ఉత్తమ్, జగ్గారెడ్డి పఠాన్ చెరు వద్ద అరెస్టు

తెలంగాణప్రాజెక్టుల సందర్శన కోసం బయలు దేరినతెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీనియర్ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గారిని పఠాన్ చెర్వు టోల్ గేట్ వద్ద పోలీసుల అరెస్టు చేశారు.

 ప్రాజెక్టుల పరిశీలన పేరుతో కాాంగ్రెస్ పార్టీ జలదీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు.

ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కృష్ణా పరవాహక ప్రాంత ప్రాజెక్టు లను సందర్శించేందుకు వెళ్లిన నేతలను అరెస్టు చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు వెళ్లనున్న పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలను అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సాగుతున్నవని కమిషన్ ప్రాజక్టులని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రికెసిఆర్ కు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ పెండింగ్ ప్రాజక్టుల మీద లేదని వ్యాఖ్యానించారు. గతంలో మంజీరా డ్యాంను కాళేశ్వరం జలాలతో నింపుతామన్నారు. ఇపుడు పట్టించుకోవడం లేదు. మంజీరాడ్యాం ఎండిపోయిన సంగారెడ్డి ప్రజలు నీళ్లకోసం నానాయాతన పడుతున్నారు.తక్కువ ఖర్చతో గ్రావిటీ ద్వారా నీరందించే ప్రాజక్టులను పట్టించుకోకుండా కమిషన్లకోసం ప్రాజక్టులను చేపడుతున్నారు. అందుకే 1000 కోట్లు ఖర్చుచేస్తే చాలు 30 టిఎంసి నీళ్లిచ్చే ఎస్ ఎల్ బిసి నిర్మాణం పక్కన పడేశారు.ఇపుడు కాంగ్రెస్ నేతలు ప్రాజక్టులను సందర్శిస్తుంటే ఆడ్డుకోవాలని చూస్తున్నారు. పోలీసుల కెసిఆర్ ప్రవేటు సైన్యంగా మారారు : అని ఉత్తమ్ విమర్శించారు.