జూన్ 8 నుంచి టిటిడి ఉద్యోగులతో శ్రీవారి దర్శనాలు ప్రారంభం

జూన్ 8వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా భక్తుల దర్శనం ప్రారంభమవుతున్నది. భక్తులనుంచి రోజుకు 200 మందికి ర్యాండం గా కరోనా టెస్టులు చేస్తారు.
జూన్ 8,9 వ తేదీల్లో గుర్తింపు కార్డు కలిగిన ఉద్యోగులను  దర్శనానికి అనుమతిస్తారు. జూన్ 10వ తేదీ స్థానికులను అనుమతిస్తారు, 11వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులను అనుమతిస్తారు. దర్శన పున:ప్రారంభ విధివిధానాలపై టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాలను వెల్లడించారు.
రోజుకు 7వేల మంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉంది. 3వేల టిక్కెట్లను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతాం, ఆఫ్ లైన్ లో టికెట్లను అలిపిరి వద్ద టిక్కెట్లు జారీ చేస్తారని ఆయన చెప్పారు. దర్శనాల సమయంలో సోషియల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని, 65 ఏళ్ళ వృద్దులు,10 ఏళ్ళ లోపు చిన్నపిల్లలను అనుమతించడం లేదని , కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
కళ్యాణ కట్ట, హుండీ, ప్రసాదాలు వద్ద కూడా కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
ఆన్లైన్ లో టిక్కెట్లు పొందిన భక్తులకు అలిపిరి, క్యూ లైన్, నడక దారిలో థర్మల్ స్క్రీనింగ్, డిస్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు ఆన్లైన్ లోనే రూములు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఒక రూముకి ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తాం, ఒకరోజ సరిసంఖ్య, మరొక రోజు బేసి సంఖ్య రూములను కేటాయిస్తారు. భక్తులకు ఒక్కరోజు మాత్రమే గదులు ఇవ్వడం జరుగుతుంది . కోవిడ్ ప్రొటోకోల్ ప్రకారం
పుష్కరిణి స్నానం నిషేధం ఉంటుంది. కళ్యాణ కట్టలో పనిచేసే ఉద్యోగులకు పిపిఈ కిట్లు ఇస్తారు.
క్యూ లైన్ లో పీపీఈ కిట్లతో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకొని భక్తులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ‘రెండు క్యూలైన్ లు అందుబాటులో ఉంచాం, ప్రతి రెండు గంటలకు ఒకసారి క్యూలైన్ శుద్ధి చేస్తాం .వకుళా మాత, నరసింహ స్వామి ఆలయంలోకి భక్తుల ప్రవేశానికి తాత్కాలికంగా నిషేధం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల తరువాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తాం,’ సుబ్బారెడ్డి చెప్పారు.
అన్నప్రసాదం భోజన శాలలో సోసియల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలుంటాయని, ప్రతి రెండు గంటలకు ఒక సారి అన్నప్రసాదం వితరణ కేంద్రం డిస్ ఇన్ఫెక్షన్ చేస్తామని ఆయన చెప్పారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్, వసతి గృహాల వద్ద అన్నప్రసాదం.వితరణ తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి టిక్కెట్లు పొందినా భక్తులు ఆ రాష్ట్రంలో అనుమతి వాళ్లే తీసుకోవాలని టిటిడి ఇవొ అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు. వారు ఒక్కరోజు ముందుగానే టోకెన్లు పొందాల్సి ఉంటుంది, ఎస్ఎస్డీ టైమ్స్ స్లాట్ కౌంటర్లో టికెట్స్ పొందాల్సి ఉంటుంది. 10వ తేదీ నుంచి టిక్కెట్లు జారీ చేస్తాం., పరిస్థితి బట్టి టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామమని ప్రోటోకాల్ విఐపి సెల్ఫ్ మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి.