చంద్రబాబు బాటలో ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్రలో సిబిఐ మీద నిషేధం

నాటి చంద్రబాబు బాటలో నేటి శివసేన  ప్రభుత్వం…

అది 2018 నవంబర్..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి  కేంద్రంలోని  మోదీ ప్రభుత్వానికి  వైరం పెరిగింది.
పచ్చగడ్డివేసిన భగ్గున మండుతున్నరోజులవి. నవంబర్ 17 వ తేదీన చంద్ర బాబు నాయుడి ప్రభుత్వం ఒక సంచలననిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లోకి సిబిఐ కాలుమోపకుండా నిషేధిస్తూ ఉత్తర్వు జారీ  చేసింది.
అంటే సిబిఐ విచారణలు కొనసాగించేందుకు ఉన్న జనరల్ కన్సెంట్ (General Consent) ను తెలుగుదేశం ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. సిబిఐ అనేది కేంద్ర సంస్థ. రాష్ట్రాల సరిహద్దుల లోపు జరిగే నేరాలను విచారించాలంటే కేంద్ర సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినీయాలి. 1945, ఢిల్లీ   స్పెషల్ పోలీస్ ఎస్టబ్లిష్ మెంటు యాక్ట్ కింద రాష్ట్రాలు సిబిఐ  దర్యాప్తుకు అనుమతినీయాల్సి ఉంటుంది. దీనిని జనరల్ కన్సెంట్ అంటారు.
అంతకు ముందు మమతా బెనర్జీ నాయకత్వలోని తృణ మూల్ ప్రభుత్వం కూడా సిబిఐ కి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది.
సిబిఐఅనే కేంద్రంచేతిలో కీలు బొమ్మగా మారందని, బ్లాక్ మెయిల్ సాధనంగా పతనమయిందని అందువల్ల సిబిఐ దర్యాప్తులను అనుమతించేది లేదని అపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. ఆరోజుల్లో తెలుగుదేశంనాయకుల మీద, ఈ పార్టీ తో సంబంధాలున్న వారి మీద సిబిఐదాడులు జరపడం మొదలుపెట్టింది.ఈనేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది.
2019లో  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   సిబిఐకి జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించారు.
ఇపుడు మహారాష్ట్రలోని శివసేసన  సంకీర్ణ ప్రభుత్వం కూడా సిబిఐ కి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో సిబిఐ జోక్యం చేసుకుంటున్నందున ఈ చర్య తీసుకున్నట్లు   ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రభుత్వ ప్రకటించింది.
“ In exercise of the powers conferred by Section 6 of the Delhi Special Police Establishment Act, 1946, the Government of Maharashtra hereby withdraws the consent accorded to the members of the Delhi Special Police Establishmeng… to exercise powers and jurisdiction under the said Act,”   అని ప్రభుత్వం  జివొ లో పేర్కొంది.