టిఆర్ ఎస్ అంటే కొత్త అర్థం చెబుతన్నరేవంత్

మల్కాజ్ గిరి కాంగ్రెస్   లోక్ సభ్యుడు ఎ  రేవంత్ రెడ్డి గొంతు కలిపితే ఏచర్చయినా వేడెక్కతుంది. ఈ రోజు ఆయన టిఆర్ ఎస్  (TRS) అనే మాటకు కొత్త అర్థం చెప్పారు. TRS అంటే Total Reverse Stand అని అన్నారు.

దీనికి ఉదాహరణకు ఆయన ఇపుడు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హాటాట్ గ  చర్చ జరుగుతున్న ఐటి ఐఆర్ (Information Technology Investment Region)ను పేర్కొన్నారు.

ఈ సబ్జక్టు మీద మాట్లాడుతూ,  ఐటీఐఆర్ విషయంలో బీజేపీ ,టీఆరెస్ ఇద్దరిది దొంగాటే అని ఆయన వ్యాఖ్యానించారు.

“ఐటీఐఆర్ కు నాడు కాంగ్రెస్ అప్రూవల్ ఇచ్చింది. ఏడేళ్లయినా ఐటీఐఆర్, పై టీఆరెస్ కనీసం డిపిఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్ ను కోల్పోయింది,” అని రేవంత్ రెడ్డి అన్నారు.

టీఆరెస్ ..అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అంటే  ఇదే అన్నారు.

ఐటీఐఆర్ కు పోరాడతామని అనకుండా  ఐటిఐఆర్ కు సమానమైన పాకేజీ  ..కేటీఆర్ ఇవ్వాలనడం దారుణం కాదా అని ఆయన ప్రశ్నించారు.

కేటీఆర్  మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, కెటీఆర్ దగ్గర అసలు ప్రణాళిక నే లేదు .  కెటిఆర్  ఐటిఐఆర్ మీద ఇలాంటి లెటర్ రాయడం ఏంటి ?,’ అని రేవంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఏడేళ్లయినా టిఆర్ ఎస్ ప్రభుత్వం ఐటిఐఆర్ మీద ఎందుకు డిపిఆర్ పంపించలేదు? అనే ప్రశకు ఆయనే సమాధానమిచ్చారు.

“కమిషన్ లు వచ్చేదుంటే ఐటీఐఆర్ కు కూడా కేసీఆర్ డిపిఆర్ ఇస్తుండే. కమిషన్ లు వచ్చినందుకే కాళేశ్వరం డిపిఆర్ లేకుండానే నిర్మించాడు. ఇక్కడ ఇలా ఉంటే, దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతావుంది,’ అని రేవంత్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *