అమరావతిలో టెన్షన్… టెన్షన్ … .జిఎన్ రావు కమిటీ మీద ఆగ్రహం

అమరావతి ఆంధ్రప్రదేశ్  సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధాని వికేంద్రీకరణ మీద నివేదిక సమర్పించిన జిఎన్ రావుకమిటీ నివేదిక మీద రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు.  అక్కడ సీఎం జగన్ బ్యానర్లు తొలగించి సచివాలయం వైపు పరుగులు తీశారు. రాజధానిని విశాఖ పట్టణానికి తరలించేందుకుసిఫార్సు చేసిన జిఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా రైతుల అర్ధనగ్న ప్రదర్శన ప్రారంభించారు.
 అక్కడ ఏంజరుగుతున్నదంటే..

* స‌చివాల‌యం-మందడం, వై జంక్ష‌న్ వద్ద ధ‌ర్నా చేప‌ట్టిన రాజ‌ధాని రైతులు
* రోడ్డుపై భైటాయించి జీఎన్‌రావు క‌మిటీకి వ్య‌తిరేకంగా నినాదాలు
* జీఎన్‌రావు క‌మిటీ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణంలోకి తీసుకోలేద‌ని ఆరోప‌ణ‌
* రైతుల‌కు తీవ్ర అన్యాయం చేశార‌ని ఆగ్ర‌హం
* ర‌హ‌దారికి అడ్డంగా జేసీబీ పెట్టి ధ‌ర్నా చేయ‌డంతో రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం
* మీడియా స‌మావేశం అనంత‌రం స‌చివాల‌యం నుంచి జీఎన్‌రావు క‌మిటీ స‌భ్యుల‌ను మ‌రో మార్గంలో బ‌య‌ట‌కు తీసుకువెళ్లిన పోలీసులు