తెలంగాణ ఆసుపత్రుల్లో కొత్తగా ఫీవర్ క్లినిక్ లు

తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీ ఆసుపత్రులలో కొత్తగా పీవర్ క్లినిక్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేజర్ ఆసుపత్రులన్నింటా వైద్య సేవలను పునరుద్ధరిస్తున్నందున కరోనా  జ్వరం రోగులు, ఇతర రోగులతో కలవకుండా నివారించేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వైద్య విద్యా శాఖ పరిధిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రులలో  శస్త్ర చికిత్సలతో పాటు అన్ని రకాల వైద్య సేవలను పునరుద్ధరించాలని వైద్య విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఆసుపత్రి సిబ్బందిభద్రత కోసం పిపిఇ లతో పాటు N95 మాస్కులను విధిగా వాడాలని ఆయన సూచించారు. అవుట్ పేషంట్ల కౌంటర్ దగ్గిర సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఆసుపత్రి వార్డులలో గుంపులు లేకుండా చూడాలని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు.
అయితే, ఆసుపత్రులలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని, దీనివల్ల జర్వబాధితులు, ఇతర రోగులకుండా నివారించవచ్చని డైరెక్టర్ సూచించారు. అవుట్ పేషంట్లలో ఎవరికైనా కరోనా సూచనలు కనిపిస్తే వారిని వెంటనే వేరు చేయాలని, ఐసిఎం ఆర్ ప్రతిపాదించిన కరోనా ప్రొటొకోల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా డైరెక్టర్ సూచించారు.
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి కోవిడ్-19 నోడల్ ఆసుపత్రులుగా పనిచేస్తాయని, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఐసోలేషన్ సెంటర్ గా కొనసాగుతుందని డైరెక్టర్ చెప్పారు.