు మెతులకు పెడతారని ఆశపడ్డారు. అది దొరకలేదు. కాకపోతే, అక్కడ ఫోన్ చేసుకునేందుకు అవకాశం దొరికింది. కూలీలలో ఒక మహిళ తనకు తెలిసి అబ్బాయికి ఫోన్ చేసింది. ఆయన ఎక్కడో పల్లెటూర్లో ఉన్నాడు.
వచ్చి సాయం చేసే సమయం కాదు. అదృష్టవశాత్తు అతనొక పత్రికకు విలేకరి. ‘నేను చేయగలిగిన సాయం ఇదే’ నని చెప్పి ఆయన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చి, ఎస్ పి గారికి ఫోన్ చేస్తే మీకు తప్పక సాయం దొరుకుతుందని సలహా ఇచ్చారు.
అలా వారికి ఎస్ పి నెంబర్ దొరికింది. తర్వాత వీరిని అక్కడ ఉన్ పోలీసులు లెండి కాలేజీలో ఉన్న క్వారంటైన్ పంపించారు. క్వారంటైన్ సెంటర్ వెళితే, అక్కడ మీకు పరీక్షలు పూర్తి చేసి, అంతా బాగుంటే ఇంటికి పంపిస్తారని చెప్పారు. అలా వారు క్వారంటైన్ సెంటర్ కు వచ్చారు. తీరా వస్తే అక్కడ వాళ్లకి తినేందుకు ఏమీ లేదు అపుడు ఎస్ పి రాజకుమారికి ఫోన్ చేశారు.
వారందరికి రేపు పరీక్షలు చేసి హెమ్ క్వారంటైన్ కు పంపిస్తారని, హోం క్వారంటైన్ అంటే ఏమిటి ఎలా ఉండాలని వివరించి ఎస్ పి వెళ్లిపోయారు.