అయోధ్య రాముడికి 151 నదీజలాలతో మొక్కు తీర్చుకున్న సోదరులు

రాధేశ్యాం పాండే, శబ్ద్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల ఇద్దరు సోదరులు,ఉత్తర ప్రదేశ్ జౌన్ పూర్ జిల్లా కు చెందినవార. ఇద్దరిపుడు 70యేళ్లు పైబడ్డవారే. వారికొక మొక్కుబడి ఉంది. అది పుడు నెరవేరుతున్నది. అయోధ్యలో రామాయాలయం చూడాలన్నది వారికోరిక.
ఆయోధ్యలో రామాలయం తమ జీవిత కాలంలో కడితే దానికి  151 నదుల పవిత్ర జలాలను సమర్పించాలనేదివారి మొక్కు. ఆగస్టు 5 తేదీన  అయోధ్యలో జరుగుతున్న భూమి పూజకుల ఈ జలాలతో పాటు వారుసేకరించిన మట్టిని సమర్పించాలనుకుంటున్నారు. పవిత్రనదీజలాల సేకరణ ఎపుడుమొదలయిందోతెలుసా, 1968లో.  151 నదులతో పాటుపాటు మూడు సముద్రాలనుంచి, రామచంద్రుడి జీవితంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న  శ్రీలంకకు చెందినఎనిమిది నదులనుంచి కూడా వారు జలాలను సేకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది..
‘రామాలయ నిర్మాణాన్ని ఎపుడు చేపట్టినా భారతదేశంతో పాటు శ్రీలంకలోని నదులనుంచి నీటిని సేకరించ నిర్మాణానికి అందిచాలన్నది మా కల. శ్రీరాముడి దయతో మా లక్ష్యం నెరవేరింది. మొత్తం 151 నదులనుంచి పవిత్రజాలాలనుసేకరించాం. ఇందులో 8 పెద్ద నదులున్నాయి. మూడు సముద్రాలున్నాయి. శ్రీలంకలోని 16 ప్రదేశాల నుంచి మట్టిన కూడా సేకరించాం,’ అని రాధేశ్యాం పాండే చెప్పారు.
ఈప్రదేశాలన్నింటికి చాలా కష్టపడి వాళ్లు ప్రయాణించారు.కొన్నిచోట్ల కాలినడక వెళ్లితే, మిగతో చోట్లకు బస్సులో రైళ్లలో ప్రయాణించారు. శ్రీలంకకు విమానంలో ప్రయాణించారు.