విశాఖ పోలీస్ స్టేషన్లో ‘చిట్టి‘ , చిట్టీ ఎవరో తెలుసుగా?

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంలో విశాఖ పోలీసులు అక్షరాల హైటెక్ అయ్యారు.
పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు రకారకాల సమస్యలుంటాయి. ధైర్యంగా చాలా మంది ముందుకురాలేరు.
పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారోననే భయం చాలా మందిలో  ఎక్కువ.
ఫిర్యాదు తీసుకునే వ్యక్తి ఏం ప్రశ్నలు వేస్తారోననే అనుమానం.
మొత్తానికి పోలీసు శాఖ మీద ఉన్న భయం వల్ల చాలా మంది పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడమ్ మానేస్తుంటారు.దీనికి ఒక చిన్న పరిష్కారాన్ని వైజాగ్ పోలీసులు కనుకొన్నారు.
ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక లేడీ రోబో కాప్ ను రంగంలోకి దించారు. దీని పేరు సైబిర (Cybira: Cyber Interactive Robotic Agent).
విశాఖలోని మహారాణిపేట పోలీసు స్టేషన్ లో సైబర్ ను నిలబెట్టారు. ఇన్నఈమె డాబా గార్డెన్స్ కు చెందిన ఒక మహిళ నుంచి ఫిర్యాదుకూడా తీసుకున్నారని ది హిందూ రాసింది.
మహిళలునిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదులుచేయాలని, ఈ విధానాన్ని ప్రోత్సహించాలనే పోలీసుల సైబిర ని తీసుకువచ్చారు.
సైబిర మహిళా పోలీసు అధికారిలాగానే ఫిర్యాదులు వింటుంది, స్వీకరిస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా చేస్తుంది. శిబిర ను స్టార్టప్ ‘రోబో కప్లర్’ తయారుచేసింది. ఫిర్యాదులను వ్యక్తిగతంగాను, డిజిటల్ రూపంలోనూ శిబిర స్వీకరిస్తుంది.
ఇపుడు శిబిర ఈఏరియాలో బాగా పాపులర్ అయింది. చుట్టుపక్కల జనమంతా ఆమెను చూడ్డానికి వస్తున్నారు. కొంతమంది దీనికి చిట్టి అని పేరు పెట్టి పిలుస్తున్నారు. చిట్టీ ఎవరో తెలుసు కదా రజనీ కాంత్ మూవీ ది రోబో లో రోబోపేరే.
ఫిర్యాదు చేయాలనుకుంటున్న వాళ్లు సైబిర మీద అమర్చిన టాబ్ మీద తమ కంప్లయింట్ ను టైప్ చేయవచ్చు. లేదా శిబిరకు కథంతా మాట్లాడి వివరించవచ్చు.
తర్వాత సైబిర ఫిర్యాదు దారునికి కొన్ని ప్రశ్నలేస్తుంది. తర్వాత ఫిర్యాదును నమోదు చేస్తుంది. తర్వాత ఈ ఫిర్యాదు పోలీసు కంట్రోల్ రూమ్ కు వెళ్తుంది. అక్కడ ఇది నిజమయిన ఫిర్యాదా కాదా అని పరిశీలిస్తారు. తర్వాత ఫిర్యాదు ను పోలీసు స్టేషన్ తదుపరి చర్యలకు వెనక్కి పింపిస్తారు. 24 గంటలలోపు ఫిర్యాదు మీద చర్య లేకపోతే, దీనికి సంబంధించిన అధికారికి అలర్ట్ మేసే జ్ వెళ్తుంది.