పందెం రాయుళ్లపై విజయనగరం ఎస్పీ కొరడా

విజయనగరం జిల్లాలో సంక్రాంతి  కోడి పందాలు నిర్వహించే వారి మీదే కాదు, పందాలకు స్థలాలు అందించే వారి మీద  జిల్లా ఎస్ పి కొరడా ఝళిపిస్తున్నారు. పందెం నిర్వహించడమే కాదు, కోడికి కత్తికట్టినా, కత్తులు తయారుచేసిన అమ్మినా, పందెేనికి పొలాన్ని, కళ్లాన్ని అందించిన కఠినంగా వ్యవహరించాలని ఎస్ పి ఆదేశాలు జారీ చేశారు.

పందాలు  నిర్వహించేందుకు ప్రైవేటు స్థలాలు, స్కూళ్ళు, కళాశాల గ్రౌండులను వినియోగిస్తే  స్థలాల  యజమానులే బాధ్యత వహించాల్సి  ఉంటుందని  ఎస్ పి రాజకుమారి హెచ్చరించారు.

జిల్లా పోలీసు సూపరింటెండెండ్ రాజకుమారి ఆదివారం నాడు ఈ మేరకు ఉత్తర్వుల జారీ చేశారు.

ఈ సారి సంక్రాంతి సంబరాలు కట్టుతెంచుకోకుండా ఉండేందుకు  ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో జూదం, కోడి, గొర్రె పందాలు,పందాల నిర్వహించిన వాళ్లతో పాటు, కోళ్ళకు కత్తులు కట్టే వారిని,
కోడి పందాల కత్తులను తయారు చేసే వారిని, పందెం పుంజులను పెంచే వారిని గుర్తించి పందాల నిర్వహణలో పాల్గొనకుండా బుద్ధిగా  ఉంటామని మండల  బైండోవరు తీసుకుంటున్నారు.

జూదం, కోడి, గొర్రె పందాలు, అక్రమమద్య విక్రయాలు, రవాణా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పైన కఠినంగా వ్యవహరించేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

వ్యవసాయ భూములు, తోటల్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో కోడి పందాలు
నిర్వహించం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని ప్రజలకు తెలిసే విధంగా గ్రామాల్లో దండోరా వేయిస్గున్నరు. మైకులు, గోడ
పత్రికలు, సామాజిక మాధ్యమాలతో విస్తృత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.

అదే విధంగా కోడి పందాలు, జూదం, డైమండ్ డబ్బా, మూడు ముక్కలాట మరియు ఇతర బెట్టింగు ఆటల నిర్వహించే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని రాజకుమారి ఆదేశాలు జారీ చేశారు.

అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొ్న కుండా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ప్రజలను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *