శ్రీవారి నిధుల దారి మళ్లింపు విమర్శలకు టిటిడి వివరణ

రెండురోజులుగా తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులలతో కలకలం మొదలయింది. బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న స్వామి  వారి నిధులను బయటకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం బాండ్లను కొనాలని టిటిడియోచిస్తున్నది. అంటే, నగదుపంపిణీ జోరుగా చేసి కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు టిటిడి నిధులను వాడుకోవాలనుకుంటున్నారు. ఈ  విషయం బయటకు పొక్కగానే  విమర్శులు మొదలయ్యాయి. కొందరు కోర్టుకెళ్లారు. మరికొందరు వెళ్లాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిధుల మళ్లింపు మీద టిటిడి వివరణ జారీ చేసింది. ఇదే వివరణ:
ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను టిటిడి ధర్మకర్తల మండలి లోతుగా అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలని ఒక అంశాన్ని ఐచ్ఛికంగా మాత్రమే పరిగణలోకి తీసుకుంది.
అంతేగానీ, ఇందులో ఎలాంటి రహస్య అజెండా లేదు. టిటిడి బోర్డు ఎంతో పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బోర్డు తీర్మానాన్ని టిటిడి వెబ్ సైట్ లోనూ అప్ లోడ్ చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అంశం కొత్తగా తీసుకున్నది కాదు. ఇదివ‌ర‌కే ‌ 1987 దేవాదాయ శాఖ చట్టం 30లోని సెక్షన్111(3), జి.ఓ 311, తేది: 09-04-1990 లోని టిటిడి నిబంధన 80 ప్రకారం ప్రభుత్వ ఆమోదం పొందిన మార్గదర్శకాల మేరకు సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల‌ సెక్యూరిటీల్లో టిటిడి పెట్టుబడులు పెట్టలేదన్న విషయాన్ని స్పష్టం చేయడమైనది. అయితే వడ్డీ రేట్లు త‌గ్గుతున్నత‌రుణంలో టిటిడి బొర్డు ఈ సెక్యూరిటీల్లో పెట్టుబడుల‌పై అధ్య‌యనం చేసింది. ప్ర‌స్తుతం ఈ ఐచ్ఛికాన్ని ప‌రిగ‌ణించ వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రెట్లు పెరిగే అవ‌కాశం ఉన్నందున ఇక‌పై బ్యాంకుల‌లోనే ఫిక్స్‌డ్‌ ‌‌డిపాజిట్లు చేయడాన్ని టిటిడికొనసాగిస్తుంది
(TTD press release)