త్రిశంకు స్వర్గంలో తెలంగాణ విఆర్వోలు

*భూ సంబంధ పనులు వీఆర్వోల ద్వారా చేయించడం భావ్యం కాదు
*వీఆర్వో పోస్టుల రద్దయి దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక కలెక్టర్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు

*వీఆర్వోలను ఏ హోదాతో ఈ పనులు చేయమంటారు
*సి ఎస్  భూమికి ఈ పనులు వద్దంటారు, కలెక్టర్లు చేయు మంటారు
*విఆర్వో లో పోస్టులు రద్దయి దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. 

 

ప్రభుత్వం విఆర్ వోలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ల బాధలు వినకుండా వాళ్ల సమస్యలు పరిష్కరించకుండా  సాదాబైనామా పేరుతో గ్రామాలకు వెళ్లి పరిష్కారం చేయాలని ఒత్తిడి చేయడం పట్ల తెలంగాణ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

తమ సమస్యలు పరిష్కరించకుండా ఒత్తిడి తీసుకువచ్చి భూ సంబంధిత పనులు చేయమంటే  ఇబ్బంది పెట్టినట్లేనని అంటూ
తమ కంటూ ఒక హోదాను కల్పిస్తూ హోదా కన్వర్షన్ చేస్తూ
జాబ్ చార్ట్ నిర్ధారించి మాత్రమే పనులు చెప్పాలని ఈ సంఘం
రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్  లు ఒక ప్రకటనలో కోరారు.

వీఆర్వో ఉద్యోగాలు రద్దు చేసినందున తమ కుటుంబాలు ఇప్పటికే ఆందోళనకు గురై మానసిక సంక్షోభంలో పడ్డాయని తమకు  ఉపశమనం కల్గించేందుకు ప్రస్తుతం తామున్న  త్రిశంకు స్వర్గం నుంచి వెంటనే విముక్తి కల్గించాలని వారు ముఖ్యమంత్రి కెసిఆర్  కు విజ్ఞప్తి చేశారు..

ముఖ్యమంత్రి  ఆదేశాలను అమలు చేయకుండా ఉన్నతాధికారులు ఆలస్యం చేస్తున్నారని చెబుతూ  దీనివలన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని వారు పేర్కొన్నారు.

‘రెవెన్యూ పాలన కుంట పడే అవకాశం 100% ఉన్నందున తహసీల్దార్ల మీద ఒత్తిడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయి అన్యాక్రాంతం అయితే వీఆర్వోలను బాధ్యుల్ని చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాము,’ అని వారు ప్రకనటలో పేర్కొన్నారు.

తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తమ సమస్యలను పరిష్కరించకుండా  ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో తాము ఒక నిర్ణయం తీసుకోక తప్పదని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  అపాయింట్మెంట్  ఇవ్వక పోవడం అవమాన పరిచినట్లే నని వారు అభిప్రాయపడ్డారు.

వీఆర్వోలను కన్వర్షన్ చేసి ఒక హోదా కల్పిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడదని కూడా వారు చెప్పారు. సమస్య ఉన్న సంఘాలను పిలిచి సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కల్పించటానికి ఉత్తర్వులు జారీ చేయాలని, PRC లో గ్రామ రెవెన్యూ అధికారులుందరికీ సీనియర్ అసిస్టెంట్ స్కేల్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ప్రకటన మీద తెలంగాణ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం సహా అధ్యక్షులు కందారి భిక్షపతి, ఉపాధ్యక్షులు మౌలానా ఆశన్న.రమేశ్వర్ రావు..రమేష్ . రామ్ చందర్ కల్చరల్ సెక్రటరీ,రాజన్న ప్రచార కార్యదర్శి కూడ సంతకాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *