రాజధాని అమరావతిలోనే ఉంటుంది, ఉండాలి కూడా : వడ్డే శోభనాద్రీశ్వరరావు

 రాజధాని, పూర్తి హైకోర్టు కావాలని  రాయలసీమలో విద్యార్థులు, యువకులు ఆందోళన చేస్తున్న సమయంలలో కృష్ణా జిల్లాకు చెందిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి,రాష్ట్రానికి సీనియర్ రాజకీయ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు.
రాజధాని ప్రాంత రైతు – రైతుకూలీ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కూడా అయిన శోభనాద్రీశ్వరరావుక్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకున్నా, తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఆయన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భూసమీకరణ (Land pooling) విధానాలను వ్యతిరేకించారు.
రాజాధాని ప్రాంతంంలోగాని, బందరు రేవు,భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు జరపతలపెట్టిన భూసమీకరణను ఆయన వ్యతిరేకించారు.
అక్కడ దీనికి వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్నఉద్యమాలను బలపర్చారు. బందరు పోర్టుకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం 22 వేల ఎకరాలను సమీరించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన రైతులతో కలసిపోరాడుతూ ఓడరేవుకు 4800 ఎకరాలు చాలని వాదించారు..
ఆయన రాజధాని అమరావతి గురించి తన అభిప్రాయాలను ప్రకటించారు.
రాజధాని నిపుణుల కమిటీ అధ్యక్షుడు జీఎన్‌ రావుకు తమ అభిప్రాయాల నివేదికను సమర్పించిన అనంతరం ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
అమరావతి రాజధాని ఇపుడున్న చోట ఉంటుందా లేక మరొక చోటికి తరలిపోతుందా అని ఉత్కంఠ భరిత చర్చ రాష్ట్రంలో సాగుతూ ఉంది.
అదే విధంగా రాజధానిలో కొన్ని నిర్మాణపు పనులు ఆగిపోవడంతో అమరావతి భవిష్యత్తు మీద కూడా ఆసక్తికరమయిన చర్చ సాగుతూ ఉంది.
ఈ నేఫథ్యంలో ఆయన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ అమరావతి చర్చకు తన గొంతు కలిపారు.
రాజధాని అమరావతి ని తరలింపు అనే ప్రతిపాదనను ఆయనను వ్యతిరేకించారు.
రాజధాని మరొకచోట అనే ప్రశ్నకు తావులేదని ఆయన అన్నారు. ఇపుడు అమరావతి నిర్మాణం జరుగుతూఉందని, అలాంటపుడు మరొకచోటికి తరలించడం ఎలా సాధ్యం అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
1. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్లు, అమరావతి స్మార్ట్‌ సిటీకి ఇచ్చిన రూ.360 కోట్లు ఇప్పటికే ఖర్చయ్యాయి.
2. అమరావతిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి.
3. హైకోర్టు అమరావతిలో పనిచేస్తుండటంతో హైకోర్టు బెంచ్‌ కర్నూల్‌లో ఏర్పాటు చేయాలి
4. గాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అవసరం లేదు.
5. దొనకొండలోని అందుబాటులో ఉన్న దాదాపు 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించి పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
6. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విజయవాడ, విశాఖలో మెట్రో రైళ్ల ప్రతిపాదన విరమించుకోవాలి.
7. శాఖాధిపతుల కార్యాలయాలను 13 జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి, వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగేందుకు వీలవుతుంది . దీనికి చర్యలు తీసుకోవాలి.
8. రైతు భరోసా పథకం కౌలు రైతులకూ వర్తింపజేయాలి .
9. నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. వీటికి ప్రాముఖ్యం ఇవ్వాలి.