ఈ కూలీ చత్తీష్ గడ్ కు ఇలా వెళ్తున్నాడు, ఎన్నాళ్లకు చేరతాడో….

కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి పోవడంతో చాలా మంది కూలీలు తమ రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగంలో  ఎక్కువ మంది బీహారీ, చత్తీష్ గడ్  కూలీలు ఉన్నారు.  నిర్మాణ పనులలో స్థానికులంటే వారే ఎక్కువ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఈ పోటోల ఉన్న వ్యక్తి పేరు బీహారీ. చత్తీష్ గడ్ రాష్ట్రానికి చెందిన వాడు.
కడపలో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.  లాక్ డౌన్ తో ఆయన ఉపాధి కోల్పోయాడు. మళ్లీ తనకు ఉపాధి ఎపుడు దొరుకుతుందో ఆయన అంతుబట్టడం లేదు. అందుకే వూరెళ్లిపోవాలనుకున్నాడు, కాలినడకన. ఆయన ఎనిమిది సభ్యులున్న కుటుంబం, ఇందులో ఇద్దరు చిన్న పిల్లలు. వారిని ఇలా కావడిలో కూర్చో బెట్టి చత్తీష్ గడ్ బయలు దేరాడు
ఎన్నాళ్లకు పోతాడో తెలియదు, ప్రయాణం ఎలాసాగుతుందో తెలియదు. దారిపొడుగునా తిండితిప్పలెలాగో తెలియదు.
అయినాసరే ఆంధ్ర వదలి వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే,  తన కుటుంబ సభ్యులు 8 మందితో కలిసి కాలినడకన బయలు దేరాడు.దారెటో తెలియదు. కర్నూలు జిల్లా  ఎమ్మిగనూరులో వీరి పరిస్థితి గమనించిన కానిస్టేబుల్ జగదీష్ ప్రత్యేక వాహనంలో వారిని  కర్నూలుకు పంపారు . ఈ పోటో కర్నూలులో తీసినది.