వివి ఇంకో పన్నెండు రోజులు నానావతి ఆస్పత్రిలోనే…

(ఎన్ వేణుగోపాల్)
ఇవాళ  విప్లక కవి వరవరరావు (వివి) గురించి గత రెండు వారాల ముంబయి నానావతి ఆస్పత్రి రిపోర్ట్ మహారాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ షిండే,  జస్టిస్ కార్నిక్  ల చేతికి వచ్చింది.
ఆ కాపీలు ప్రాసిక్యూషన్ కు, డిఫెన్సుకు ఇస్తున్నారు. ఆ కాపీ తమకు ఇంకా రాలేదని నేషనల్ ఇన్వెస్టిటేషన్ ఏజన్సీ (ఎన్ ఐ ఎ) స్టేట్ న్యాయవాదులు అన్నారు.
ఆ రిపోర్టు మీద వాదించడానికి తనకు  టైం కావాలని వరవరరావు తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ అడిగారు. జడ్జిలు సరేనన్నారు.
తర్వాత ప్రాసిక్యూషన్ ను కూడ అడిగి కేసును న్యాయమూర్తులు 15 డిసెంబర్ కు వాయిదా వేశారు.
మరి ఆరోజు దాకా వివిని డిశ్చార్జ్ చేసి జైలుకు కూడ పంపొద్దు అని ఇందిర కోర్టును అడిగారు. జడ్జిలు అంగీకారంగా తల ఊపడంతో ఎన్ ఐ ఎ , స్టేట్ అభ్యంతరం చెప్పలేకపోయాయాి.
అప్పుడు మళ్లీ ఇందిరయే ఫామిలీ విజిట్, కోర్టుకు చెప్పకుండా డిశ్చార్జి చేయకపోవడం వగైరా పాత షరతులన్నీ వర్తించాలి అన్నారు.
పాత ఆర్డరే వర్తిస్తుంది అని జడ్జిలు భరోసా ఇచ్చారు.
ఇంతకూ నానావతి రిపోర్టులో ఏముందో తెలియదు. వివి కి ఇంకో పన్నెండు రోజులు మెరుగైన చికిత్స దొరుకుతుందనేదే ఊరట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *