కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కెటిఆర్ సమావేశం

కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ  మంత్రి పీయూష్ గోయెల్ తో  తెలంగాణ ఐటి, పరిశ్రమల, మునిసిపల్ శాఖా మాత్యులు  కేటీఆర్ సమావేశమయ్యారు.
20202 ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో జరిగే బయోఏసియా సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి పలు ప్రాజక్టుల గురించి కూడా కెటిఆర్ ప్రస్తావించారు. కొన్ని ప్రాజక్టలకు అనుమతి తొందరగా మంజూరుచేయాలని కూడా కోరారు.
వరంగల్-హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ – నాగ్ పూర్ రెండు కొత్త కారిడార్ లు మంజూరు చేయాలని  కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.
హైదరాబాద్-బెంగళూర్-చెన్నై ను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడం చాాలా ప్రయోజనకరమని, దీని ఏర్పాటు గురించి ఆలోచించాలని కూడా ఆయన పీయూష్ ను కోరారు.
ఇందుకోసం వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, ఇదే అంశంపై దక్షిణాది మంత్రులకు ఇప్పటికే లేఖలు కూడా రాసినమని కేటియార్ కేంద్రమంత్రికి తెలిపారు.
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్ట్ తో పాటు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు మద్దతు ఇవ్వాలని కూడా ఆయన విజ్ఞప్తిచేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్ నిమ్జ్ (NIMZ)  కేంద్ర మంత్రి వాకబు చేశారు.
మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన పై అంశాలపైన వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందిని పీయూష్ గోయల్ ఆదేశించారు.