తెలంగాణలో దూసుకుపోతున్న కరోనా, ఈ రోజు 730 కేసులు

తెలంగాణలో  ఈ రోజు కరోనా కేసులుఅసాధారణంగా పెరిగాయి. కేసులు రోజుకు పెరుగుతున్నాయిగాని, ఇలా ఈ రోజు ఏకంగా రాష్ట్రంలో కరోనా కేసులు 730 నమోదవుతాయని ఎవరూ వూహించలేదు.  ఇందులో కూడా ఒక్క జిహెచ్ ఎంసి పరిధిలోనే 659 కేసులు నమోదయ్యాయి. శనివారంనాడు నమోదయిన  కేసులు కేవలం 546 మాత్రమే. ఇక జిహెచ్ ఎంసి పరిధిలో నిన్న 458  కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. దీనితో పోలిస్తే ఈ రోజు పెరుగుదల చాలా ఎక్కువ.

ఒక వైపు లాక్ డౌన్ అంక్షలు సడలించిన ప్రజలు షాపింగ్ లకు వచ్చేందుకు భయపడుతున్న సమయంలో కరోనా కేసులు ఇలా పెరగడం ఆందోళనకరమే.  ఇప్పటికే  గుళ్లలో జనాలులేరు. బస్టాండులలో అంతంతమాత్రమే.బంగారు షాపులకు ఎవ్వరూ వెళ్లడం లేదు. రెస్టరెంట్లు నడవడం లేదు.మాల్స్ లో కూడా ప్రజలు పెద్ద రావవడం లేదు. కారణం, కరోనా భయం. ఈ భయాన్ని నిజంచేసే కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణ ఇతర జిల్లాలకు సంబంధించి జనగాం నుంచి 34 కేసులునమోదయ్యాయి. ఈ రోజు ఎపుడూ నెంబర్ టు గా ఉండే రంగారెడ్డి మూడో స్థానంలోకి పోయింది. మేడ్చల్ లో తొమ్మిదికేసులు, ఆసిఫా బాద్ లో మూడు కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ నుంచి ఒకటి, వరంగల్ నుంచి ఆరు కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా పరీక్షలు పెరిగి కొద్ది కేసులు పెరుగుతున్నాయ్. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదలచేసిన బులెటీన ప్రకారం ఆదివారం నాడు 3297 పరీక్షలు చేశారు.2567 కేసులు నెగటివ్ అనితెలితే 730 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7802కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3861. మొత్తం మృతుల సంఖ్య 210.