ఫ్లాటో, ప్లాటో కొంటున్నారా, హైదరాబాద్ ఉప్పల్ వైపు చూడండిక

హైదరాబాద్ మహానగరంలో అతికీలకమయిన ప్రదేశమయినా ఎవరూ వచ్చేందుకు, నివసించేందుకు, ప్రాపర్టీ కొనేందుకు పెద్దగా ఇష్టపడని ప్రాంతాలేవమయినా ఉంటే అందులో ఉప్పల్ ఉంటుంది.

దీనికి కారణం ఉప్పల్ యే. బాగా ఇరుకు రోడ్లు, తాలూకా స్థాయి మించని ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్,  ఎపుడూ ట్రాఫిక్ జామ్ లతో  వరంగల్, భువనగిరి, యాదాద్రి వెళ్లేందుకు అడ్డుగోడలాగా ఉప్పల్ ఉండింది.

హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలలో ఉండే మెట్రో సిటీ హంగులు ఇక్కడ కనిపించకపోవడానికి కారణం కూడా ఇదే. అందుకే ఉప్పల్  అనే మాట చెవులకు ఇంపుగా వినిపించదు, ఈ ప్రాంతం కంటికి పెద్దగా ఆకర్షణీయంగా కనిపించదు.

ప్రభుత్వాలు కూడా ఉప్పల్ ప్రాముఖ్యం పెంచేందుకు చాలా కాలం శ్రద్ధ చూపలేదు. లేకుంటే ఈ పాటికి ఉప్పల్ కూడా ఒక ఎల్ బినగర్, ఒక కూకట్ పల్లి, మియాపూర్, మెహిదీపట్నం లాగా కళకళలాడుతూ ఉండేది.

అయితే, ఇపుడు ఉప్పల్ పరిస్థితి మారుతూ ఉంది. ఉప్పల్ దశ తిరుగూ ఉంది. ‘తూర్పు హైదరాబాద్ అభివృద్ధికి నేను ఇక అడ్డుకాదు’ ని ఉప్పల్ తప్పుకుంటూ ఉంది.

తొందర్లోనే నేషనల్ హైవే 163 మీది ఉప్పల్ ప్రాంతం  కూడా  హైదరాబాద్ లో ఒక  హాట్ ప్రాపర్టీ జోన్ గా  మారుతూ ఉంది. ఇప్పటి దాకా ఇక్కడ ప్రాపర్టీ ధరలకు రెక్కలు రాలేదు. ఒక రెండు మూడేళ్లలో ఇక్కడి ప్రాపర్టీ  ధరలు, అద్దెలు ఆకాశాన్నంటబోతున్నాయి. ఇది స్పెక్యులేటివ్ వార్త కాదు. మెటిరియల్ ఫ్యాక్ట్.

ఎందుకంటే, ఇక్కడ ఇపుడు నిర్మాణమవుతున్న ఉప్పల్ ఎలివేటెడ్ కార్రిడార్ (Uppal Elevated Corridor) ప్రాజక్టే దీనికి కారణం.

ఈ ప్రాజక్టు పూర్తి కావడమే ఆలస్యం,  ఉప్పల్ హైదరాబాద్ లేటెస్ట్  ప్రత్యేకాకర్షణ అవుతుంది. కేవలం ఉప్పల్  ఇరుకు రోడ్ల కారణంగా  హైదరాబాద్ వరంగల్ హైవే ప్రాముఖ్యమూ పెరగలేదు. ఇక్కడి ఇరుకు రహదారితో స్థానికులొకవైపు, హైవే జర్నీచేస్తున్న వారు మరొక వైపు నరకం అనుభవిస్తూ వచ్చారు.

ఈ దారిలో ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసన సభ్యులు, ఎంపిలు ఎన్ని సార్లో తిరిగినా, ఈ ప్రాంతాన్ని ఈ సమస్యలనుంచి విముక్తి చేద్దామని అనుకోనే లేదు.

వరంగల్ తెలంగాణలో రెండో పెద్ద పట్టణమయినా, హైదరాబాద్ నుంచి  రోజు వేలాది మంది వరంగల్ నగరానికి రాకపోకలు చేస్తున్నా ఈ హైవే ప్రాంతం  ఆకర్షణీయంగా మారకపోవడానికి కారణం కేవలం ఉప్పల్ రోడ్డు మాత్రమే.

ఈ రోడ్డు పేరు చెబితే జనం భయపడే వారు. ఇపుడా పరిస్థితి మారిపోతున్నది.

హైదరాబాద్ రెండో పెద్ద ఎలివేటెడ్ కార్రిడార్ ఇపుడు ఇక్కడ నిర్మాణమవుతూ ఉంది. దీని పొడవు 6.2 కి.మీ. మీకు తెలుసుగా, మొదటి పెద్ద కార్రిడార్ 11.6 కిమీ పొడవైన పివిఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే.

