ఈ గొప్పపాట ఒకసారి విని తరించండి…

“ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట” అని తిరుమలేశుని మీద వచ్చిన ఈ గీతం ఒకప్పుడు బాగా ప్రజారదరణ పొందింది.
ఈ గీతాన్ని ఏడిద కామేశ్వరరావు రాశారు. ప్రముఖ కర్ణాటక, లలిత సంగీత గాయని కుమారి శ్రీరంగం గోపాలరత్నం గానం చేశారు.
రాగం: మోహన (హిందూస్తానీ: భూపాలీ) తాళం: తిశ్రగతి (హిందూస్తానీ: దాద్రా)

గీతం ఇదే

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నా పలుకులో కులుకుతావట
ఆపదమొక్కులస్వామీ నీ సన్నిధె నా పెన్నిధి||
కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ
కొండచేరవచ్చితిని అండచేర్చి కాపాడరా||
అభయహస్తమున్నదట అభయమూర్తినీవెయట
అభయదానమిచ్చి నాకు భవతరణపధమ్ము చూపు||
వడ్డికాసువాడవట వడ్డీవడ్డీ గుంజుదువట
అసలులేనివారమయ్య వెతలుబాపికావవయ్య||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *