Home Breaking తెలంగాణలో మే 29 దాకా లాక్ డౌన్ పొడిగింపు, రేపటి నుంచి లిక్కర్ సేల్స్

తెలంగాణలో మే 29 దాకా లాక్ డౌన్ పొడిగింపు, రేపటి నుంచి లిక్కర్ సేల్స్

317
0
తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.అదే విధంగా రాష్ట్రంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు కూడా తెరుస్తారని ఆయన చెప్పారు. కంటైన్ మెంట్ జోన్లలోని 15 షాపులు మినహా అన్ని షాపులు తెరుస్తారని, ధరలు సగటున 15 శాతం పెరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.
‘తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీష్ గడ్ లలో వైన్ షాపులు తెరిచిపుడు ఇక్కడ  తెరవకుండా ఉంటడం కష్టం. ఎపుడో రద్దు చేసిన గుడుంబా మళ్లీ ప్రత్యక్షమవుతూ ఉంది.  ఈ పరిస్తితి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగకుండా ఉండాలంటే మద్యం షాపులు తెరవాలి. నూరుశాతం తెరవాలి. మే 6 వ తేదీనుంచే షాపులు మొదలవుతాయి. అయితే మాస్క్ లేని వారికి మద్యం విక్రయించరు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా షాపులు తెరుస్తారు,’ అని కెసిఆర్ ప్రకటించారు.

ఏడుగంటలకు పైగా కొనసాగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాలు ప్రకటించారు.

‘మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని, భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువనో, ఒంటి బిగువనో ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారమవుతుంద’ని అన్నారు.
ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని వెల్లడించారు.
‘రాష్ట్రమంతా రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇంతవరకు సాధించిన ప్రగతిని కాపాాడుకునేందుకు లాక్ డౌన్ ను మరింతకఠినంగా అమలుచేయాల్సి ఉంది. అందుకే  మే 29 దాకా లాక్డౌన్ పొడిగిస్తున్నాం. ప్రజలు తమ పనులన్నింటిని ముగించుకునిసాయంత్రం ఆరుగంటలకల్లా ఇంటికి చేరాలి. రాత్రి ఏడు నుంచి మరుసటి రోజు పొద్దున ఆరు గంటల దాకా కర్ఫ్యూ ఉంటుంది,’ అని ముఖ్యమంత్రిప్రకటించారు.
కెసిఆర్ ప్రకటించిన మరిన్ని ముఖ్యాంశాలు
మున్సిపల్ టౌన్ లాల్లో 50% షాప్స్ విడతల వారిగా ఓపెన్ చేసుకోవచ్చు. మండల కేంద్రాల్లో 100% షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు.రెడ్ జోన్లలో షాపులుండవు.
పదో తరగతి మిగతా పరీక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. కోర్ట్ ఆదేశాల మేరకు సోషల్ డిస్టన్స్ పెట్టి పరీక్షలు ఈ నెలలోనే పూర్తి చేస్తాం.
ఇసుక మైనింగ్ జరుగుతుంది. ఆర్టీఎ ఆఫీసులు పని చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లు అన్ని జరుగుతాయి.
10th మిగిలిన 8 పరీక్షల పేపర్లు ప్రతి హాల్లో 10 నుండి 15 మంది ఉండే తీరుగా సోషల్ డిస్టెన్స్ తో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహణ మే నెలలోనే పరీక్షలు. ఇంటర్ పేపర్ స్పాట్ వల్యువేషన్ రేపటి నుండి షురూ.
కరోనాతో మనం కలిసి బతకల్సిందే…
ఇప్పటి దాకా ప్రాణాలు రక్షించుకొన్నం ఇక మీదట కూడా జాగ్రత్తగా ఉండి మనల్ని మనమే రక్షించుకోవాలి
యువ పేద న్యాయవాదులను ఆదుకోవడానికి 25 కోట్ల నిధులు రాష్ట్ర చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటాయి. తక్షణమే 15 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి.మిగిలిన నిధులు విడతల వారీగా అందుబాటులో ఉంటాయి.
రైతు బంధు పథకం కొనసాగుతుంది.రైతుల రుణమాఫీ లో ఒక్క పైసా కూడా తగ్గదు, రు.1198 కోట్లు విడుదల చేస్తున్నాం. రేపటి నుంచే చెక్కులు రైతుల అకౌంట్లలో జమఅవుతాయి.
మే 15 తర్వాత బస్సులు నడిపే అవకాశం ఉంది.
గ్రీన్ జోన్ లలో ఆటోలు క్యాబ్ లు తిరగవచ్చు.