Home Breaking హైదరాబాద్ బయట ఇంక అన్నిషాపులు ఒపెన్, ఆర్టీసి బస్సులు షురూ : కెసిఆర్

హైదరాబాద్ బయట ఇంక అన్నిషాపులు ఒపెన్, ఆర్టీసి బస్సులు షురూ : కెసిఆర్

274
0
రేప‌టి నుంచి హైద‌రాబాద్ సిటీలో మిన‌హా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్సులు న‌డుస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.
కేంద్రం  ప్రకటించిన లాక్ డౌన్ పొడిగింపు గైడ్ లైన్స్ ను దృష్టి లో పెట్టుకుని తెలంగాణలో నియమాల సడలింపు గురించి  ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతకు ముందు ఆయన కోవిడ్ 19 వ్యూహం గురించి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.
అయితే, కోవిడ్ నియంత్ర బాధ్యతను ఆయన ప్రజలకు అప్పగించారు. ప్రతిపౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఇంతవరకు గొప్పగా సాగింది, ఇక ముందు కూడా ఇలాగే అంతా నియమాలుపాటిస్తూ జాగ్రత్తగా కరోనాను నియంత్రించేందుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం లాగానే తెలంగాణాలో కూడా మే 31 దాకా లాక్ డౌన్  కొనసాగుతుందని  అప్పటిదాకా రాత్రి పూట కర్ఫ్యూ కూడా కొనసాగుతుందని చెప్పారు.
కంటైన్మంట్ జోన్లు తప్ప మిగతా జోన్లు అన్ని గ్రీన్ జోన్ లే నని ఆయన ప్రకటించారు.
కంటైన్ మెంట్ జోన్ల లో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. అక్కడ ఎలాంటి సడలింపు ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు మొదలవుతున్నాయని ఆయన తెలిపారు.   తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ బస్సులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు.
అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు మాత్రం నడవవు. ఇదే విధంగా ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు నడవవు. .
రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్‌ ను అనుమతిస్తున్నాం.
ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తలతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. పరిశ్రమలు కూడా వంద శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చు. కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది.
ఆయన ఇంకా ఏమి చెప్పారంటే…
ఆటోలు, టాక్సీలు న‌డుపుకోవ‌చ్చు నని ఆయనప్రకటించారు.ఆటోలో డ్రైవర్‌ +2, టాక్సీలో డ్రైవర్‌ +3 నియమం పాటించాలి. హైదరాబాద్ లో  సిటిబస్సులు, అంతర్రాష్ట్ర బస్ సర్వీసుల మాత్రం ఉండవు.
రాష్ట్ర‌మంతా సెలూన్లు తెరుచుకోవ‌చ్చు…
ఈ-కామ‌ర్స్ కు పూర్తి న‌డుపుకోవ‌చ్చు.
ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలను పూర్తిగా వందశాతం సిబ్బందితో  న‌డుపుకోవ‌చ్చు. ఇదే పరిశ్రమలన్ని ప్రారంభించేందుకు అనుమతినిస్తున్నాం. ఇక హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలని ఆయన సూచించారు.
మెట్రో రైళ్లు బంద్ కొనసాగింపు
పబ్ లు, బార్లు, రెస్టరెంట్లు, పంక్షన్ హళ్లు బంద్,  అన్ని మతాల ప్రార్థనా మందిరాలు, స్విమ్మింగ్ పూల్స్, ప్రదర్శనలు, పార్కులు, జిమ్ లు ఉండవు.  సమావేశాలు నిర్వహించడానికి వీళ్లేదు.
ఇదే విధంగా విద్యాసంస్థలు తెరిచేందుకు కూడా అనుమతి లేదు.
మాస్క్ తప్పని సరిగా ధరించాలి. లేదంటే వేయిరుపాయలు ఫైన్ ఉంటుంది.
భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణ చేయాలి. వ్యక్తి గత శానిటైజేషన్ బాగా పాటించాలని, ఇాది చాలా అవసరమని చెప్పారు.
ప్రతి షాపులో శానిటేషన్ లు వాడి కోవిడ్ నియమాలు పాటించాలి
కుటుంబ సభ్యులు తమ తమ చిన్న పిల్లలను, వృద్ధులను ఇంట్లో నే ఉండే విధంగా చూడాలి