భక్తులకు దర్శనమీయనున్న విజయవాడ కనకదుర్గమ్మ, ఏర్పాట్లు మొదలు

విజయవాడ కనక దుర్గమ్మ దర్శనం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తులుశుభవార్త.  కరోనా లాక్ డౌన్ ప్రొటొకోల్స్  పాటిస్తూ భక్తులక అమ్మవారి దర్శనం  భాగ్యం కల్పించాలని అధికారులు నిర్ణయించార. ఏర్పాట్లు మొదలుపెట్టారు.
కరోనాా లాక్ డౌన్ కారణంగా గుడికి భక్తుల రాకను మార్చి 19 సాయంకాలం నుంచి నిలిపివేశారు. అయితే, గుడి లోపల పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూ వచ్చాయి.
ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో కచ్చితంగా నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అయిత,  అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే టిక్కెట్లను తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఎస్ఎమ్మెస్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లను చేశారు.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు.
గంటకు 250 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆధార్ నెంబర్‌తో సహా దర్శన సమయాన్ని ఎస్ఎమ్మెస్‌లలో భక్తులకు సమాచారం అందిస్తారు.
అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణి నిలిపి వేస్తూ అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.