ఆర్టీసి సమ్మె విరమించిన జెఎసి

52రోజులు సుదీర్ఘ పోరాటం చేసిన ఆర్టీసి కార్మికులు సమ్మెను విరమించారు.
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామ రెడ్డి ఈ  విషయం ప్రకటించారు.
నిర్భందాలు చేసినా సమ్మెలో భాగంగా చేసిన పోరాటాలను విజయవంతం చేసారని,ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి సంస్థ ను నిర్వీర్యం చేసిందని ఆయన అన్నారు.
సమ్మెను విరమించినా  నైతిక విజయం మనదే.. కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు అని ఆయన అన్నారు.
 కొంతమంది అధికారులు ఆర్టీసీ ఆస్థులను నిర్వీర్యం చేసారని, ఆర్టీసీ ని అమ్ముకునే ప్రయత్నం చేసారని ఆయన ఆరోపించారు. అయితే, దశలవారి పోరాటం కొనసాగుతోందని అన్నారు.డిపోలకు వెళ్ళి విధులకు హాజరవ్వాలని,రేపు కార్మికులు విధులకు హాజరయ్యేల సహకరించాలని అంటూ రేపు ఉదయం 6గంటలకు డిపోల వద్దకు చేరి విధులకు హాజరు కావాలని ఆయన పిలుపు నిచ్చారు.తాత్కాలిక కార్మికులు ఎవరూ దయచేసి డిపోల వద్దకు రాకండని కూడా ఆయన చెప్పారు.
విధులకు తీసుకోక పోతే ఉదృతంగా పోరాటం కొనసాగిస్తామని కూడా ఆయన హెచ్చరించారు.అమరవీరుల కుటుంబాలను జేఏసీ అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తుందని,మా పోరాటం కొనసాగుతోంది.. సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని జేఏసీ నేత అన్నారు.