VRO లను Special RI లుగా మార్చండి, భారమేమీ ఉండదు: హరీష్ కు విజ్ఞప్తి

కొత్త రెవిన్యూ చట్టం (రెవిన్యూ యాక్ట్  2020) వచ్చాక రాష్ట్రంలో పని చేస్తున్న 5485 మంది గ్రామ రెవెన్యూ అధికారులు చాలా కష్టాలు పడుతున్నారని, అవమానాలు ఎదుర్కొంటున్నారని రెవిన్యూ అధికారుల సంఘం ఆర్థిక మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేసింది.

ఈ రోజు అసోసియేషన్ నేతలు  మంత్రిని కలుసుకుని తమ సమస్యల మీద ఒక వినతిపత్రం సమర్పించారు

కొత్త రెవెన్యూ చట్టం వచ్చి దాదాపుగా 5నెలలు గడుస్తున్నా వి ఆర్ ఓ ల సమస్యలు  పరిష్కారం కావడం లేదని,  రెవిన్యూ యాక్ట్ 10 /2020 ప్రకారము వీఆర్వోల పోస్టు రద్దు అయిందని, ఈ చట్టం రద్దు కన్నా ముందు అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ను కల్పించాలనివారు మంత్రిని కోరారు.

ఎలాంటి హోదా లేకుండా అపరిష్కృతంగా ఉన్న సదా బైనామలను గ్రామాల్లోకి తీసుకెళ్లి పరిష్కరించాలని కొంతమంది తహశీల్దార్లు వి ఆర్ వోలను ఇబంది పెడుతున్న విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  భూములకు సంబందించిన పనులు వి ఆర్ ఓ లు చేయవొద్దని మాత్రమే ప్రధాన కార్యదర్శి  ఆదేశించారని, కాని కలెక్టర్లు/తహశీల్దార్లు చేయమని స్పష్టత లేని అవమానకరమైన అనవసరమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు మంత్రికి తెలిపారు.

వినతి పత్రంలో పేర్కొన్న డిమాండ్లు:

*ఇప్పుడున్న సీనియర్ అసిస్టెంట్ ఖాళీలలో అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులను భర్తీ చేయాలి

*వీఆర్వోల సీనియారిటీ కి ఎలాంటి ఆటంకం కలగకుండా వారి సీనియారిటీని యధావిధిగా కొనసాగించాలి

*విధి నిర్వహణలో ఉండి మరణించిన విఆర్వోలు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి

*12 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి విఆర్వో లకు 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ ని ఇవ్వాలి

*రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి

*సబార్డినేట్ సర్వీసు రూల్స్ 2004 ప్రకారము 8 గంటల డ్యూటీ మాత్రమే చేయించాలి

*వీఆర్వోల సర్వీస్ బుక్కుల అప్డేట్ చెయ్యాలి

*రాష్ట్రంలో కొంతమంది విఆర్వోలు ఆకారణంగా సస్పెన్షన్కు గురయ్యారు వారిని ఎలాంటి షరతు లు లేకుండా ఉద్యోగంలో నియమించాలి

*ఇప్పుడున్న వీఆర్వోలను ఇతర శాఖలకు డిప్యుటేషన్ పంపించినప్పుడు వారికి 24 గంటలు డ్యూటీ చేయమని కొంతమంది అధికారులు ఆదేశాలు జారీ చేశారు కాని సబార్డినేట్ సర్వీసు రూల్స్ 2004 ప్రకారము ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన 8 గంటల సర్వీస్ మాత్రమే చేయాలని ఉన్నది కాబట్టి వీఆర్వోలకు ఎనిమిది గంటలే డ్యూటీ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలి

*వి ఆర్ వోల నామకారణం రద్దయినందున వారిని special Ri /Jr asst ga (common seniority ) తో Conversion చేయాలి

*జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలి

మంత్రి  హరీష్ రావు  సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వి ఆర్ ఓ ల సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారని విఆర్ వో ల  రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్ , సహా అధ్యక్షులు కాందారి భిక్షపతి, ఉపాధ్యక్షులు…మౌలానా ఆశన్న.రమేశ్వర్ రావు..రమేష్ ..ప్రచార కార్యదర్శి.రాజన్నలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *