Home Breaking  పెద్ద గుట్ట కలర్ గ్రానైట్ మైనింగ్ ఆపేయండి: కొలన్ పల్లె గ్రామ సభ డిమాండ్

 పెద్ద గుట్ట కలర్ గ్రానైట్ మైనింగ్ ఆపేయండి: కొలన్ పల్లె గ్రామ సభ డిమాండ్

365
0

కొలన్ పల్లె గుట్టమీద సాగుతున్న కలర్ గ్రానైట్ తవ్వకాలను రద్దుచేయాలని గ్రామ సభ తీర్మానించింది. కొలన్ పల్లె వరంగర్ రూరల్ లో ఉంటుంది. ఒక అందమైన పల్లెటూరు. ఊరు పక్కనే పెద్ద గుట్ట ఉంటుంది. ఇది ఈ చుట్టుపక్కల వూర్లను ఆదుకుంటూఉంది. ఇక్కడి నుంచి ఈ వూర్ల పశువులకు మేత వస్తుంది. వర్షాకాలంలో ఈ గుట్టుమీద పడిన వర్షపు నీటితో ఈ ప్రాంత చెరువులు నిండుతాయి. ఇక్కడ పంటలు పండుతాయి. అయితే, ఇక్కడి గుట్టలో కలర్ గ్రానైట్ ఉందని తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు అక్రమంగా ప్రొక్లెయిన్ లతో  తవ్వడం మెదలు పెట్టారు. ఇలా తవ్వేస్తే కొద్ది రోజులకు ఈ గట్టు మాయవుతుంది. ఈ గ్రామాల పర్యావరణ దెబ్బతింటుంది. గ్రామాలకు పశుగ్రాసం ఉండదు, చెరువులకు నీళ్లు రావు. గ్రామాలు ఎడారి అవుతాయి. ఇదే గ్రామస్థుల  ఆవేదన. అందుకే ఈ అక్రమ మైనింగ్ నిలిపివేయాలని గ్రామ సభ తీర్మానించింది.

ఆ ఊరికి అన్నిరకాలుగా ఆదరువునిచ్చే పెద్దగుట్ట మీద కలర్ గ్రానైట్ క్వారీ తవ్వకాలకై ఏర్పాట్లు జరుగుతుండటం పట్ల గ్రామ సభ అభ్యంతరం చెప్పింది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ క్వారీ తవ్వకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించింది. ‘ఈ తవ్వకాలను మా గ్రామ సభ పూర్తిగా వ్యతిరేకిస్తూ తీర్మాణం చేసింది,’ అని  సర్పంచు రాజేందర్ వెల్లడించారు.

తర్వాత కొలన్ పల్లె   సర్పంచ్ రాజేందర్ అధ్వర్యంలో గ్రామస్తులంతా  వెళ్ళి
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్  కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారి మహేందర్ జీని కలిసి తమ తీర్మానాన్ని, ఒక మెమోరాండం ను సమర్పించారు.  జిల్లా కలెక్టర్ ను కలుద్దామనుకున్నామని, అయితే, ఆయన అందుబాటులో లేరని రాజేందర్ తెలిపారు.

అనంతరం, సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ గ్రామసభ అనుమతుల్లేకుండా  ఊరికి అన్నిరకాలుగా ఆదరువునిచ్చే పెద్దగుట్ట మీద కలర్ గ్రానైట్ క్వారీ తవ్వకాలకై ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రజా సంక్షేమం,పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ క్వారీ తవ్వకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

‘ఈ గుట్ట చుట్టూర ఉన్న జయరాం తండా, కొలన్ పల్లి,ఆరెగూడెం,కేశవపురం,కొండూరు, కొండాపురం,ఎర్రకుంట తండా గ్రామాల పశువులకు,మేకలకు ,గొర్రెలకు ఈ గుట్ట ఆదరువు. అవి మేతకు ఇక్కడి వస్తాయి. గుట్టను నమ్ముకుని పశువుల కాపరులు ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్కనారు. ఇతర మూగజీవాలు ఈ గుట్టను నమ్ముకునే ఉన్నాయి. ఇపుడు ఈ అక్రమ క్వారీ తవ్వకాల వల్ల మేత కరువై పశువులకు కష్టాలొస్తాయి.  ప్రజలకు ఉపాధి  పోతుంది. ఈ ప్రాంత పర్యావరణం నాశనమవుతుంది,’ అని రాజేందర్ అన్నారు.

‘అంతేగాకుండా పెద్దగుట్ట మీద కురిసిన వర్షాల వల్లనే చుట్టూర గ్రామాల్లోని చెరువులు,కుంటలు నిండి పంటలు పండుతున్నాయి. ఇపుడు ఈ తవ్వకాల వల్ల వెలువడే దుమ్ముధూళి కారణంగా పర్యావరణం కలుషితమై ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

క్వారీ బ్లాస్టింగ్ లతో గుట్టమీద అడవిలో ఉన్న వన్యప్రాణులు నశించిపోతాయి,’ అని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.

తమ గ్రామాల ప్రజల విజ్ఞప్తులను,గ్రామ సభల తీర్మాణాలను పరిశీలించి వెంటనే పెద్ద గుట్టపై కలర్ గ్రానైట్ తవ్వకాలను రద్దు చేయాలని ,గుట్టమీద మోహరించిన మోటారువాహనాలను తొలగించాలని గ్రామస్థులంతా  డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు.

రెవిన్యూ డివిజన్ అధికారిని కలిసిన వారిలో గ్రామ సర్పంచ్ రాజేందర్ ,వాసం సోమయ్య,వెంకటేశ్వర్లు,ఫణికర మోహన్ రాజు,జక్కుల రాజు,గజ్జి శ్రీనివాస్ ,గడ్డి వీరయ్య,చిట్యాల మురళి,తోట నర్సింగం,మూగల భాస్కర్ ,ముచ్చర్ల సోమ నారాయణ,సంక్రాంతి పరమేశ్ ,రాజేంద్ర ప్రసాద్ ,వంగల ప్రసాద్ ,పి.రాజు,బి.రాజు,బి.శేఖర్ ,ఎ.దయాకర్ ,టి.శ్రావణ్ ,ఎం.శ్రీధర్ ,సముద్రాల శ్రీకాంత్ ,పల్లె రాజు,తోట గణేశ్ ,ఎం.శ్రీను తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here