భార్యను మోసగించిన తెలంగాణ IPS ట్రెయినీ సస్పెన్షన్

తెలంగాణ కు చెందిన ట్రైనీ  ఐపీఎస్ కె వి మహేశ్వర్ రెడ్డిని కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది.
డిసెంబర్ 2 తేదీన ఐపిఎస్ కు ఆయనను ఎంపిక చేసిస్టు ఉత్తర్వులిచ్చారు. ఒక దళిత మహిళను  పెళ్లి చేసుకొని, ఐపిఎస్ కు ఎంపికయ్యాక ఆమెనుంచి విడిపోయేందుకు వత్తిడి తీసుకువస్తున్నాడని మహేశ్వర రెడ్డిమీద కేసు నమోదయింది.
తనను  మోసం చేశాడని, ఐపిఎస్ కు ఎంపికయ్యాక తనను వదిలించుకుని కట్నం కోసం మరొక వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని, దీనితో తనకు విడాలకులివ్వాలని వత్తిడితీసుకువస్తున్నాడని భావన బిరుదు (మాదిగ) అనే మహిళ  గతం లో ఫిర్యాదు చేసింది. భావన దక్షిణ మద్య రైల్వేలో పనిచేస్తున్నది.
 ఏడాదిన్నర క్రితం భావనను మహేశ్వరరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  కీసర రిజిస్ట్రార్ ఆఫీసర్ లో ఈ పెళ్లి  జరిగింది. దీనికి సంబంధించి అన్ని అధారాలున్నాయి.
మహేశ్వరెడ్డి కీసరకు  చెందిన వాడు. గత తొమ్మిది సంవత్సరాలుగా వారి మధ్య సంబంధాలుకొనసాగుతున్నాయి. 2018 ఏప్రిల్ తల్లితండ్రులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి సికిందరాబాద్ పద్మారావ్ నగర్ కలసి జీవిస్తున్నారుకూడా. ఇద్దరు కూడా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. అప్పటినుంచి వారి మధ్య ప్రేమ నడుస్తూ ఉంది. భావన తల్లితండ్రులు ఈ వివాహానికి ఒప్పుకున్నారు. దళిత మహిళతో వివాహాన్ని తమ తల్లితండ్రులు ఒప్పుకోరని, అందువల్ల ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత విషయాన్ని వాళ్లకి చెబుతామని ఆమె ను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని భావన పేర్కొంది. అయితే, ఐపిఎస్ కు ఎంపికయ్యాక ఆయన మనసు మారిపోయిందని, డబ్బు ఇస్తాను, విడాకులు తీసుకోవాలని వత్తిడి తీసుకురావడమ మొదలుపెట్టాడని ఆమె పిర్యాదులోపేర్కొంది. తర్వాతఆమే జాతీయ ఎస్ సి కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ముస్సోరీ ఐపిఎస్ అకాడమీకి కూడా ఫిర్యాదు చేసింది. ఇపుడాయన ప్రొబేషనరీగాఉన్నారు. తన ఫిర్యాదు లు పనిచేయకపోవడంతో ఆమె చివరకు సోషల్ మీడియాకు ఎక్కారు. మహేశ్వరరెడ్డి వ్యవహారం ఇలా రచ్చకెక్కింది.
ఆమె చేసిన ఫిర్యాదుమేరకు  ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 734/2019 తేదీ 27.10.2019 నమోదయింది. ఆయన మీద ఐపిసి సెక్షన్లు 498-ఎ,323, 506ల తొ పాటు ఎస్సి ఎస్టీ యాక్ట్ లోని 3(1),3(ఆర్), 3(ఎస్), 3(2)(వి)(ఎ) ల కింద హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
ఈమేరకు యుపిఎస్ సి , జాతీయ ఎస్ సి కమిషన్, ఎస్ విపి నేషనల్ పోలీస్ అకాడమీ లనుంచి నివేదికలు రావడంతో హోం శాఖ అప్పాయంట్ మెంట్ ఆఫర్ ను సస్పెండ్ చేసింది.ఈ కేసుల మీద ఇంకా విచారణ జరుగుతున్నందున ఈ చర్య తీసుకుంది.
అయితే, ఈ విచారణ పూర్తయ్యాక నియామకాన్ని మరొక సారి సమీక్షించడం జరుగుతుంది, మహేశ్వరరెడ్డికి రాసిన లేఖలో హోంశాఖ పేర్కొంది.