Home Breaking ఎట్టకేలకు కరోనాకు మందు : పరీక్ష పాసయింది, చికిత్సకు అనుమతి

ఎట్టకేలకు కరోనాకు మందు : పరీక్ష పాసయింది, చికిత్సకు అనుమతి

283
0
(Image credits: wikimedia commons)
కరోనాతో వార్తలతో , లాక్ డౌన్ ఇరుకు జీవితంతో సతమతమవుతున్న ప్రజలకు శుభవార్త. కరోనాకు మందోమాకో తొందరగా వస్తే బాగుంటుందని ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలకు అమెరికా ఈ శుభవార్త ప్రకటిచింది. మొట్టమొదటి సారి అధికారికంగా కరోనా జబ్బుకు ఒక మందు తయారయిందని, దానిని రోగుల మీద ప్రయోగించవచ్చని ప్రకటించింది.
దీనికి కారణం, అమెరికా ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో జరిగిన  ట్రయల్స్  లో ఈ మందు కోవిడ్ ను ఇతర పద్థతులకంటే చాలా ‘తొందరగా, సమర్థవంతంగా,స్ఫష్టం’గా నయంచేయడమే నని అమెరికా ప్రకటిచింది.
కొత్త ఔషధం మొదటి పరీక్ష పాసయిందని. మంచి మార్కులు పడ్డాయనే విషయాన్ని  అమెరికా ప్రభుత్వం, మందు తయారుచేసిన కంపెనీతో కలసి  ప్రకటించింది.

మరో రెండేళ్లు కరోనా మహమ్మారితో వేగాల్సిందే : CIDRAP శాస్త్రవేత్తలు

మందు తయారు చేసిన కంపెనీ పేరు గిలీడ్ సైన్సెస్ (Gilead Sciences). మందు పేరు రెమ్డెస్ విర్ (Remdesvir) (GS 5734). ఈ మందును రోగులకు ఇచ్చేందుకు అమెరికా ఎఫ్ డిఎ  అనుమతి కూడా ఇచ్చింది.తీవ్రమయిన కోవిడ్ -19తో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న పిల్లలకు, పెద్దలకే కాదు, కరోనాఅనుమానితులకు కూడా ఈ మందు వాడవచ్చని అమెరికా ఫెడరల్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ట్వీట్ చేసింది.

 

ఒక మందు బయటకు రావాలంటే పాస్ కావలసిన మొదటి టెస్ట్ చాలా జటిలమయింది. రోగుల మీద జరిపే మొదటి పరీక్షలో ఈ మందు మంచి ఫలితాలిచ్చిందని అమెరికా ప్రకటించింది.కోవిడ్ -19 జబ్బు నయమయే టైం ను ఈ కొత్త మందు నాలుగు రోజులు తగ్గించింది. సాధారణంగా ఇపుడు అందు బాటులో ఉన్న మందులతో  ఈ జబ్బు నయమయేందుకు 15 రోజుల దాకా పడుతూ ఉంది. ఈ కొత్త మందులో రోగులు 11 రోజుల్లోనే కోలుకోవడం కనిపించింది.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు

అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ఈ మందును ప్రపంచ వ్యాపితంగా కరోనా జబ్బుతో ఆసుపత్రులలో చేరిన 1063 మంది మీద ప్రయోగించింది. వీరందరిలో రోగం  33 శాతం తొందరగా నయమయిందని అమెరికా అధ్యక్షభవనం (వైట్ హౌస్ )లో ఎన్ ఐ హెచ్ అధ్వర్యంలో ని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలెర్జీ అండ్ ఇన్ ఫెక్సియస్ డిసీజెస్ (NIAID) డైరెక్టర్ డా. అంధోని ఫాసీ ప్రకటించారు. రోగమయ్యే సమయాన్ని 15 రోజుల నుంచి 11 రోజులకు ఈ కొత్త మందు తగ్గించిందని ఆయన చెప్పారు. కరోనా వల్ల మృతుల సంఖ్యను రెమ్డెసివివైర్ బాగా తగ్గించిందని , తమ పరీక్షల పూర్తి వివరాలు ఒక మెడికల్ జర్నల్ లో ప్రచురించబోతున్నామని ఆయన ప్రకటించారు.
ఈ విలేకరుల సమావేశానికి కంపెనీ సిఇవొ డేనియల్ ఒడే కూడా హాజరయ్యారు. కోవిడ్ -19కు అమెరికా అధికారికంగా ఆమోదించిన చికిత్స రెమ్డెసివైర్ ఒక్కటే.
‘‘ ఈ మందు కరోనా వైరస్ ను నిరోధిస్తుందనే విషయం తమ పరీక్షల్లో రుజువయింది,’ అని ఫాసి చెప్పారు.
‘ మేం సేకరించిన డేటా ప్రకారం జబ్బ నయమయ్యే కాలాన్ని తగ్గించడంలో రెమ్డెసివిర్ బాగా, స్పష్టంగా పనిచేసింది. ఇదే ఒక జబ్బు చికిత్సకు ప్రమాణం’ అని ఆయన అన్నారు.
రెమ్డెసివిర్ ను  సాధ్యమయింత తొందరగా రోగులకుఅందుబాటులోకి తెచ్చేందుకు గిలీడ్ (కాలిఫోర్నియా) కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్  ఒక ప్రకటన విడుదల చేసింది.
తమ ట్రయల్స్ లో కరోనా జబ్బు తొలిదశలో రెమ్డెసివిర్ ను ఇస్తే 62 శాతం రోగుల్లో పూర్తిగా నయమయిందని, రోగం కొద్దిగా ముదిరాక ఇస్తే 49 శాతం మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని డిలీడ్ సైన్సెస్ ప్రకటించింది.
శరీరంలో నావెల్ కరోనావైరస్ సంతతి పెరగకుండా నివారించేందుకు ఈ మందును ఎక్కుపెట్టారు. ఇందులో విజయవంతమయినట్లే నని అంటున్నారు. అయితే, ఇదే కంపెనీ గతంలో ఇబోలా వైరస్ కు మందు కనిపెట్టేందుకు ప్రయత్నించి విఫలమయింది. ఇపుడు విజయవంతమయింది. ఇంతవరకు ఏ ఒక్క మందుకుగాని, వ్యాక్సిన్ కు గాని జనం మీద వాడేందుకు  అనుమతి పొంద లేకపోవడంతో రెమ్డెసివిర్ మీద ప్రపంచమంతా ఆశలు పెరిగాయి.
కరోనా ముదిరితేచాలా ప్రమాదం . ఇది వూపిరి తిత్తుల మీద దాడి చేస్తుంది. మరీ ముదిరితే ఇతర శరీరావయవాలను కూడా పాడుచేస్తుంది.అందుకే కరోనాను కీలకావయవాల మీద దాడిచేయకుండా అడ్డుకునే మందుకోసం వైద్యులంతా ఆత్రంగా ఎదరుచూస్తున్నారు. ఇలాంటపుడు రెమ్డెసివిర్ వార్త వెలువడింది.
వ్యాక్సిన్ కొనుగొనే పరుగులో చైనా ముందంజ
కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు కూడా ప్రపంచంలోని ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా విడుదల చేసిన డాక్యమెంట్ ప్రకారం 70 కంపెనీలు వ్యాక్సీన్ తయారీలో ఉన్నాయి. ఇందులో కూడా చైనాకు చెందిన క్యాన్ సినో బయోలాజికల్ (CanSino Biological) అనేక సంస్థ బీజింగ్ ఇన్ స్టిట్యూట్ ఆప్ బయోటెక్నాలజీతో  వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉంది.  70 సంస్థల్లో రెండో ఫేజ్ ట్రయల్స్ దాకా వచ్చిన ఈ సంస్థ వ్యాక్సన్ తయారీ పరుగులో అందరికంటే ముందుంది. మొత్తంగా మూడు సంస్థలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దాకా వెళ్లాయి. ఇందులో ఒకటి చైనా సంస్థ కాగా మిగతారెండు అమెరికా కు చెందిన మాడెర్నా (Moderna), ఇనోవియో ఫార్మష్యూటికల్స్ (Inovio Pharmaceuticals)కంపెనీలు. ఈ వ్యాక్సిన్లు పరీక్షలన్నీ పూర్తి చేసుకుని ప్రజలకు ఉపయోగపడే దాకా రావాలంటే 12 నుంచి 18 నెలలుదాకా పడుతుంది.

