తెలంగాణ గ్రాజుయేట్లందరికి టిఆర్ ఎస్ సభ్యత్వం: కెటిఆర్ పిలుపు

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాయా వివిధ నియామాక ప్రక్రియల ద్వారా సంబంధిత శాఖల్లో లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశామని అవసరమైతే మరిన్ని ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని రాష్ట్రపురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు(కెటిఆర్) అన్నారు.
దీంతో పాటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టీఎస్ ఐపాస్ ద్వారా సుమారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా 15 లక్షల ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో కల్పించామని కూడా ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని  ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా ఆయా కుటుంబాల్లోని గ్రాడ్యుయేట్లు గుర్తించేలా ముందుకు పోవాలని ఆయన  పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.
ఈ రోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇంచార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన దిశానిర్దేశం చేస్తూ ఉద్యోగాల కల్పన మీద సమాచారం అందించారు.
ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం అందిస్తున్న పాలన ఫలాలు అందుతున్నాయని అన్నారు.
ఆయన ఇంకా ఏం చెప్పారంటే…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని ఈ నేపథ్యంలో లో అక్టోబర్1 నుంచి జరిగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.  ప్రతిపక్ష పార్టీలే దివాళా తీశాయి. వారికి ప్రజల్లోకి పోయేందుకు ఎజెండా దొరకని పరిస్థితి నెలకొంది
ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే యువతకు, విద్యార్థులకు సైతం టిఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా కి మెగా టెక్స్టైల్ పార్క్ వంటి వాటితో పాటు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నం. త్వరలోనే టి హబ్, టాస్క్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం.
ఖమ్మం జిల్లా కి అక్టోబర్ నెలలో ఐటీ టవర్ ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో బుగ్గపాడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ తో పాటు పెద్ద ఎత్తున మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నం.
టిఆర్ఎస్ పార్టీ తరఫున 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉంది. ఇందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేయాలి.