టిఆర్ ఎస్ కు ధీటైన జవాబిస్తున్న బండి సంజయ్

ఈ రోజు కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్దం చేయడాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు.సిఎం కెసిఆర్ మీద  సంజయ్ చేస్తున్న దాడికి నిరసనగా టిఎస్ వి దిష్టి బొమ్మ దగ్దం చేయాలనుకుంది. అయితే, బిజెపి అడ్డగించింది. పోలీసులొచ్చారు. గుంపును చెదరగొట్టారు. ఇంత రూలింగ్ పార్టీ కార్యక్రమాన్ని అడ్దుకునేంతగా తెలంగాణలో బిజెపి బలపడటమే ఆశ్చర్యం. ఎందుకంటే టిఆర్ ఎస్ పుట్టినప్పటినుంచి కెసిఆర్ తో  ఘర్షణ పడి బతికి బట్ట కట్టిన వాళ్లెవరూ లేరు. ఉద్యమంలో ఉన్నపుడు ఆయనను వ్యతిరేకించి వాళ్ల చాప్టర్లన్నీ అసంపూర్ణంగానే ముగిశాయి. వాళ్లెవరూ ఇపుడు ఫీల్డ్ లో  కనిపించరు, వార్తలో కూడా వాళ్ల పేర్లు వినిపించవు. ఇక రాజకీయంగా తలపడిన పార్టీలు కూడా ఫసక్ అయిపోయాయి. ఇపుడా పరిస్థితి పోయిందా?

ఎదిరించిన నిలబడిన వాళ్లలో కొందరు  అంటే కేశవరావు, డిఎస్ లాంటి ఆయన రాజీ అయి లభ్దిపొందారు.  ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి లబ్ది పొందారు. లేదు కెసిఆర్ తో పోరాడతాం అన్నవాళ్ల పోరాటం ఒక అంగుళం ముందుకు కదల్లేదు. తొలిసారి బిజెపి కెసిఆర్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. తలపడుతున్నారు.క్యాడర్ ఇన్స్పైర్ చేస్తున్నారు. ఈరోజు కరీంనగరలో సంజయ్ దిష్టిబొమ్మనుదగ్దం చేయాలనుకున్న టిఆర్ఎస్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. టిఆర్ ఎస్ తో
ఇపుడు కయ్యానికి సిద్ధమంటున్న పార్టీ ఒక్కటే ‘సంజయ్ బిజెపి’. ఇదెంతకాలంనడుస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *