Home Breaking అమెరికాలో ట్రంప్ తిప్పలు, ప్రెసిడెంట్ మాట లెక్కచేయని డిఫెన్స్ అధికారులు

అమెరికాలో ట్రంప్ తిప్పలు, ప్రెసిడెంట్ మాట లెక్కచేయని డిఫెన్స్ అధికారులు

228
0
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురయిన ప్రతికూల  పరిస్థితులు గతంలో ఏ అధ్యక్షుడికి వచ్చి ఉండవు. ఆయన విధానాలకు ఎదురవుతున్నంత వ్యతిరేకత బహుశా ఎపుడూ ఏ అధ్యక్షుడికి ఎదురయి ఉండకపోవచ్చు.ఇలాగే ఆయనకు తగిలినన్ని ఎదురుదెబ్బలు కూడా ఎవరికీ తగిలి ఉండవు.  వియత్నాం యుద్ధంలో అమెరికా వోడిపోయి ఉండవచ్చు. అయితే, అవన్నీ భారీ అంతర్జాతీయ నిర్ణయాలు. కాని ట్రంపుకు ఎదురవుతున్నవన్నీ చాలా చిన్న చిన్ని విషయాల్లో తలదూర్చి, ఎవరినీ లెక్క చేయకుండా తెచ్చుకుంటున్న తిప్పలే.వూహించనంత స్థాయిలో బిలియనీర్ ప్రెసిడెంట్ ట్రంప్ మహాశయుడు దేశంలో ఇలా అన్ని సమస్యలో ఇరుక్కు పోయాడు.అంతర్జాతీయంగా కూడా ఆయన్నెవరూ లెక్కచేయకపోవడం ఆశ్చర్యం. అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఆయన్ను చూసి దూరంగా జరుగుతున్నారు. గ్లోబల్ గా వంటరి  అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
కరోనా విజృంభిస్తున్నపుడు ఆయన ప్రకటనలు అంతర్జాతీయ జోక్స్ అయిపోయాయి. ఇపుడు దేశవ్యాపితంగా, అన్ని వర్గాల ప్రజలు  నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయడ్ ను హత్యను నిరసిస్తూ ప్రదర్శనలు చేస్తున్నపుడు కూడా ఆయన వింత ప్రవర్తన బయటపడుతూ ఉంది. నిరసనకు భయపడి వైట్ హౌస్ బంకర్ లోకి పారిపోవడం ఆయనకున్న బలహీనతను బాగా  చూపెట్టింది. అమెరికా అధ్యక్షుడిలా నిరసన ప్రదర్శనలకు వణికిపోవడం వింతగా ఉంటుంది.
ఒక తెల్ల దురహంకారి ఒక చిన్న నేరానికి ఫ్లాయడ్ ను మెడమీద మోకాలు పోడి ఊపిరాడకుండా అదిమి పట్టి  హత మార్చినందుకు నిరసన అన్ని వర్గాల ప్రజలు తిరగబడుతున్నారు. ప్రపంచాధినేత అయిన తనని ఎవరూ లెక్కచేయకుండా ఇలా  తిరగబడటమేమిటో ఆయన అర్థం కాలేదు. అమెరికా ప్రజలు తనని లెక్క చేయడం లేదని ఆందోళన ఆ మనిషిలో పెల్లుబుకు తూ ఉంది. అందుకే రాష్ట్రాల గవర్నర్ లకు పిలుపునిస్తూ మీరు బలహీనులని బయటపెట్టుకోవద్దండని రెచ్చగొట్టాడు. బలం ప్రయోగించండి, వాళ్ల భరతం పట్టండని హూంకరించాడు. మీ దగ్గిర బలగాలు లేకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ గార్డ్స్ ను వాడుకోండని పిలుపు నిచ్చాడు. ఆమెరికాలోని ఏ నగరమయినా, రాష్ట్రమయినా ఈ అల్లర్లను ఆపలేకపోతే, ప్రెసిడెంట్ ఆఫ్ లా అండ్  అర్డర్  గా నేనే దూకుతా నని హెచ్చరించాడు. మీరాపని చేయకపోతే,ఇక నేను సైన్యాన్ని రంగంలోకి దించుతానని బెదించాడు.
“If a city or state refuses to take the actions that are necessary to defend the life and property of their residents, then I will deploy the United States military and quickly solve the problem for them.”
సైన్యాన్ని నిరసనకారులమీదకు తోలడానికి సైన్యం అంగీకరించలేదు. అంతేకాదు, ఈ విషయాన్ని నిర్మొహమాటంగా పబ్లీకునే చెప్పేశారు అధికారు. మొదట ట్రంప్ ప్రతిపాధనకు వ్యతరేక స్వయాన డిఫెన్స్ సెక్రటెరీ మాస్క్ ఎస్పర్ (Mark Esper) నుంచి వచ్చింది. ఇలా ఉళ్లో జరిగే పంచాయతీలకు దేశరక్షణ బాధ్యతలు నిర్వర్తించే సైన్యాన్ని పంపడం సాధ్యం కాదని ఎస్పర్ నిర్మొహమాటంగా తన బాస్ కు చెప్పేశారు.  ఇలా డిఫెన్స్ సెక్రెటరీ ఎదురుమాట చెప్పడం  గతంలో  జరిగిఉండదు.అమెరికా వ్యవస్థలో ఇలాంటి వ్యతిరేకత సాధ్యంకాదు. ఎందుకంటే, సెక్రెటరీలు ఎన్నికల్లో గెలిచిన వచ్చిన వాళ్లుకాదు. దేశాధ్యక్షుడు నియమించుకున్న ‘తన వాళ్లు’
మూడు రోజుల కిందట హూస్టన్ కు చెందిన ఒక పోలీసాఫీరు కూడా ట్రంప్ ను నోరు మూసుకోఅన్నాడు. పోలీసులంటే జనాల్ని ఉతికే వాళ్లుకాదు, వాళ్లతోకలసి పనిచేయాల్సిన వాళ్లు, సరైన సలహాలు ఇవ్వడం చేతకాకపోతే, నోరు మూసుక్కూచ్చో అన్నాడు. ఇదిజరిగిన మూడు మూడు నాలుగు రోజులు కాలేదు ఇపుడు ఏకంగా డిఫెన్స్ సెక్రెటరీ ట్రంప్ ను వ్యతిరేకంచి నిరసనకారుల మీదకు సైన్యాన్ని పంపడం సరికాదన్నారు. ఎవరికి ఈ సలహా ఇచ్చారు, సర్వసైన్యాధిపతికి.
“The option to use active-duty forces in a law enforcement role should be used as a matter of last resort and only in the most urgent and dire situations.”అని ఎస్పర్ అన్నట్లు AlJazeera రాసింది.
దీని తర్వాత మిలిటరీ సీనియర్ అధికారులు ఇలాగే మాట్లాడటం మొదలుపెట్టారు.