FDA Press Release

Today, the U.S. Food and Drug Administration issued an emergency use authorization for the investigational antiviral drug remdesivir for the treatment of suspected or laboratory-confirmed COVID-19 in adults and children hospitalized with severe disease. While there is limited information known about the safety and effectiveness of using remdesivir to treat people in the hospital with COVID-19, the investigational drug was shown in a clinical trial to shorten the time to recovery in some patients.

“FDA’s emergency authorization of remdesivir, two days after the National Institutes of Health’s clinical trial showed promising results, is a significant step forward in battling COVID-19 and another example of the Trump Administration moving as quickly as possible to use science to save lives,” said HHS Secretary Alex Azar. “NIH, FDA, and scientists across America and around the world have worked tirelessly with patients to get us this new potential treatment for COVID-19. The seamless cooperation between government and private industry under the President’s all-of-America approach to COVID-19 is getting treatment options to patients in record time.”

The emergency use authorization allows for remdesivir to be distributed in the U.S. and administered intravenously by health care providers, as appropriate, to treat suspected or laboratory-confirmed COVID-19 in adults and children hospitalized with severe disease. Severe disease is defined as patients with low blood oxygen levels or needing oxygen therapy or more intensive breathing support such as a mechanical ventilator.

“From day one, the FDA has been committed to expediting the development and availability of potential COVID-19 treatments. Today’s action is an important step in our efforts to collaborate with innovators and researchers to provide sick patients timely access to new therapies where appropriate, while at the same time supporting research to further evaluate whether they are safe and effective,” said FDA Commissioner Stephen M. Hahn, M.D. “There’s tremendous interest among all parties to identify and arm ourselves with medicines to combat COVID-19, and through our Coronavirus Treatment Acceleration Program, the FDA is working around-the-clock and using every tool at our disposal to speed these efforts.”

Based on evaluation of the emergency use authorization criteria and the scientific evidence available, it was determined that it is reasonable to believe that remdesivir may be effective in treating COVID-19, and that, given there are no adequate, approved, or available alternative treatments, the known and potential benefits to treat this serious or life-threatening virus currently outweigh the known and potential risks of the drug’s use.

The EUA also requires that fact sheets that provide important information about using remdesivir in treating COVID-19 be made available to health care providers and patients, including dosing instructions, potential side effects and drug interactions. Possible side effects of remdesivir include: increased levels of liver enzymes, which may be a sign of inflammation or damage to cells in the liver; and infusion-related reactions, which may include low blood pressure, nausea, vomiting, sweating, and shivering.

Following the declaration by the Secretary of HHS that circumstances exist justifying the emergency use of unapproved products, the FDA may issue an emergency use authorization to allow unapproved medical products or unapproved uses of approved medical products to be used in an emergency to diagnose, treat, or prevent serious or life-threatening diseases or conditions caused by chemical, biological, radiological and nuclear threats when there are no adequate, approved, and available alternatives.

The issuance of an EUA is different than FDA approval. In determining whether to issue an EUA, the FDA evaluates the available evidence and carefully balances any known or potential risks of any unproven products with any known or potential benefits of making them available during the emergency.

The EUA was issued to Gilead Sciences Inc. The FDA previously allowed for study of the investigational drug under clinical trials, as well as expanded access use for individual patients and through a multi-patient expanded access program coordinated by Gilead.

The EUA will be effective until the declaration that circumstances exist justifying the authorization of the emergency use of drugs and biologics for prevention and treatment of COVID-19 is terminated and may be revised or revoked if it is determined the EUA no longer meets the statutory criteria for issuance.

The FDA, an agency within the U.S. Department of Health and Human Services, protects the public health by assuring the safety, effectiveness, and security of human and veterinary drugs, vaccines and other biological products for human use, and medical devices. The agency also is responsible for the safety and security of our nation’s food supply, cosmetics, dietary supplements, products that give off electronic radiation, and for regulating tobacco products.

 

ఇది కూడా చదవండి

తొలివయసు రొమాంటిక్ ఙ్ఞాపకంగా మిగిలిపోయిన రిషికపూర్