ఇక తెలంగాణ ఉద్యమ పంథాలో ఆర్టీసి ఆందోళన

ఆర్టీసీ ఉనికిని కాపాడుకునేందుకు  జేఏసీ తమ ఆందోళనని  తెలంగాణ పోరాట పంథాలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

నిన్నటి బంద్ విజయవంతంకావడంతో ఆర్టీసి సిబ్బందిలోనే కాదు, సమ్మెకు మద్దతునిస్తున్న జనంలో కూడా సమ్మె కొనసాగాలనే సమరోత్సాహం పెరిగింది.

సమ్మె చాలా క్రమశిక్షణతో సాగిన తీరు తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్నది.

అందుకే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుు తెలంగాణ ఉద్యమాన్ని పోలిన దీర్ఘ కాలిక పంథాలోకి ఆర్టీసికార్మికులు వస్తున్నారు.

దీనితోపాటు ఇతర రంగాల వారిని, ప్రజలను, ఆర్టీ సిఅధికారులను , తమ కుటుంబాలను, కూడా ఆందోళనలోకి  దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ తీరులో ఆమ ఆందోళన ఉధృతం , విస్తృతం చేయాలని ఆర్టీసి జెెఎసి నిర్ణయించింది.

ఈ రోజు కార్యాచరణ పథకం ప్రకటించింది.

ఆదివారం నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆర్టీసి జెఎసి ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనను ముందుకు తీసుకుపోవడం గురించి చర్చించారు.

అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆందోళన ప్రణాళిక ప్రకటించారు.

పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తమ మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఉద్యమకారులను ప్రభుత్వం భయపెట్టాలని, బెదిరించాలని చూస్తే తీవ్రత అంతకు రెట్టింపు అవుతుందన్నారు.

తమ సమస్యపై గవర్నర్ తిమిళసై ను కలుస్తామని చెబుతూ ఆర్టీసీ అధికారులు కూడా సమ్మెలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఇది:

RTC సమ్మెపై JAC కీలక నిర్ణయం..

ఈనెల 30న 5 లక్షల మందితో సకల జనుల సమర భేరి

21న డిపోల ముందు కార్మికుల కుంటుంబ సభ్యుల తో దీక్షలు

22న మా పొట్టకొట్టొదని తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లుకు విజ్ఞప్తులు

23న TRS పార్టీ MP, MLA ఇతర ప్రజా ప్రతినిధులను కలిసి సమ్మెలో భాగస్వాములు కావలని విజ్ఞప్తులు

24న మహిళా కండక్టర్లు దీక్షలు

25న హైవేలు, ఇతర రహదారులు దిగ్బంధించడం

26న RTC కార్మికుల పిల్లలతో దీక్షలు

27న దీపావళి పండుగ రోజున జీతాలు లేకపోవడం వల్ల నిరసనలు

28న హైకోర్టులో సమ్మెపై విచారణ

30న భారీ సమీకరణతో బహిరంగ సభ