ఇంద్రకీలాద్రి: కోవిడ్ లాక్ డౌన్ నియమాలను సడలిస్తున్న ఆలయాలను తెరిచేందుకు కేంద్రం అనుమతి నీయడంతో ఈ నెల 10వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారుు.
ఈ విషయాన్ని ఈ సాయంకాలం శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో సురేష్‌బాబు తెలిపారు.
దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడితో కలసి ఈవో సురేష్‌బాబు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రూ.300 టికెట్లు రద్దు చేశామని, తీర్థాలు, శఠగోపాలు ఉండవని వారు తెలిపారు. ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఇస్తామని సోమ, మంగళవారాల్లో దర్శనాల ట్రయల్ రన్ ఉంటుందని వారుపేర్కొన్నారు.
మహామండపం ద్వారానే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని కిందకు రావాలని సూచించారు. భక్తులు కరోనా సూచనలు పాటిస్తూ ఆలయ అధికారులు, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పదో తేదీనుంచి శ్రీశైలంలో దర్శనాలు