ఉప్పల్ ఎలివేటెడ్ కార్రిడార్  ఉప్పల్ క్రాస్ రోడ్డ దగ్గిర మొదలవుతుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ రావడంతో ఇప్పటికే ఉప్ప జంక్షన్ రూపు రేఖలు మారిపోయాయి. ఈ సర్కిల్ పెద్ద బస్ జంక్షన్ కూడా అయిపోయింది. ఇపుడు ఉప్పల్ జంక్షన్ 24 గంటలు కిటకిటలాడుతూ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ చుట్టు మంచి మంచి హోటళ్లు వచ్చాయి. చీకటి పడితే ఒకపుడు ఈ కాలనీల వైపు రావాలంటే భయపడేవారు. రాజ్య లక్ష్మి దియేటర్ సెకండ్ షో కు వచ్చేందుకు సాహసించే వాళ్లు బాగా తక్కువ. మెట్రో స్టేషన్ ఈ ప్రాంతం ఒక ముఖ్యమయిన కేంద్రంగా మారింది.

ఈ నేపథ్యంలో ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ హైవే మేడిపల్లె సెంట్రల్ పవర్ రీసెర్చ్ సెంటర్ (CPRI) దాకా ఈ ఎలివేటెడ్ కార్రిడార్ ఉంటుంది. దీనిని నేషనల్ హైవేస్ సంస్థ రు. 675కోట్ల తో నిర్మిస్తూ ఉంది. ఇది అరు లేన్ల రోడ్డున్న ఎలివేటెడ్ కార్రిడార్. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తి కాగానే ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగ పెరుగబోతున్నది. యాదాద్రికి వెళ్లేవారు, వరంగల్ వెళ్లే వారు ఇక ఉప్పల్ రోడ్డు తలుచుకుని దిగులుపడాల్సిన పనిలేదు. ఉప్పల్ జంక్షన్ నుంచి 6.2 కి మీ దూరం గాలిలో తేలిపోతు, ఏడెనిమిది నిమిషాల్లో దూసుకుపోవచ్చు.

ఈ కారిడార్ పూర్తయితే, ఈ ప్రాంతంలోని కాలనీల వాళ్లు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రయాణాలు పెట్టుకోవచ్చు.  ఇంతవరకు ఉప్పల్ కు వచ్చేందుకు ఆటోలు, క్యాబ్ లు వెనకాడేవి. ఉపల్ ట్రాపిక్ లో ఇరుక్కుపోతే, బయటపడేందుకు కనీసం అరగంట పట్టేది.

ఈ ప్రాంతం నివాసాల పరంగా, వాణిజ్య పరంగా ఆశించినంతగా అభివృద్ధి చెందకుండా పోయేందుకు ఈ ట్రాఫిక్ జామ్ శాపంగా ఉండింది. అందుకే ఈ ప్రాంతంలో పెద్ద హోటెళ్లు, పాఠశాలు, ఆసుపత్రులు రాలేదు.

ఎలివెటేడ్ కార్రిడార్ తో  ఇపుడు శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం కాబోతున్నది. ప్లైవోవర్ కి  అటూ ఇటూ 150 అడుగుల  టూ లేన్ సర్వీస్ రోడ్డు తయారవుతుంది. అపుడు ఉప్పల్ లోని కాలనీలలోకి వెళ్లేందుకు కూడా సమస్య ఉండదు.  ఈ రోడ్లను దాటేందుకు పాదచారులకు ఎలాంటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వీస్ రోడ్లు  వన్ వేలుగా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉప్పల్ ఎలివేటెడ్ కార్రిడార్ లో 4.5 కిమీ పొడీతా పనులు జోరుగా సాగుతున్నాయి. మిగతా భాగానికి భూసేకరణపనులు సాగుతున్నాయి. ఈ  కార్రిడార్ లో 148 పిల్లర్లుంటాయి. 120 పిలర్లు నిర్మాణం పూర్తవుతున్నాయి. 2022 ఈ ప్రాజక్టు పూర్తవుతుంది. పివిఎన్ ఎర్ ఎక్స్ ప్రెస్ వే లాగా కాకుండా ఉప్పల్ ఎలివేటెడ్ కార్రిడార్ మీద టూవీలర్స్ ని కూడా అనుమితిస్తారు.

ఈ కార్రిడార్ పూర్తఅయితే, యాదాద్రి భువన గిరి రోడ్డు పొడవునా భూముల ధరలు విపరీతంగాపెరుగుతాయి. ఇపుడు ధరలు బాగా అందుబాటులో ఉన్నాయి.  2022 తర్వాత ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రీజినల్ బూమ్ రాబోతున్నది. దీని ప్రభావం  భువనగిరి దాకా ఉంటుంది. ఇపుడు ఘటకేసర్ పరిసర గ్రామాలలో ముఖ్యంగా ఏదులాబాద్ వైపు  చదరపు అడుగు ఆరువేల నుంచి 10 వేల దాకా ఉంది. ఇది డబుల్ లేటా ట్రిపుల్  అయ్యే అవకాశం ఉంది.

భువనగిరి జిల్లా కేంద్రం, యాదాద్రి ఆలయం,  నిమ్స్, వరంగల్ అభివృద్ధి అన్నీ ఈ కార్రిడార్ తో కళకళలాడతాయి. రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ కార్రిడార్ తో ఉప్పల్ హైదరాబాద్ కే స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *