Home Breaking అబ్బే ఆ డాక్టర్ ని కొట్టలేదు, ఆయనే తాగి అల్లరి చేశాడు : పోలీసు కమిషనర్

అబ్బే ఆ డాక్టర్ ని కొట్టలేదు, ఆయనే తాగి అల్లరి చేశాడు : పోలీసు కమిషనర్

317
0
విశాఖ పట్టణం : అబ్బే ఆ డాక్టర్ నే కొట్టనేలేదు, చెయిచేసుకున్నడాన్న కాన్ స్టేబుల్ సస్పెండ్ చేయడం జరిగిందని విశాఖ పట్టణం  పోలీసు కమిషనర్  ఆర్ కె మీనా తెలిపారు. పోలీసులు డాక్టర్ సుధాకర్ ని  రోడ్దు మీద బట్టలూడదీసి, తాళ్లతో బంధించి కట్టారని చూపే ఫోటోలు వైరల్ కావడంతో కమిషనర్ మీన వివరణ ఇచ్చారు.
కమిషనర్ మీనా చెప్పిన విశేషాలు:
విశాఖ పట్ణణం నగరం అక్కాయపాలెం హైవే రోడ్డు పై ఒక వ్యక్తి గందరగోళం చేస్తున్నట్లు గా డయల్ 100 కి ఫిర్యాదు వచ్చింది
తక్షణమే నాల్గోవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడగ్గా వ్యక్తి నర్సీపట్నం ఆసుపత్రి లో సస్పెండ్ అయ్యిన డాక్టర్ సుధాకర్ గా గుర్తించారు.
పోలీసులు డాక్టర్ ని వారించే ప్రయత్నం చేయగా సదురు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించి, సెల్ ఫోన్ లు లాక్కుని విసిరారు

ప్రధాన జాతీయ రహదారి కావటం తో వాహనాలు , ప్రజలు కు తీవ్ర ఇబ్బందులు గురువతారు అని డాక్టర్ సుధాకర్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు 4 th పోలీస్ స్టేషన్ కు తరలించారు

డాక్టర్ తాగి డ్రైవ్ చేస్తే ప్రశ్నించకూడదా? వైసిపి నేతల ప్రశ్న

డాక్టర్ మద్యం సేవించి ఉండడం తో అతన్ని ఆల్కహాల్ పరీక్షలు నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్ పై లాఠీ తో కొట్టారు అని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశాము
ఆల్కహాల్ పరీక్షలు అనంతరం అతని పై 353 సెక్షన్ పెట్టి కేసు నమోదు చేస్తాము ,పరిస్థితి ని బట్టి చర్యలు ఉంటాయి
గత కొంత కాలంగా డాక్టర్ సుధాకర్ మానిసిక గా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే,ఏపీ ప్రభుత్వంపై కరోనా విషయంలో ఇటీవల ఆయన చేసిన ఆరోపణలు వల్లే డాక్టర్ పట్ల ఇలా అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. విశాఖ వీధుల్లో డా.సుధాకర్ ను తాళ్లతో కట్టేసి లాఠీలతో కొట్టారని, ఈ సంఘటన తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద జరిగిందని చెబుతున్నారు. కరోనా రోగులను చూస్తున్న ఆసుప్రతులలో మాస్కలు కూడా లేవని, ఒకటి రెండిచ్చి వాటిని వాడాలని చెబుతున్నారని, అసులు డాక్టర్లకు సరైన భద్రత కల్పించకుండా వైద్యం చేయమంటున్నారని డాక్టర్ సుధాకర్ పబ్లిక్ చెప్పారు. దీనితో  ప్రభుత్వాన్ని విమర్శించారని  ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
ఆసుపత్రి దగ్గిర నిరసన
అయితే, తనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినందుకు డాక్టర్ సుధాకర్ విశాఖ పోర్టు ఆసుపత్రి దగ్గిర నిరసన చేపట్టారు. గుండు గీయించుకుని రోడ్డు పడుకుని ఆయన కొద్ది సేపు నిరసన తెలిపారు. ఈ సమాచారం అందుకు పోలీసులు ఆసుపత్రి దగ్గిరకు వచ్చి ఆయనను అరెస్టు చేశారని ఈనాడు రాసింది.
పిచ్చివాడిగా చిత్రీకరించే కుట్రంః
శనివారం నాడు విశాఖలోని అక్కాయపాలెంలో రోడ్డుపై నిరసన తెలిపారు. సుధాకర్ మెడపై లాఠీతో వంచి, రెండు చేతులు కట్టేసి, కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారని టిడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత చెప్పారు.డాక్టర్ సుధాకర్‌ పట్ల పోలీసులు, ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని సుధాకర్‌పై దాడి వైసీపీ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా దాష్టీకాలకు పాల్పడుతోందని ఆమె ఆంధ్ర జ్యోతితో మాట్లాడుతూ అనిత ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అగ్రకుల దురంహంకారాన్ని ప్రదర్శిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కక్షతో పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు.
టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్